వికారాబాద్‌లో జిల్లాస్థాయి ‘బతుకమ్మ’ | batukamma festival celebrations in vikarabad | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో జిల్లాస్థాయి ‘బతుకమ్మ’

Published Fri, Sep 19 2014 11:38 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

వికారాబాద్‌లో జిల్లాస్థాయి ‘బతుకమ్మ’ - Sakshi

వికారాబాద్‌లో జిల్లాస్థాయి ‘బతుకమ్మ’

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను జిల్లాలో విజయవంతంగా జరపాలని జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో ఈ ఉత్సవాలను వికారాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24 నుంచి అక్టోబర్2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
 
జిల్లాస్థాయి ఉత్సవాలకు కలెక్టర్ అధ్యక్షులుగా, డీఆర్‌డీఏ పీడీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయిలో మండల పరిషత్ ప్రెసిడెంట్ అధ్యక్షులుగా, ఎంపీడీఓ కన్వీనర్‌గా, గ్రామస్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈనెల 24నుంచి ప్రతిరోజు కలెక్టరేట్లో ఒక్కో శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ హరినారాయణన్, డీఆర్వో సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement