MV Reddy
-
గర్వంగా సిరా చుక్క చూపాలి
సాక్షి, మేడ్చల్ జిల్లా: ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని, గురువారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేసి గర్వంగా సిరా మార్క్‌ను చూపాలని మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల అధికారి, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. ఓట వేయడం బాధ్యతగా భావించాలన్నారు. బుధవారం మేడ్చల్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఓటర్ స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లరలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి వెయ్యి వాహనాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను సిబ్బంది బుధవారం రాత్రి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారని చెప్పారు. నియోజకవర్గంలో గుర్తించిన 258 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వీటికి మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. నియోజకవర్గంలోని 2,960 పోలింగ్ కేంద్రాలను 259 సెక్టార్లుగా విభజించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల విధుల్లో 20వేల మంది సిబ్బంది సహా పోలీసులు పాల్గొంటున్నారన్నా రు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థికి 9వాహనాలు.. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు అభ్యర్థి లేదా సంబంధిత ఏజెంట్లు 9 వాహనాలు మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఒక్కొ వాహనంలో డ్రైవర్ సహా నలుగురు మాత్రమే వెళ్లాలన్నారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం 6గంటల లోపే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఏజెంట్ల సమక్షంలోనే గంటసేపు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రిసైడింగ్ అధికారికి మినహా మరెవరికీ కేంద్రంలోకి సెల్‌ఫోన్ అనుమతి లేదన్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్దేశించిన డీఆర్సీ సెంటర్లకు ఈవీఎంలు తరలిస్తామన్నారు. అక్కడి నుంచి అదే రాత్రి కీసరలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిస్తామన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర మూడంచెల భద్రత ఉంటుందన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లను అభ్యర్థులు సహా వారి ఏజెంట్లు ఎప్పుడైనా పరిశీలించడానికి అవకాశం ఇస్తామన్నారు. ఎవరైనా అభ్యర్థి స్ట్రాంగ్‌రూమ్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్ఓ మధుకర్‌రెడ్డి, నోడల్ అధికారులు కౌటిల్య, సౌమ్య, శ్రీనివాస్‌రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధం
సాక్షి,మేడ్చల్ జిల్లా: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా నిర్వహించేందుకు జిల్లా అధికారయంత్రాంగం సిద్ధంగా ఉందని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు.పోలింగ్ స్టేషన్లు మొదలుకొని ఈవీఎం భద్రత, సిబ్బంది, పోలీసు భద్రత వంటి ఏర్పాట్లన్నీ చురుకుగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమా వేశం మందిరంలో జరిగిన మీడియా సమావేశం లో కలెక్టర్ ఎంవీరెడ్డి మాట్లాడారు. జిల్లాలో 2,110 పోలింగ్ స్టేషన్లు.12 వేల మంది సిబ్బంది, 8 వేలమంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు ఐదుగురు ఇఆర్ఓలు ,18 మంది ఏఇఆర్ఓలు,12 వేల మంది సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 19.87 లక్షల ఓటర్లు.. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప్ప ల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి జీహెచ్ఎంసీ పరిధిలోకి ఉండగా, మేడ్చల్ నియో జకవర్గం మాత్రం రూరల్ పరిధిలో ఉందన్నారు. తెలంగాణలో అత్యధికంగా జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 19,87,270 మంది కాగా,ఇందులో పురుష ఓటర్లు 10,45,502 మంది మహిళా ఓటర్లు 9,41,462 మంది ఉన్నారని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా 4,75,506 మంది ఓటర్లు ఉండగా, కూకట్పల్లి నియోజకవర్గంలో తక్కువగా 3,11,957 మంది ఉన్నారన్నారు. కుత్బుల్లాపూర్‌లో 4,33,519 మంది ఓటర్లు, ఉప్పల్‌లో 4,03,143 మంది, మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,63,145 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాకు 3,640 ఈవీఎంలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు 3,640 ఈవీఎంలతోపాటు 3,338 బ్యాలెట్ యూనిట్లు, 2,630 కంట్రోల్ యూనిట్లు, 2,850 వీవీ ప్యాడ్లు రానున్నాయన్నారు. వీటినంటిని శామీర్‌పేట వ్యవసాయ మార్కెటింగ్ గోదాములో భద్ర పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ గోదాముల వద్ద గట్టి పోలీసు బందోస్తుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సారి కొత్తగా ఓటు వేసిన ప్రతి ఓటరుకు రిషిప్ట్(రశీదు)వచ్చేవిధంగా వీవీ ప్యాడ్ ప్రింటర్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుందన్నారు. ఈవీఎంలపై ఓటర్లల్లో అవగాహాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 2,110 పోలింగ్ స్టేషన్ల ఉండగా, ఇందులో ఇందులో మేడ్చల్ నియోజకవర్గంలో 570, కుత్బుల్లాపూర్‌లో 431, కూకట్‌పల్లిలో 372, మల్కాజిగిరిలో 379, ఉప్పల్ నియోజకవర్గంలో 358 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు.జిల్లాలో ఈ నెల 25 వరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. ఓటరు నమోదులో భాగంగా కొత్తగా లక్ష నుంచి 1.50 లక్షల కొత్త ఓటర్లు రానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం(సెల్) అధికారి వెంకటేశ్వర్లు పాల్గోన్నారు. సైనికుల్లా పనిచేయాలి కీసరటౌన్: ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అధికారులు, సిబ్బంది సైనికుల్లా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సన్నాహాలపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ఓటర్ల ముసాయిదా సవరణపై వచ్చిన అభ్యంతరాలు, సవరణలపై ఆలస్యం లేకుండా పరిష్కరించాలన్నారు. బోగస్ ఓటర్ల తొలగింపునకు చర్యలు కీసరటౌన్: జిల్లాలో బోగస్ ఓటర్లు, మృతి చెందిన ఓటర్లు, బదిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డి రాష్ట్రఎన్నికల కమిషన్ ప్రధాన అధికారికి వివరించారు. శుక్రవారం ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో రజత్‌కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, అధికారులు సమన్వయంతో ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్య పర్చి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీ సమక్షంలో ఈవీఎంలను పరిశీలించాలన్నారు. జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుకర్‌రెడ్డి, ఆర్డీవోలు లచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
‘ది ఫాగ్’ సినిమా ట్రైలర్ విడుదల
మ్యాజిక్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై మధుసూదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ఫాగ్’ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ట్రైలర్ రిలీజ్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ తాజాగా హత్యకు గురైన వారి శరీరాలపై ఉండడమేంటనే సీన్ సినిమా కథపై ఆసక్తి రేపుతోంది. బహుశా ఆత్మ నేపథ్యంలో కథ ఉండొచ్చనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎంవీ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విరాట్‌చంద్ర, చందన, హరిణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ రిచ్‌గా ఉందనీ, కొత్త టెక్నాలజీతో వచ్చిన కెమెరా, కొత్త నటీనటులతో తెరకెక్కించిన సినిమా విజయమంతమవ్వాలని భరద్వాజ ఆకాక్షించారు. ఈ సినిమాకు సందీప్ సంగీతం సమకూర్చుతుండగా.. యల్లనూరు హరినాథ్, కె.సతీష్‌రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. -
ఉపాధి లక్ష్యంగా నిరుద్యోగులకు శిక్షణ
సాక్షి, మేడ్చల్ జిల్లా : ఉపాధి లక్ష్యంగా జిల్లా గ్రా మీణ అభివృద్ధి సంస్థ (డీ ఆర్డీఏ) నిరుద్యోగ యువ త వృత్తి నైపుణ్య శిక్ష ణ కా ర్యక్రమాలకు శ్రీకారం చు ట్టింది. ఎంప్లాయిమెంట్ జ నరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా మేడ్చ ల్– మల్కాజిగిరి జిల్లాలో 18 నెలల కాలంలో 129 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించిన డీఆర్డీఏ యువతకు ఉపాధి శిక్షణ లక్ష్యంగా త్వరలో కొత్తగా‘ వెబ్ పోర్టర్’ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నిరుద్యోగులు 10 లక్షల వరకు ఉంటారని అధికారుల అంచనా. పారిశ్రామిక కేంద్రానికి మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కావటంతో పరిశ్రమలు, సంస్థలు