
స్టేటస్ ఫైట్: సంపూర్ణేష్, తమ్మారెడ్డికి బ్రేక్!
ప్రత్యేక హోదా కోసం శాంతియుత ఆందోళనకు దిగిన విద్యార్థులు, యువతపై పోలీసుల ఓవరాక్షన్ కొనసాగుతూనే ఉంది.
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం శాంతియుత ఆందోళనకు దిగిన విద్యార్థులు, యువతపై పోలీసుల ఓవరాక్షన్ కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా వైజాగ్ వచ్చిన సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సంపూర్ణేష్ బాబు, సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టు బయట వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ నటులు పలువురు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో మద్దతు పలికిన సంగతి తెలిసిందే. హీరోలు చాలామంది సోషల్ మీడియాలో ఉద్యమానికి జై కొట్టినప్పటికీ, హీరో సంపూర్ణేష్ బాబు హోదా పోరుకు మద్దతుగా వైజాగ్ వస్తున్నట్టు ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన తమ్మారెడ్డి భరద్వాజ తదితరులతో కలిసి వైజాగ్ రాగా, నిరసన ప్రదర్శనలో పాల్గొనకముందే వారిని పోలీసులు అడ్డుకున్నారు.