
మ్యాజిక్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై మధుసూదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ఫాగ్’ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ట్రైలర్ రిలీజ్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ తాజాగా హత్యకు గురైన వారి శరీరాలపై ఉండడమేంటనే సీన్ సినిమా కథపై ఆసక్తి రేపుతోంది. బహుశా ఆత్మ నేపథ్యంలో కథ ఉండొచ్చనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎంవీ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విరాట్‌చంద్ర, చందన, హరిణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ రిచ్‌గా ఉందనీ, కొత్త టెక్నాలజీతో వచ్చిన కెమెరా, కొత్త నటీనటులతో తెరకెక్కించిన సినిమా విజయమంతమవ్వాలని భరద్వాజ ఆకాక్షించారు. ఈ సినిమాకు సందీప్ సంగీతం సమకూర్చుతుండగా.. యల్లనూరు హరినాథ్, కె.సతీష్‌రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment