ఆర్ నారాయణ మూర్తి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలిసిందే. విప్లవ సినిమాలు తీస్తూ పీపుల్స్ స్టార్‌గా ఎదిగాడు. కేవలం సినిమాల్లో నటించడమే కాదు.. కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, గానం, నిర్మాణం..ఇలా 24శాఖలను తన భూజన వేసుకొని సూపర్ హిట్ చిత్రాలను అందించగల సమర్థుడు. ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన హిట్ పడలేదు కానీ, ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలాంటి గొప్ప నటుడిపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నమ్మిన సిద్దాంతం కోసం స్టార్‌డమ్‌ని, కోట్ల రూపాయలను వదులుకున్న ఏకైన నటుడు ఆర్ నారాయణమూర్తి అని ప్రశంసించారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాకు ఒక డిఫరెంట్ స్టేటస్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. విప్లవాన్ని నమ్ముకొని.. విప్లవం కోసమే జీవితాన్ని అంకితం చేశాడు.
తన కథలతో ప్రేక్షకుల ఆలోచనలు ప్రభావితం చేస్తూ, కొంతకాలం పాటు అతనే నెంబర్ వన్ స్టార్ అయ్యాడు కూడా. స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలకుండా అదే తరహా సినిమా చేస్తూ వచ్చాడు. సిద్దాంతం కోసం తన స్టార్ స్టేటస్‌ని వదులుకున్నాడు కానీ తన పంథా మార్చుకోలేదు. తన పంథా మార్చుకొని ఉంటే ఈ రోజుకి కూడా ఆర్ నారాయణమూర్తి నెంబర్ వన్ స్టార్‌గానే ఉండేవాడు.
‘మీ సిద్ధాంతం వదలకుండా మీరు సినిమా చేసే విధానం మార్చుకోండి’ అని నేను చాలాసార్లు చెప్పానుగానీ ఆయన వినిపించుకోలేదు. ఆయన ఏ సినిమా తీసినా అది విప్లవ పంథాలోనే ఉంటుంది. సూపర్ హిట్లు ఇచ్చాడు .. ఎంతో సంపాదించాడు. అయినా రోడ్లపై నడుచుకుంటూనే తిరుగుతూ ఉంటాడు. అంత సింపుల్ గా బ్రతికే మనిషిని గురించి ఎంత చెప్పినా సరిపోదు’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment