backlog posts
-
ఎస్బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు
ముం లో ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం.. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 1226(రెగ్యులర్–1100, బ్యాక్లాగ్–126) ► అర్హత:ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.12.2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష(ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్), స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: రాతపరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ 120 ప్రశ్నలు–120 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. డిస్క్రిప్టివ్ టెస్ట్‌ని 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్) నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.12.2021 ► వెబ్సైట్: sbi.co.in -
బ్యాక్లాగ్ పోస్ట్‌లు భర్తీ చేయండి!
సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజీ ఆదేశం ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధ్యాపక, అధ్యాపకేతర ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశించారు. యూనివర్సిటీలోని పరిపాలన, కార్యనిర్వహణ, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లు తదితర అంశాలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో ఉన్న పరిపాలనపరమైన పదవులు, పాలక మండలి సభ్యుల సంఖ్య, ఉద్యోగుల పదోన్నతుల అంశాలు, వారిలో ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే అంశాలను వర్సిటీ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వీస్ రిజిస్టర్లు సక్రమంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 నుంచి సర్వీస్ రిజిస్టర్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ఎందుకు ఆడిట్ చేయించలేదని ప్రశ్నించారు. చాలా కాలంగా వర్సిటీలో అధ్యాపక, అధ్యాపకేతర బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయటం లేదని, వాటి భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌కు సూచించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం, సమన్వయానికి వారం రోజుల్లో లైజన్ ఆఫీసర్‌ను నియమించాలని చైర్మన్ ఆదేశించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, పలువురు పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు వేల ఎస్సీ, ఎస్టీ బ్యాగ్‌లాగ్ పోస్టులను ఆయా శాఖలో భర్తీ చేశారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజి తెలిపారు. యూనివర్సిటీలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం మరో విడత ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. యూనివర్సిటీల్లో కుల వివక్షతను రూపుమాపాలని, అసమానతలకు తావివ్వకూడదని పేర్కొన్నారు. వర్సిటీల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. -
బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి
అనంతపురం : వర్సిటీలో కొన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ నాయకులు మంత్రి గంటాకు వినతిపత్రం అందజేశారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నాయకులు ఓబులేసు, శ్రీరాములు, ముత్యాలప్ప, మారెప్ప, రామలక్ష్మమ్మ, లోకమ్మ పాల్గొన్నారు. -
బ్యాక్లాగ్ పోస్టుల ఎంపిక జరిగేనా?
అధికారులపై తెలుగు తమ్ముళ్ల తీవ్ర ఒత్తిడి దండకాలు మొదలు పెట్టిన మరి కొందరు.. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల ఎంపిక జరిగేనా అనే అనుమానం తలెత్తుతోంది. ఈ పోస్టులను తమ వారికే ఇప్పించుకునేందుకు అధికారులపై అధికారపార్టీ నేతలు కొందరు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరికొందరు కులసంఘం పేరు చెప్పుకుని పోస్టులు ఇప్పిస్తామని దరఖాస్తుదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. బ్యాక్లాగ్ పోస్టులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు లేకుండా డైరెక్టుగా ఉద్యోగాలు ఇచ్చేస్తుండడంతో అర్హులైన వారికి ఉద్యోగాలు అనుమానంగానే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పోస్టులు 84 జిల్లాలోని వివిధ శాఖల్లో కొంత కాలంగా ఉన్న గ్రూప్–4, క్లాస్–4 బ్యాక్లాగ్ పోస్టుల కోసం ఇటీవల నోటిఫికేషన్‌ను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు విడుదల చేశారు. అందు కోసం ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు విధించారు. మొత్తం పోస్టులు 84 కాగా అందు కోసం 14,072 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పరిశీలించాల్సి ఉంది. ఇక్కడే అసలు తిరకాసు మొదలైంది. దరఖాస్తులు పరిశీలించి అనర్హులుగా ఉన్న వారి అప్లికేషన్లను తీసి వేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నాయకులు తమ వారి పేర్లను మాత్రం ఎట్టి పరిస్థితులలో తీసి వేయొద్దని, ఏమైనా సమస్యలు ఉన్నా వారికే ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూడాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొందరికి అన్ని అర్హతలు ఉన్నా వారి దరఖాస్తులను పక్కన పెట్టాలని హుకుం జారీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. వెయ్యి దరఖాస్తుల పరిశీలన ఇప్పటి వరకు సుమారు 1000 మంది దరఖాస్తులను పరిశీలించారని, వాటిలో సగానికిపైగా పక్కన పెట్టినట్లు సమాచారం. మొత్తంమీద బ్యాక్లాగ్ పోçస్టులపై అధికారపార్టీ నేతల కన్నుపడడంతో అర్హత కలిగిన వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉందని బాధితులు వాపోతున్నారు. దండకాలు మొదలు.. ఒక పక్క అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అనుమానంగా మారుతుంటే మరో పక్క ఓ కులసంఘంలో ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యక్తి బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పించేందుకు ఇప్పటి నుంచే రూ.లక్షల్లో దండకాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో కూడా జిల్లాలోని పలువురి వద్ద ‘మనీస్కీం’ పేరుతో రూ.లక్షల్లో డబ్బులు కట్టించుకుని ఎగవేసిన సంఘటనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై అప్పట్లో పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన అందరి వద్ద ‘చైర్మన్’ తమ వాడే అని చెప్పుకుంటూ దండకాలు మొదలు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారమే భర్తీ చేస్తాం: –మధుసూదన్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ బ్యాక్లాగ్ పోస్టులలో ఎన్ని ఒత్తిడులు మాపై వచ్చినా నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తాం. దరఖాస్తుల స్క్రూట్నీ ప్రస్తుతం జరుగుతోంది. ఉన్నతాధికారుల సమక్షంలో అన్ని నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తాం. -
వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
ఆదిలాబాద్ : వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను మెరిట్ ఆధారంగా అర్హత సాధించిన వారితో భర్తీ చేసినట్లు కలెక్టర్ జగన్మోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాక్లాగ్ కోటాలో 18 మంది వికలాంగులకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులను సంబంధిత అభ్యర్థులకు అందజేశారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారి మహిళ–1, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్–3, కార్యాలయం సబార్డినేట్–2, వాచ్‌మన్–1, కుక్–1, నర్సింగ్ ఆర్డర్లి–1, పబ్లిక్ హెల్త్‌వర్కర్–6, మహిళ వెల్ఫేర్ వర్కర్–1, ప్లాంటేషన్ లేబర్–1, కామాటి–1 పోస్టులు ఉన్నాయి. 18 మందిలో 9 అంధులు, 9 మందివికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వికలాంగ శాఖ ఏడీ వెంకటేశ్వర్లు తెలిపారు. -
రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలయ్యేలా చూడాలి
ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి సాక్షి, హైదరాబాద్ : జిల్లాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, దీన్ని జిల్లాస్థాయిలో నోడల్ అధికారిగా అమలుచేసే బాధ్యత ఎస్సీశాఖ జిల్లా అధికారిదేనని ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జేడీలు ఆర్. వేణుగోపాలరావు, ఉమాదేవి, డిప్యూటీ డెరైక్టర్లు, సహాయ సంక్షేమ, అసిస్టెంట్ అకౌంట్స్, సీజీజీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లను కలుసుకుని, వివిధ శాఖలతో సమావేశాలు ఏర్పాటుచేసి బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిం చేలా చూడాలన్నారు. రాష్ట్రంలో సఫాయి కర్మచారీల పునరావాసంపై జిల్లా మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, అత్యాచారాలు, దాడులకు గురైన సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ బాధితులకు పరిహారాన్ని ఇవ్వడానికి ట్రెజరీ పరిమితులను ఎత్తేసి, గ్రీన్ ఛానెల్లో ఉంచినట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాధితులకు జిల్లా కలెక్టర్ ద్వారా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు. అన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చూడాలని కోరారు. -
డీఎస్సీ పోస్టులకు కోత
విశాఖ రూరల్: అనుకున్నట్టే జరిగింది. డీఎస్సీ పోస్టుల్లో ప్రభుత్వం కోత విధించింది. జిల్లా విద్యా శాఖ నోటిఫై చేసిన వాటి కంటే 131 పోస్టులను తగ్గించింది. 1056 పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 232 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. సబ్జెక్టులు వారీ వివరాలు మాత్రం మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. జిల్లాలో ఉపాధ్యాయల పోస్టుల ఖాళీల అధికంగా ఉన్నప్పటికీ తక్కువ సం ఖ్యలో భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో డీఎస్సీ అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లాలో 2500 పోస్టులు వరకు ఖాళీలు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అయితే రేషనలైజేషన్ చర్యలతో పోస్టులను కుదించి 1714 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కూడా కోత విధిస్తూ విద్యా శాఖ అధికారులు 1187 పోస్టులను నోటిఫై చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో 131 పోస్టులను తగ్గిస్తూ 1056 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యా శాఖ నోటిఫై చేసిన వాటిలో ఎస్జీటీలో 117 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లో 11, పీఈటీలో 3 పోస్టులను తగ్గించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 1056 పోస్టుల్లో ఏజెన్సీలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు 232 ఉండగా ప్రస్తుతం 824 పోస్టులు ఉన్నాయి. అయితే రోస్టర్ విధానం, సబ్జెక్టుల వారీ ఖాళీలు, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో పోస్టుల వివరాలపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
బ్యాక్‌లాక్ పోస్టులు
ఒంగోలు టౌన్ : నాలుగు నెలలైనా నియామకాల్లేక ఎస్సీ,ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఊరిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ఆర్భాటంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ,ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రకటించడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. దరఖాస్తుల స్వీకరణ ముగిసి నాలుగు నెలలైనా ఇంతవరకు ఎలాంటి నియామకాలూ చేపట్టలేదు. అభ్యర్థులు మాత్రం ఏరోజుకారోజు బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన వివరాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్నారు. మరికొంతమంది అభ్యర్థులు ప్రకాశం భవనం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారంటూ కలెక్టరేట్లోని కనిపించిన ప్రతి అధికారి, సిబ్బందిని అడుగుతూనే ఉన్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో 38 ఎస్సీ,ఎస్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. ఈ ఏడాది జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు కలెక్టరేట్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. మొత్తం 7738 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 238 మంది అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు అందించకపోవడంతో వారి దరఖాస్తులను పక్కన పెట్టేశారు. భర్తీపై ‘పచ్చ’నీడలు ఎస్సీ,ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ‘పచ్చ’ నీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు ప్రతిదానిలో తమ మార్కు కనిపించుకునేందుకు పోటీ పడుతున్నారు. విద్యార్హతతో సంబంధం లేని పోస్టులను తమ ఖాతాల్లో వేసుకునేందుకు కొంతమంది తెలుగుదేశం నాయకులు తమకు అనుకూలంగా ఉన్న శాసనసభ్యుల ద్వారా అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొంతమంది ఒకడుగు ముందుకేసి బ్యాక్లాగ్ పోస్టులకు రేట్లు నిర్ణయిస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు సూచించిన వారిని కాదని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావని, అడిగినంత సొమ్ము ఇస్తే పోస్టు గ్యారంటీ అంటూ అభ్యర్థులకు వల విసురుతున్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో ఆలస్యం జరిగేకొద్దీ మాయాజాలంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా బ్యాక్లాగ్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. -
అక్ర‘మార్కులు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అక్రమాల తంతు బట్టబయలైంది. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాల పొందిన తీరు స్పష్టమైంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 47 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాంగం గతేడాది నోటిఫికేషన్ జారీచేసి భర్తీ ప్రక్రియ పూర్తిచేసింది. అయితే ఈ క్రమంలో 16 మంది అభ్యర్థులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ అక్రమాలను గుర్తించని అధికారులు.. సరిఫికెట్ల పరిశీలన పూర్తిచేసి వారికి ఉద్యోగాలిచ్చారు. అయితే నకిలీ సర్టిఫికెట్ల సమర్పణతో ఉద్యోగాలు పొందిన వైనాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 23న ‘బోగస్.. జాబ్స్’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఉలిక్కిపడిన యంత్రాంగం అక్రమాలను తేల్చేందుకు ఉపక్రమించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించింది. తాజాగా ఆ కమిటీ జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించింది. ఇందులో 10మంది అభ్యర్థుల జాతకాలు బయటపెట్టిన కమిటీ సభ్యులు, మరో ఆరుగురి లెక్క తేల్చేపనిలో ఉన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో.. బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అభ్యర్థి ఐదు, ఏడో తరగతి మార్కులకు ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు చేపట్టారు. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని కొందరు అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్ల తంతుకు తెరలేపారు. జిల్లాలోని పలు మండలాల్లోని పాఠశాలల నుంచి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వాటిని యంత్రాంగానికి సమర్పించారు. ఒక్కో అభ్యర్థికి మొత్తం 600 మార్కులకు గాను 595, 594, 593, 592, 591.. ఇలా 16 మంది 97శాతానికి పైగా మార్కులు వ చ్చినట్లు సర్టిఫికెట్లు సృష్టించి దరఖాస్తు చేశారు. అయితే సరైన పరిశీలన చేపట్టకుండా అధిక మార్కులు సాధించినందున జిల్లా యంత్రాంగం వారికి ఉద్యోగాలు కట్టబెట్టింది. ఇందులో పలువురు అభ్యర్థులు ఇప్పటికే ఉద్యోగాల్లో సైతం చేరారు. తాజాగా 10 మంది అభ్యర్థుల అక్రమాలకు సంబంధించి విచారణ కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో వారిపై జిల్లా యంత్రాంగం అతిత్వరలో వేటు వేయనున్నట్లు సమాచారం. సూత్రదారులు.. పాత్రదారులు నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంలో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ‘సాక్షి’ కథనం వెలువడిన అనంతరం బోగస్ అంశాన్ని తేల్చాలంటూ జిల్లా యంత్రాంగం విద్యాశాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డి బోగస్ అభ్యర్థుల సర్టిఫికెట్ల అంశాన్ని పరిశీలించి స్పష్టత ఇవ్వాలంటూ ఆయా మండల విద్యాశాఖ అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు. అయితే పరిశీలన పూర్తిచేసిన ఎంఈఓలు అక్రమాలు జరగలేదని, ఆ సర్టిఫికెట్లు సరైనవేనని సమాధానం ఇచ్చారు. దీంతో సంతృప్తిచెందని యంత్రాంగం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించింది. కమిటీ సభ్యులు లోతుగా పరిశీలించి అక్రమాలపై నిగ్గుతేల్చారు. ప్రస్తుతం 10 అభ్యర్థులు వివరాలతో కూడిన నివేదికను సమర్పించారు. మరో ఆరుగురు అభ్యర్థుల వ్యవహారంపై త్వరలో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలతోపాటు స్థానిక అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తొలిసారి పరిశీలన దారిమళ్లిందనే విమర్శలు వస్తున్నాయి. మొ త్తంగా కలెక్టర్ నిర్ణయంతో ఈ అధికారులపైనా వేటుతోపాటు క్రిమినల్ కేసులు సైతం నమోదుచేసే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. -
బ్యాక్లాగ్ పోస్టులకు భారీగా దరఖాస్తులు
ఏఎన్‌యూ, యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టుల నియామకాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, రోజువారీ వేతన సిబ్బందిలో అర్హులైన వారితో పాటు బయటనుంచి కూడా అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. మొత్తం 24 పోస్టులకు ఇప్పటివరకు 3వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. మార్చి 3వ తేదీ చివరితేదీ కావటంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. 3న జాతీయసదస్సు.. యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘ద చేంజింగ్ డెమైన్షన్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని సదస్సు డెరైక్టర్, విభాగాధిపతి డాక్టర్ జి.అనిత ఓ ప్రకటనలో తెలిపారు. రెండ్రోజులపాటు జరిగే ఈ సదస్సు ఈనెల 3వ తేదీన ప్రారంభమవుతుందన్నారు. గౌరవ అతిథులుగా భోపాల్ ఉపక్రమ్ ఎడిటర్ ఆచార్య సీకే సారధి, ఆంధ్రప్రదేశ్ ఐ అండ్ పీఆర్ మాజీ డెరైక్టర్ డాక్టర్ సీవీ నరసింహారెడ్డి పాల్గొంటారన్నారు. ఐ అండ్ పీఆర్ రీజినల్ జేడీ జో న్సన్ చోరగుడి కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. పరీక్షలు నిర్వహణ తేదీలు ఖరారు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఫిబ్రవరిలో యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన వివిధ కోర్సుల పరీక్షల ను వర్సిటీ వాయిదా వేసింది. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను ఖరారు చేశామని సీఈ డి.సత్యన్నారాయణ శుక్రవారం తెలిపారు. సంబంధిత ఉత్తర్వు లు అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు పంపామన్నారు.