దళారీ వ్యవస్థను నిర్మూలిద్దాం
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పట్నం డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: దళారీ వ్యవస్థను నిర్మూలిద్దామని, రైతులంతా తమ ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2 ఎంవీ రెడ్డి సూచించారు. గురువారం ఆయన ఇబ్రహీంపట్నంలోని డీసీఎంఎస్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారుల పనితీరుపై మార్కెట్‌కు వచ్చిన రైతుల వద్ద ఆరా తీశారు. రైతాంగానికి అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని మార్కెట్ అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకోవాలంటే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ అధికారులు పలుమార్లు తిప్పుకుంటున్నారని రైతులు జేసీ వద్ద వాపోయారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అం దించకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పారు.
స్పం దించిన జేసీ.. తమ దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని, ఎరువులు, విత్తనాలు డీసీఎంఎస్ కేంద్రాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూ స్తానన్నారు. అదేవిధంగా రైతులకు అవసరమైన యంత్రాలు, పరికరాలను అం దుబాటులో ఉంచుతామన్నారు. ధాన్యా న్ని తీసుకొస్తున్న రైతులను ధ్రువీకరణ పత్రాల పేరిట ఇబ్బంది పెట్టొదని, పాస్‌పుస్తకాల నకలు తీసుకొస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. వరి ధాన్యంలో 17శాతం కంటే తేమ తగ్గకుండా, తాలు లేకుండా రైతులు జాగ్రత్త వహించాలని వివరించారు. డబ్బులు కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. ఆయన వెంట తహశీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఏడీఏ కవిత, డీసీఎంఎస్ సెంటర్ ఇన్‌చార్జి డి.మాధవి తదితరులు ఉన్నారు.