
పవన్ చాలా ప్రశ్నలకు సమాధానాలివ్వాలి
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న పవన్ కళ్యాన్ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జంప్ జిలానీలకు తన పార్టీలో స్థానం లేదని చెప్పిన పవన్, చాలావరకు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన అభ్యర్థులతో నిండి ఉన్న తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తన హయాంలో ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను మూసేసిన బాబు ఇప్పడు ఇంటికో ఉద్యోగం ఎలా ఇస్తాడని తమ్మారెడ్డి భరద్వాజ నిప్పులు చెరిగారు. అమలుచేయడానికి ఏమాత్రం సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసగిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.