వేలల్లో ఉన్నాయి. దీంతో జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా వృత్తి నైపుణ్య త శిక్షణపై కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాతోపాటు హైదరాబాద్ నగర చుట్టు పక్కల ఉన్న 22 శిక్షణ కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇప్పించటంతోపాటు వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉపాధి (ప్లేస్మెంట్) అవకాశాలు కల్పించేందుకు డీఆర్డీఏ పీడీ కౌటిల్య నేతృత్వంలో జేడీఎం దివాకర్ చర్యలు తీసుకుంటున్నారు. పదోతరగతి, తత్సమాన పరీక్షల్లో పాస్ లేదా ఫెయిలైన 18– 30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులకు ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా ఉపా ధి శిక్షణ ఇస్తారు. ఐదు మండలాల్లో ఎనిమిది చోట్ల జాబ్‌మేళా నిర్వహించారు. 233 మందిని ఎంపిక చేసిన యంత్రాంగం మూడు నెలల పాటు ఉచిత భోజనం, యూనిఫాం, వసతి వంటి సదుపాయాలు కల్పించి ఉపాధి శిక్షణ ఇచ్చారు. 129 మందికి వివిధ సంస్థలు, పరిశ్రమల్లో ఉపాధి (ప్లేస్మెంట్)అవకాశాలు లభించాయి. ఇందులో ఘట్కేసర్ ఈజీఎంఎం సెంటర్లో 33 మంది మ హిళా నిరుద్యోగులకు మూడు నెలల పాటు ఉపా ధి శిక్షణ ఇవ్వగా, 29 మంది వివిధ సంస్థల్లో ఉద్యో గాలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం లభిస్తోందని డీఆర్డీఓ జిల్లా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఇంజనీరింగ్, ఫార్మసీలో 57,940 మందికి సీట్లు
- మొదటి కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు - కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లు 11,183 - యూనివర్సిటీ కాలేజీల్లో వంద శాతం కేటాయింపు - 100 ప్రైవేటు కాలేజీల్లో నూటికి నూరు శాతం భర్తీ - రెండు కాలేజీలకు ఒక్కరు కూడా ఆప్షన్ ఇవ్వలేదు - 9 మందిలోపే ఆప్షన్లు ఇచ్చిన కాలేజీలు మూడు - ఆప్షన్లు సరిగా ఇవ్వక ఏ కాలేజీలో సీట్లు రానివారు 8,626 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డి తొలిదశ ప్రవేశాల్లో భాగంగా సీట్లను కేటాయించారు. రాష్ట్రంలోని 308 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 69,123 సీట్లు అందుబాటులో ఉండగా 57,940 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మిగతా 11,183 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 21లోగా ట్యూషన్ ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో చలానా రూపంలో చెల్లించాలని, 22వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. చివరి దశ ప్రవేశాల కోసం ఈ నెల 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 27న సీట్లు కేటాయిస్తామని, 29 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. 66,566 మంది విద్యార్థులు 34,29,835 వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇందులో ఒక విద్యార్థి అత్యధికంగా 848 ఆప్షన్లు ఇవ్వగా, ఒక విద్యార్థి ఒకే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థుల్లో 57,940 మందికి సీట్లను కేటాయించారు. కేటాయింపు వివరాలను ఎంసెట్ వెబ్సైట్లో ఉంచారు. 8,626 మంది ర్యాంకులకు అనుగుణంగా ఆప్షన్లు ఇవ్వనందున ఏ కాలేజీలో సీటు లభించలేదు. ఇంజనీరింగ్ 8,906 సీట్లు మిగులు రాష్ట్రంలోని 198 ఇంజనీరింగ్ కాలేజీల్లో (14 ప్రభుత్వ, 184 ప్రైవేటు) కన్వీనర్ కోటాలో 66,695 సీట్లు ఉండగా.. అందులో 57,789 సీట్లు భర్తీ అయ్యాయి. 8,906 సీట్లు మిగిలిపోయాయి. ఈసారి బీ-ఫార్మసీలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 81 బీఫార్మసీ (ఎంపీసీ స్ట్రీమ్) కాలేజీల్లో 2,138 సీట్లు అందుబాటులో ఉండగా 116 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 2,022 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 29 ఫార్మ్-డి కాలే జీల్లో 290 సీట్లు అందుబాటులో ఉండగా.. 