
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
సందడిగా సాక్షి ఎరీనా వన్ స్కూల్ ఫెస్ట్
420 మంది విజేతలకు బహుమతుల ప్రదానం
ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయం: తమ్మారెడ్డి భరద్వాజ
హైదరాబాద్: ‘సాక్షి ఎరీనా వన్ స్కూల్ ఫెస్ట్’ ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగింది. ఆదివారం బంజారాహిల్స్‌లోని ముఫకంఝా ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన స్కూల్ ఫెస్ట్‌కు ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారం భించారు. స్కూల్ ఫెస్ట్‌లో భాగంగా రెండు నెలల నుంచి 19 అంశాల్లో పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహిం చారు.
మొత్తం 420 మంది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్, కూకట్‌పల్లి మెరీడియన్ ప్రిన్సిపాల్ రోహిణి, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధి రాణి, సెయింట్ ఆండ్రూస్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మాలయ శర్మ, గీతాంజలి స్కూల్ ప్రిన్సిపాల్ బాలా త్రిపుర సుందరీదేవి పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినం దనీయమని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, వారికి నాయకత్వ లక్షణాలు అలవడుతాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా యూత్ ఫెస్ట్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. స్కూల్ ఫెస్ట్ పేరుతో విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసి ప్రోత్సహించడం ద్వారా వారు మరింత పట్టుదలతో ముందుకుసాగేందుకు అవకాశం ఉంటుందని మధుసూదన్ అన్నారు.