DRDA project
-
ఉపాధి లక్ష్యంగా నిరుద్యోగులకు శిక్షణ
సాక్షి, మేడ్చల్ జిల్లా : ఉపాధి లక్ష్యంగా జిల్లా గ్రా మీణ అభివృద్ధి సంస్థ (డీ ఆర్డీఏ) నిరుద్యోగ యువ త వృత్తి నైపుణ్య శిక్ష ణ కా ర్యక్రమాలకు శ్రీకారం చు ట్టింది. ఎంప్లాయిమెంట్ జ నరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా మేడ్చ ల్– మల్కాజిగిరి జిల్లాలో 18 నెలల కాలంలో 129 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించిన డీఆర్డీఏ యువతకు ఉపాధి శిక్షణ లక్ష్యంగా త్వరలో కొత్తగా‘ వెబ్ పోర్టర్’ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నిరుద్యోగులు 10 లక్షల వరకు ఉంటారని అధికారుల అంచనా. పారిశ్రామిక కేంద్రానికి మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కావటంతో పరిశ్రమలు, సంస్థలు వేలల్లో ఉన్నాయి. దీంతో జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా వృత్తి నైపుణ్య త శిక్షణపై కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాతోపాటు హైదరాబాద్ నగర చుట్టు పక్కల ఉన్న 22 శిక్షణ కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇప్పించటంతోపాటు వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉపాధి (ప్లేస్మెంట్) అవకాశాలు కల్పించేందుకు డీఆర్డీఏ పీడీ కౌటిల్య నేతృత్వంలో జేడీఎం దివాకర్ చర్యలు తీసుకుంటున్నారు. పదోతరగతి, తత్సమాన పరీక్షల్లో పాస్ లేదా ఫెయిలైన 18– 30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులకు ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా ఉపా ధి శిక్షణ ఇస్తారు. ఐదు మండలాల్లో ఎనిమిది చోట్ల జాబ్‌మేళా నిర్వహించారు. 233 మందిని ఎంపిక చేసిన యంత్రాంగం మూడు నెలల పాటు ఉచిత భోజనం, యూనిఫాం, వసతి వంటి సదుపాయాలు కల్పించి ఉపాధి శిక్షణ ఇచ్చారు. 129 మందికి వివిధ సంస్థలు, పరిశ్రమల్లో ఉపాధి (ప్లేస్మెంట్)అవకాశాలు లభించాయి. ఇందులో ఘట్కేసర్ ఈజీఎంఎం సెంటర్లో 33 మంది మ హిళా నిరుద్యోగులకు మూడు నెలల పాటు ఉపా ధి శిక్షణ ఇవ్వగా, 29 మంది వివిధ సంస్థల్లో ఉద్యో గాలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం లభిస్తోందని డీఆర్డీఓ జిల్లా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
దోచేస్తే ఓకే.. తప్పు చేస్తే వేటే!
డీఆర్డీఏ ఉన్నతాధికారుల తీరు - అక్రమార్కులను వదిలిపెట్టి చిరుద్యోగులపై చర్యలు - అవినీతిపరులకు అధికార పార్టీ అండదండలు అనంతపురం సెంట్రల్: డీఆర్డీఏ- వెలుగు ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలకు పాల్పడి లక్షలు దోచేస్తే చర్యలు తీసుకోరు కానీ, చిన్న తప్పిదాలు చేస్తే మాత్రం వేటు వేస్తారు. వివరాల్లోకి వెళితే, బుక్కపట్నం మండలంలో కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామాంజులు ఏకంగా ఓ బినామి ఖాతాను ప్రారంభించి రూ.22 లక్షలు అప్పనంగా భోంచేశాడు. ఈ విషయం బయటపడినా, ఆయనపై చర్యలు తీసుకోకుండా ప్రస్తుతమున్న ఓ మంత్రే నేరుగా రంగంలోకి దిగాడు. అయితే పత్రికలలో వరుస కథనాలు రావడంతో వేరే మండలానికి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఉల్లికల్లు ఇసుకరీచ్‌లో రూ.44 లక్షలు అవినీతి జరిగిందని స్వయంగా ఆర్డీఓ హుస్సేన్‌సాహేబ్ తేల్చారు. అయితే ఇంత వరకూ ఏ ఒక్కరిపైనా చర్యలు లేవు. గతంలో అనంతపురం మండల సమాఖ్యలో మహిళల పేరుతో సీఐఎఫ్ రూ.2 లక్షలు, కూడేరు మండలంలో స్త్రీ నిధి నిధులు రూ. 6 లక్షలు, కళ్యాణదుర్గంలో స్త్రీనిధి రుణాలు రూ.1.80 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. కనీసం రికవరీ కూడా సరిగా చేయలేదు. అంతోఇంతో కట్టించుకొని ఫైల్స్ మూసేశారు. జిల్లా సమాఖ్యలో ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేస్తున్నారని ఆడిట్లో స్పష్టంగా తేలింది. కానీ నిధుల ఖర్చుపై కనీసం సమీక్ష కూడా లేదు. కానీ ఈ విషయం బయటకు ఎలా పొక్కిందని ఆరా తీస్తూ అక్రమార్కులను వ్యతిరేకించే ఓ అధికారిణి పేరు చెప్పారు. అంతే ఆమెను టర్మినేట్ చేయాలని పీడీ వెంకటేశ్వర్లు ఆదేశించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం బుక్కపట్నం సీసీ రామేశ్వరమ్మను సస్పెండ్ చేసి, స్థానిక ఏపీఎంకు షోకాజ్‌లు జారీ చేశారు. కారణమేమంటే టీడీపీ ప్రభుత్వంపై సానుభూతిని పెంచేందుకు నిర్వహిస్తున్న అనంత మహిళా వారోత్సవాలను సరిగా నిర్వహించకపోవడమే. అయితే జిల్లాలో ఇప్పటి వరకూ ఎన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఎంతమంది రాత్రిళ్లు గ్రామాల్లో బస చేస్తున్నారని ఆరా తీస్తే నామమాత్రమే. పనిచేసే చోటే నివాసముండాలనే నిబంధన ఉన్నా మారుమూల పని చేస్తున్న ఏపీఎంలు, ఏరియా కో ఆర్డినేటర్లు జిల్లా కేంద్రంలోనే నివాసముంటున్నారు. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళుతూ మిగతా రోజులు ఫోన్లలోనే విధులు నిర్వహిస్తున్న అధికారులెవరో కూడా ఉన్నతాధికారులకు తెలుసు. కానీ వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. చిన్న స్థాయి ఉద్యోగులపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. -
పింఛన్లకు బయోమెట్రిక్ విధానం
డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి తాండూరు: బయోమెట్రిక్ విధానం ద్వారా ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన తాండూరు మున్సిపాలిటీని సందర్శించారు. చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ గోపయ్యలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బోగస్ పింఛన్లను తొలగించి, అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చడం కోసమే బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే రెండు,మూడు నెలల్లో ఈ విధానం అమల్లోకి వచ్చే ఆస్కారం ఉందన్నారు.మున్సిపాలిటీల పరిధిలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా పింఛన్ల డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. 95శాతం మందికి ఖాతాలు ఉంటే ఆన్లైన్లో జమ చేసే విధానం అమలు చేయాలని సర్కారు ఆలోచన చేస్తున్నట్టు వివరించారు. పింఛన్ల పంపిణీపై అన్ని స్థాయిల్లో విచారణతో పాటు సోషల్ ఆడిట్ కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. 10వరకు పింఛన్లు.. వచ్చే నెల నుంచి మండలాలు, మున్సిపాలిటీల్లో 5-10వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని పీడీ తెలిపారు. అర్హత ఉన్నా ఆ దారు కార్డులో వయసు తక్కువ ఉన్న వారు మెడికల్‌బోర్డు ద్వారా వయసు ధ్రువీకరణ పత్రం తీసుకొని దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు వస్తుందన్నారు. స్థానిక అధికారులకు వయసు ధ్రువీకరణ చేసే అధికారం లేదన్నారు. గత ఏడాది చివరిలో కొన్ని నెలల పింఛన్ డబ్బులు యాక్సెస్ బ్యాంకు నుంచి డ్రా చేసినప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయని వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు. లబ్ధిదారుల ఎంపికపై సందిగ్ధం నెలకొన్నందున అభయహస్తం పింఛన్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. జిల్లాలో రూ.31.34కోట్ల పింఛన్లు జిల్లాలో జనవరి నెలకు సంబంధించి 2,50,977 మందికి రూ.31.34కోట్ల పింఛన్లు మంజూరు అయ్యాయని పీడీ చెప్పారు. స్వ యం ఉపాధి కోసం నిరుద్యోగ యువతకు కంప్యూటర్స్, అకౌంటింగ్, బ్యూటీ పార్లర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి వికారాబాద్, చిలుకూరులో శిక్షణకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెలలో తాండూరులో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. బ్యాంకు లింకే జీ కింద జిల్లాలో మహిళా పొదుపు సంఘాలకు రూ.248కోట్ల రుణ లక్ష్యానికి గాను రూ.201 కోట్ల రుణాల లింకేజీ జరిగిందని వివరించారు. బంట్వారం, బషీరాబాద్ మండలాల్లో రుణాల రికవరీ తక్కువగా ఉందన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ సాజిద్‌అలీ పాల్గొన్నారు.