బ్యాక్‌లాగ్ పోస్టులకు భారీగా దరఖాస్తులు
ఏఎన్‌యూ,
యూనివర్సిటీలో బ్యాక్‌లాగ్ పోస్టుల నియామకాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్, కాంట్రాక్ట్, రోజువారీ వేతన సిబ్బందిలో అర్హులైన వారితో పాటు బయటనుంచి కూడా అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు.
మొత్తం 24 పోస్టులకు ఇప్పటివరకు 3వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. మార్చి 3వ తేదీ చివరితేదీ కావటంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది.
3న జాతీయసదస్సు..
యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘ద చేంజింగ్ డెమైన్షన్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని సదస్సు డెరైక్టర్, విభాగాధిపతి డాక్టర్ జి.అనిత ఓ ప్రకటనలో తెలిపారు. రెండ్రోజులపాటు జరిగే ఈ సదస్సు ఈనెల 3వ తేదీన ప్రారంభమవుతుందన్నారు. గౌరవ అతిథులుగా భోపాల్ ఉపక్రమ్ ఎడిటర్ ఆచార్య సీకే సారధి, ఆంధ్రప్రదేశ్ ఐ అండ్ పీఆర్ మాజీ డెరైక్టర్ డాక్టర్ సీవీ నరసింహారెడ్డి పాల్గొంటారన్నారు. ఐ అండ్ పీఆర్ రీజినల్ జేడీ జో న్సన్ చోరగుడి కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు.
పరీక్షలు నిర్వహణ తేదీలు ఖరారు
సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఫిబ్రవరిలో యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన వివిధ కోర్సుల పరీక్షల ను వర్సిటీ వాయిదా వేసింది. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను ఖరారు చేశామని సీఈ డి.సత్యన్నారాయణ శుక్రవారం తెలిపారు. సంబంధిత ఉత్తర్వు లు అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు పంపామన్నారు.