ఇటీవల రేషన్ కార్డుల ఏరివేతతో కార్డు కోల్పోయిన వారికి అర్హతను బట్టి తిరిగి...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటీవల రేషన్ కార్డుల ఏరివేతతో కార్డు కోల్పోయిన వారికి అర్హతను బట్టి తిరిగి పునరుద్ధరించాలని జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అలాంటి వారికి ఈనెల రేషన్ కోటా సైతం ఇవ్వాలని స్పష్టం చేశారు. పౌరసరఫరాలు, మీసేవ, సామాజిక సర్వే, రుణాల రీషెడ్యూల్ తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్ నుంచి మండల రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో మీసేవ కేంద్రాలకు సంబంధించి 72వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రుణాల రీషెడ్యూల్‌పై బ్యాంకుల వారీగా పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్వో సూర్యారావు, డీఎస్‌ఓ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.