ఎంవీ రెడ్డి
సాక్షి, మేడ్చల్ జిల్లా : ఉపాధి లక్ష్యంగా జిల్లా గ్రా మీణ అభివృద్ధి సంస్థ (డీ ఆర్డీఏ) నిరుద్యోగ యువ త వృత్తి నైపుణ్య శిక్ష ణ కా ర్యక్రమాలకు శ్రీకారం చు ట్టింది. ఎంప్లాయిమెంట్ జ నరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా మేడ్చ ల్– మల్కాజిగిరి జిల్లాలో 18 నెలల కాలంలో 129 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించిన డీఆర్డీఏ యువతకు ఉపాధి శిక్షణ లక్ష్యంగా త్వరలో కొత్తగా‘ వెబ్ పోర్టర్’ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో నిరుద్యోగులు 10 లక్షల వరకు ఉంటారని అధికారుల అంచనా. పారిశ్రామిక కేంద్రానికి మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కావటంతో పరిశ్రమలు, సంస్థలు వేలల్లో ఉన్నాయి. దీంతో జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా వృత్తి నైపుణ్య త శిక్షణపై కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాతోపాటు హైదరాబాద్ నగర చుట్టు పక్కల ఉన్న 22 శిక్షణ కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇప్పించటంతోపాటు వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉపాధి (ప్లేస్‌మెంట్) అవకాశాలు కల్పించేందుకు డీఆర్‌డీఏ పీడీ కౌటిల్య నేతృత్వంలో జేడీఎం దివాకర్ చర్యలు తీసుకుంటున్నారు.
పదోతరగతి, తత్సమాన పరీక్షల్లో పాస్ లేదా ఫెయిలైన 18– 30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులకు ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా ఉపా ధి శిక్షణ ఇస్తారు. ఐదు మండలాల్లో ఎనిమిది చోట్ల జాబ్‌మేళా నిర్వహించారు. 233 మందిని ఎంపిక చేసిన యంత్రాంగం మూడు నెలల పాటు ఉచిత భోజనం, యూనిఫాం, వసతి వంటి సదుపాయాలు కల్పించి ఉపాధి శిక్షణ ఇచ్చారు.
129 మందికి వివిధ సంస్థలు, పరిశ్రమల్లో ఉపాధి (ప్లేస్‌మెంట్)అవకాశాలు లభించాయి. ఇందులో ఘట్‌కేసర్ ఈజీఎంఎం సెంటర్‌లో 33 మంది మ హిళా నిరుద్యోగులకు మూడు నెలల పాటు ఉపా ధి శిక్షణ ఇవ్వగా, 29 మంది వివిధ సంస్థల్లో ఉద్యో గాలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం లభిస్తోందని డీఆర్‌డీఓ జిల్లా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment