
'ఆర్ఆర్ఆర్' సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టిందని, అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్లకు గానూ అంతగా ఖర్చు పెడుతున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఆ 80 కోట్లు తనకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడతామంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్ నేపథ్యంలో తనపై నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముకుల నుంచి సైతం విమర్శల వర్షం కురుస్తోంది.
తాజాగా ఇదే విషయంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు. మిత్రుడు భరద్వాజకి అంటూ మొదలు పెట్టిన ఆయన తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి, అంతేగాని 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా..? హాలీవుడ్ దర్శకులు స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి వారు కూడా డబ్బు తీసుకొని 'ఆర్ఆర్ఆర్'చిత్రం గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా..? అంటూ తమ్మారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
— Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023
Comments
Please login to add a commentAdd a comment