థమన్ చేతుల మీదుగా ‘నీలాకాశం’ ఆడియో లాంచ్‌ | Neelakasham Audio Launch By SS Thaman | Sakshi
Sakshi News home page

థమన్ చేతుల మీదుగా ‘నీలాకాశం’ ఆడియో లాంచ్‌

Published Sun, Jun 9 2019 10:36 AM | Last Updated on Thu, Jul 11 2019 9:16 PM

Neelakasham Audio Launch By SS Thaman - Sakshi

సినీ సంగీతం వివి విని అలసిన శ్రోతలకు ‘నీలాకాశం’ అనే సరికొత్త తెలుగు ఆల్బమ్ స్వాన్తన కలిగించనుంది. సీతారామరాజు అనే కొత్త సంగీత దర్శకుడు మరియు పాటల రచయిత దీనితో పరిచయం అవుతున్నారు. కృష్ణ తేజస్వి, ఆశిక్ అలీ, అఖిలేశ్వర్ చెన్ను, నికిత శ్రీవల్లి, మనీషా పండ్రంకి మొదలగు కొత్త గాత్రాలు సందడి చేయనున్నాయి. వైజాగ్, చెన్నై, ముంబై మొదలగు చోట్ల స్టూడియోలలో రికార్డ్ చేసిన పాటలను ముందుకు తీసుకు వచ్చారు.

ఈ ఆల్బమ్ ‘వాటర్ లెమన్ రికార్డ్స్’ అనే కొత్త ఆడియో సంస్థ ద్వారా మార్కెట్ లోనికి రానున్నాయి. ఈ విడుదల కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ మరియు తమ్మారెడ్డి భరద్వాజ్ గారిచే శనివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ ఎస్ థమన్ మాట్లాడుతూ... ‘ఆశీర్వాద్ గారికి మాకు చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉంది. చెన్నైలో తరచూ కలుస్తుంటాము. మా నాన్న గారికి ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆ కమ్యూనికేషన్ తోనే నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా మందికి లైట్ మ్యూజిక్ చాలా పాటలకు ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు అదొక మెడిసిన్ కూడా.. ఇలాంటి లైట్ మ్యూజిక్ ను సీతారామ రాజు, ఆశీర్వాదం గారు శ్రోతలకు అందించడానికి చేసే ఈ ప్రయత్నం ఎంతో గొప్పది. ఈ నీలాకాశం ఆల్బమ్ సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింగర్స్ అందరికీ బెస్ట్’  అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘ఘంటసాల గారు అప్పట్లో ఇలాంటి లైట్ మ్యూజిక్ నే చేసేవారు. అలాంటి మ్యూజిక్ వలనే ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్స్ సాంగ్స్ వచ్చాయి. ఆ తరాన్ని అనుసరిస్తూ ఇప్పుడు నీలాకాశం అనే లైట్ మ్యూజిక్ ఆల్బమ్‌ను తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏ జనరేషన్‌కు అయినా.. ఎప్పుడు విన్నా ఈ లైట్ మ్యూజిక్ ఆహ్లాదంగా అనిపిస్తూనే ఉంటుంది. వీరి స్ఫూర్తి తో మరెన్నో లైట్ ఆల్బమ్స్‌ రావాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ఆల్బమ్ లో పాడిన నూతన సింగర్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement