ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉద్యమానికి హీరో సంపూర్ణేష్ బాబు మద్దతు ప్రకటించారు. ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని స్పష్టం చేశారు. తాను తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడినే అయినప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతిస్తున్నానని, హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని, తెలుగువారంతా సంతోషంగా ఉంటారని అన్నారు.