35 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 255 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. వంద ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే నూటికి నూరు శాతం సీట్ల కేటాయింపు జరిగింది. రెండు కాలేజీలకు ఒక్కరు కూడా ఆప్షన్ ఇచ్చుకోలేదు. మరో 3 కాలేజీల్లో 9 మందిలోపే విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లోని 30 బ్రాంచీల్లో ప్రవేశాలను చేపట్టినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. అందులో 19 బ్రాంచీల్లోనే వంద శాతం సీట్ల కేటాయింపు జరిగినట్లు పేర్కొన్నారు. ఇవీ సీట్ల కేటాయింపు వివరాలు.. కోర్సు కేటగిరీ కాలేజీల మొత్తం కేటాయించినది ఖాళీ కేటాయింపు% సంఖ్య సీట్లు సీట్లు ఇంజనీరింగ్ వర్సిటీ 14 3040 3040 0 100 ప్రైవేటు 184 63,655 54,749 8906 86.0 మొత్తం 198 66,695 57,789 8,906 86.6 బీఫార్మసీ(ఎంపీసీ) వర్సిటీ 3 80 36 44 45 ప్రైవేటు 78 2058 80 1,978 3.9 మొత్తం 81 2138 116 2,022 5.4 ఫార్మ్-డి ప్రైవేటు 29 290 35 255 12 మొత్తంగా 308 69,123 57,940 11,183 83.8 -
పాలిసెట్ వెబ్ ఆప్షన్లకు నేడు ఆఖరు
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్ వెబ్ ఆప్షన్ల గడువు ఈనెల 4వ తేదీతో ముగియనుంది. ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చుకోని విద్యార్థులు 4న కూడా ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. చివరి దశ వెబ్ ఆప్షన్లలో భాగంగా 11,911 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. వారికి 6న సీట్లను కేటాయిస్తామని, 8వ తేదీలోగా ఫీజు చెల్లించి, కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇక మొదటి దశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చి, సీట్లు పొందిన విద్యార్థులు చివరి దశ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఇప్పుడు సీటు అలాట్ అయితే మొదటి దశ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు ఆటోమెటిక్‌గా రద్దవుతుందని పేర్కొన్నారు. కాబట్టి మొదటి దశలో వచ్చిన సీటును వద్దనుకుంటనే ఈ చివరి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. -
రేపు పాలీసెట్ యథాతథం: కన్వీనర్ ఎంవీరెడ్డి
హైదరాబాద్: పాలీసెట్ పరీక్ష గురువారం యథాతథంగా జరుగుతుందని కన్వీనర్, సాంకేతిక విద్య డైరెక్టర్ ఎంవీ రెడ్డి స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణకు సహకరించేందుకు ముందుకు వచ్చిన ప్రైవేటు కళాశాలల జేఏసీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఇయన ఇక్కడ మీడియాకు వివరాలు వెల్లడించారు. 220 కళాశాలల్లో ఉన్న 54వేల సీట్లలో ప్రవేశాల కోసం పాలీసెట్‌ను 1,27,951 మంది రాయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 288 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 209 ప్రభుత్వ కళాశాలలు, 79 ప్రైవేటు కళాశాలు ఉన్నట్టు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని... పరీక్ష ప్రారంభానికి గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 120 ప్రశ్నలు ఉంటాయని, ఓఎంఆర్ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. -
పాలీసెట్ నిర్వహణపై తర్జనభర్జన
నేడు తుది నిర్ణయం: ఎంవీ రెడ్డి సాక్షి, హైదరాబాద్: పాలీసెట్-2016 పరీక్ష నిర్వహణపై సాంకేతిక విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 21న జరగాల్సిన పరీక్షకు విద్యార్థులంతా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, సిద్ధమైన సమయంలో కాలేజీలు నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడంతో కొంత గందరగోళంలో పడింది. పరీక్ష కేంద్రా ల కోఆర్డినేటర్లతో సంప్రదింపులు జరుపుతోంది. సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీ రెడ్డి మంగళవారం కూడా వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు సహకరించాలని యాజమాన్యాలను కోరారు. 75 శాతం కాలేజీల వారే సమావేశానికి హాజరయ్యారు. అందులో కొంతమంది పరీక్ష నిర్వహణకు సహకరించబోమని పేర్కొన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు ఏయే కాలేజీలు సహకరించవో రాత పూర్వకంగా తెలియజేయాలని ఎంవీరెడ్డి కోరారు. అలా రాతపూర్వకంగా ఇచ్చే కాలేజీల సంఖ్యను బట్టి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. ఆ తర్వాత అవసరమైతే ప్రస్తుతానికి వాయిదా వేస్తామని చెప్పారు. ఏదేమైనా బుధవారం ఉదయం వరకైనా యాజమాన్యా లు పరీక్ష నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జూనియర్, డిగ్రీ కాలేజీలు, హైస్కూళ్లలో పాలీసెట్ నిర్వహణకు కసరత్తు చేస్తున్నామన్నారు. కాలేజీలు సహకరించకపోతే మాత్రం వాయిదా వేయక తప్పదన్నారు. దీనిపై బుధవారం అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. -
‘తరగతి గదుల్లో సీసీ కెమెరాలు వద్దు’
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీల్లోని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవద్దని, కళాశాల ఆవరణ, వరండాలు, ప్రవేశ ద్వారాల్లోనే ఏర్పాటు చేయాలని సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీరెడ్డి పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన ప్రిన్సిపాళ్లతో వచ్చే నెల 21న పాలీసెట్-2016 నిర్వహణ, 2016-17 అకడమిక్ ప్రణాళికపై సమీక్షించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాలుగా ఉండే కాలేజీల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలయ్యేలా చూడాలి
ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి సాక్షి, హైదరాబాద్ : జిల్లాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, దీన్ని జిల్లాస్థాయిలో నోడల్ అధికారిగా అమలుచేసే బాధ్యత ఎస్సీశాఖ జిల్లా అధికారిదేనని ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జేడీలు ఆర్. వేణుగోపాలరావు, ఉమాదేవి, డిప్యూటీ డెరైక్టర్లు, సహాయ సంక్షేమ, అసిస్టెంట్ అకౌంట్స్, సీజీజీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లను కలుసుకుని, వివిధ శాఖలతో సమావేశాలు ఏర్పాటుచేసి బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిం చేలా చూడాలన్నారు. రాష్ట్రంలో సఫాయి కర్మచారీల పునరావాసంపై జిల్లా మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, అత్యాచారాలు, దాడులకు గురైన సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ బాధితులకు పరిహారాన్ని ఇవ్వడానికి ట్రెజరీ పరిమితులను ఎత్తేసి, గ్రీన్ ఛానెల్లో ఉంచినట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాధితులకు జిల్లా కలెక్టర్ ద్వారా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు. అన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చూడాలని కోరారు. -
ఎంపీడీఓలకే ‘ఉపాధి’ బాధ్యతలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండలస్థాయిలో ఉపాధి హామీ పథకం అమలు బాధ్యత ఇకపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులకే అప్పగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి పేర్కొన్నారు. జీఓఎంఎస్ 15 ప్రకారం ఎంపీడీఓలను మండల ప్రోగ్రాం అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అన్నిశాఖల అధికారులతో గ్రామసభలు నిర్వహించి కొత్తగా కార్యక్రమాలు రూపొందించాలని వారిని ఆదేశించారు. అదేవిధంగా క్షేత్రసహాయకులు, మేట్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలివ్వాలన్నారు. బుధవారం సచివాలయం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్‌పీటర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో తీసుకుంటున్న చర్యలు వివరించారు. అనంతరం ఎంపీడీఓలతో సమీక్షించి వారికి పైఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ హరితహారం కింద మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా కోటి మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. -
వికారాబాద్‌లో జిల్లాస్థాయి ‘బతుకమ్మ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను జిల్లాలో విజయవంతంగా జరపాలని జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో ఈ ఉత్సవాలను వికారాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24 నుంచి అక్టోబర్2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయి ఉత్సవాలకు కలెక్టర్ అధ్యక్షులుగా, డీఆర్డీఏ పీడీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయిలో మండల పరిషత్ ప్రెసిడెంట్ అధ్యక్షులుగా, ఎంపీడీఓ కన్వీనర్‌గా, గ్రామస్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈనెల 24నుంచి ప్రతిరోజు కలెక్టరేట్లో ఒక్కో శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ హరినారాయణన్, డీఆర్వో సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
అర్హత ఉంటే మళ్లీ కార్డులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటీవల రేషన్ కార్డుల ఏరివేతతో కార్డు కోల్పోయిన వారికి అర్హతను బట్టి తిరిగి పునరుద్ధరించాలని జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అలాంటి వారికి ఈనెల రేషన్ కోటా సైతం ఇవ్వాలని స్పష్టం చేశారు. పౌరసరఫరాలు, మీసేవ, సామాజిక సర్వే, రుణాల రీషెడ్యూల్ తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్ నుంచి మండల రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మీసేవ కేంద్రాలకు సంబంధించి 72వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రుణాల రీషెడ్యూల్‌పై బ్యాంకుల వారీగా పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్వో సూర్యారావు, డీఎస్ఓ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంత ధాన్యమైనా కొంటాం
పరిగి, న్యూస్‌లైన్: ధాన్యం ఎంత మొత్తంలోనైనా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జేసీ ఎంవీ రెడ్డి అన్నారు. గురువారం ఆయన పరిగిలో డీసీఎమ్మెస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పరిగిలోని మీసేవ కేంద్రం, తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. పింఛన్ లబ్ధిదారులు పడిగాపుల విషయంపై డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. పరిగి మండల వ్యవసాయ అధికారిణి రేణుకా చక్రవ ర్తి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేడీఏ విజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆమెకు ఒకరోజు వేతనం కట్ చేయటంతో పాటు మెమో జారీ చేయాలని జేడీఏను జేసీ ఆదేశించారు. మీసేవ కేంద్రంలో రూ.300 తీసుకుని 160 రూపాయలకు మాత్రమే రసీదు ఇచ్చారని ఓ వ్యక్తి జేసీకి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నామని తెలిపారు. 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీన్ని మించి ఎంతైనా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 4100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులు కొందరు టార్పాలిన్ల గురించి అడగ్గా సరఫరా చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు సమయానికి లారీల కాంట్రాక్టర్ లారీలు పంపించకుంటే స్థానికంగా అద్దెకు మాట్లాడుకుని పంపించాలని డీసీఎమ్మెస్ అధికారులకు జేసీ సూచించారు. కుల్కచర్ల మండలం చౌడాపూర్‌లో డీసీఎమ్మెస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని రైతులు కోరగా పరిశీలిస్తామన్నారు. జేసీ వెంట తహసీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డి, సివిల్ సప్లయ్ డీటీ అశోక్, డీసీఎమ్మెస్ పరిగి శాఖ మేనేజర్ శ్యాంసుందర్‌రెడ్డి, సిబ్బంది వెంకటేష్, రాములు తదితరులున్నారు. -
దళారీ వ్యవస్థను నిర్మూలిద్దాం
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పట్నం డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: దళారీ వ్యవస్థను నిర్మూలిద్దామని, రైతులంతా తమ ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2 ఎంవీ రెడ్డి సూచించారు. గురువారం ఆయన ఇబ్రహీంపట్నంలోని డీసీఎంఎస్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారుల పనితీరుపై మార్కెట్‌కు వచ్చిన రైతుల వద్ద ఆరా తీశారు. రైతాంగానికి అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని మార్కెట్ అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకోవాలంటే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ అధికారులు పలుమార్లు తిప్పుకుంటున్నారని రైతులు జేసీ వద్ద వాపోయారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అం దించకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. స్పం దించిన జేసీ.. తమ దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని, ఎరువులు, విత్తనాలు డీసీఎంఎస్ కేంద్రాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూ స్తానన్నారు. అదేవిధంగా రైతులకు అవసరమైన యంత్రాలు, పరికరాలను అం దుబాటులో ఉంచుతామన్నారు. ధాన్యా న్ని తీసుకొస్తున్న రైతులను ధ్రువీకరణ పత్రాల పేరిట ఇబ్బంది పెట్టొదని, పాస్‌పుస్తకాల నకలు తీసుకొస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. వరి ధాన్యంలో 17శాతం కంటే తేమ తగ్గకుండా, తాలు లేకుండా రైతులు జాగ్రత్త వహించాలని వివరించారు. డబ్బులు కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. ఆయన వెంట తహశీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఏడీఏ కవిత, డీసీఎంఎస్ సెంటర్ ఇన్చార్జి డి.మాధవి తదితరులు ఉన్నారు.