సాక్షి, హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని అనుకుంటే మెగాస్టార్ చిరంజీవనే కాకుండా ఎవ్వరితోనైనా కలిసి నడుస్తామని దర్శకనిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. చిరంజీవి ఇంట్లో సమావేశం ఆయన స్వలాభం కోసం పెట్టలేదని, ఈ భేటీని పెద్ద వివాదంగా చేస్తున్నారని తప్పుపట్టారు. ఇలాంటి సమావేశాలు గతంలో దాసరి నారాయణరావు ఇంట్లో అనేకం జరిగాయని గుర్తుచేశారు. (‘ఇంట్లో పెళ్లి కాదు.. బొట్టు పెట్టి పిలవడానికి’)
నటులు బాలకృష్ణ, నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ చేయని వ్యాఖ్యలను చేసినట్లు చూపుతున్నారని మండిపడ్డారు. ఇక అయన వ్యక్తిగత వ్యాఖ్యల గురించి స్పందించనని అన్నారు. చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, వారిద్దరు మంచిగా ఉన్నారన్నారు. ఈరోజు బాలకృష్ణ, చిరంజీవిలతో మాట్లాడామని ఈ సమస్య ఇక్కడే పరిష్కారం అయిందనే అనుకుంటున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. (నన్ను ఒక్కడూ పిలవలేదు : బాలకృష్ణ)
బాలకృష్ణ అభిప్రాయం అందరిదీ: ప్రసన్న కుమార్
సినీ పెద్దల సమావేశంపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిర్మాత ప్రసన్నకుమార్ సమర్థించారు. బాలకృష్ణ అభిప్రాయమే తమందరిలోనూ ఉందన్నారు. ఈ సమావేశం గురించి నరేశ్, జీవితా రాజశేఖర్, ఫిలిమ్ ఛాంబర్, కౌన్సిల్‌లోని సభ్యులెవరికీ తెలియదన్నారు. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్లని, ఇండస్ట్రీ సమస్య అందరిదన్నారు. (ఆ తర్వాత ఏలియన్స్ దాడులా?: వర్మ)
Comments
Please login to add a commentAdd a comment