సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండలస్థాయిలో ఉపాధి హామీ పథకం అమలు బాధ్యత ఇకపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులకే అప్పగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి పేర్కొన్నారు. జీఓఎంఎస్ 15 ప్రకారం ఎంపీడీఓలను మండల ప్రోగ్రాం అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అన్నిశాఖల అధికారులతో గ్రామసభలు నిర్వహించి కొత్తగా కార్యక్రమాలు రూపొందించాలని వారిని ఆదేశించారు.
అదేవిధంగా క్షేత్రసహాయకులు, మేట్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలివ్వాలన్నారు. బుధవారం సచివాలయం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్‌పీటర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో తీసుకుంటున్న చర్యలు వివరించారు. అనంతరం ఎంపీడీఓలతో సమీక్షించి వారికి పైఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ హరితహారం కింద మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా కోటి మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు పేర్కొన్నారు.
ఎంపీడీఓలకే ‘ఉపాధి’ బాధ్యతలు
Published Thu, Nov 13 2014 12:21 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement