ప్రేమలో తప్పులు చేస్తే...
సీనియర్ నటుడు ఉత్తేజ్ తనయ చేతన కథానాయికగా నటిస్తున్న రెండో చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీవత్స ప్రొడక్షన్స్ పతాకంపై వి. శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి శ్రీమతి వాణి కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ నిర్మాత కేయస్ రామారావు క్లాప్ ఇచ్చారు.
దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఓ యువకుడు కొన్ని తప్పులు చేసి ప్రేమకు, కెరీర్‌కు దూరమవుతాడు. తిరిగి వాటిని దక్కించుకోవడానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా కథాంశం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. సంజయ్, చేతన ఉత్తేజ్, కారుణ్య, నాగేంద్రబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ, సంగీతం: రాంనారాయణ్.