ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : జిల్లాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, దీన్ని జిల్లాస్థాయిలో నోడల్ అధికారిగా అమలుచేసే బాధ్యత ఎస్సీశాఖ జిల్లా అధికారిదేనని ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జేడీలు ఆర్. వేణుగోపాలరావు, ఉమాదేవి, డిప్యూటీ డెరైక్టర్లు, సహాయ సంక్షేమ, అసిస్టెంట్ అకౌంట్స్, సీజీజీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లను కలుసుకుని, వివిధ శాఖలతో సమావేశాలు ఏర్పాటుచేసి బ్యాక్‌లాగ్ పోస్టులు గుర్తించాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిం చేలా చూడాలన్నారు.
రాష్ట్రంలో సఫాయి కర్మచారీల పునరావాసంపై జిల్లా మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, అత్యాచారాలు, దాడులకు గురైన సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ బాధితులకు పరిహారాన్ని ఇవ్వడానికి ట్రెజరీ పరిమితులను ఎత్తేసి, గ్రీన్ ఛానెల్లో ఉంచినట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాధితులకు జిల్లా కలెక్టర్ ద్వారా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు. అన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చూడాలని కోరారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలయ్యేలా చూడాలి
Published Thu, Jul 9 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement