Tammareddy Bharadwaj Comments On Chiranjeevi Remake Movies - Sakshi
Sakshi News home page

Chiranjeevi: చిరు రీమేక్స్ చేయడంపై తమ్మారెడ్డి కామెంట్స్

Published Wed, Aug 16 2023 7:42 PM | Last Updated on Wed, Aug 16 2023 8:06 PM

Tammareddy Bharadwaj Comments Chiranjeevi Remakes - Sakshi

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్‌కి కూడా ఇది నచ్చలేదు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్‌పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. చిరు రీమేక్స్‌పై కౌంటర్స్ వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సినిమా వ్యాపారమైంది
'అప్పట్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లకు పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇప్పటికీ అలాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. దాన్ని వ్యాపారంగా చూసేవాళ్లు ఎక్కువైపోయారు. కథ చెప్పమని అడిగితే అప్పట్లో రైటర్స్ సూటిగా సుత్తిలేకుండా చెప్పేవారు. ఇప్పుడేమో 'ఓపెన్ చేస్తే' అని ఎలివేషన్స్ ఇస్తున్నారు. రైటర్స్ డైరెక్టర్స్ కావడం దీనికి కారణమై ఉండొచ్చు. ప్రేక్షకులకు పనికొచ్చే అంశం, అది కూడా నేచురల్‌గా ఉండాలి. ఇది పక్కనబెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవు.'

(ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!)

చిరు అలా చేయాలి
'ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోలందరూ కెరీర్ మొదట్లో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది. చిరునే తీసుకోండి. శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ, విజేత లాంటి సినిమాలకే అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. అమిర్ 'దంగల్' లాంటి సినిమా చిరంజీవి చేసినా జనాలు చూస్తారు. భోళా శంకర్, గాడ్ ఫాదర్ లాంటివి చేసి డిసప్పాయింట్ కావడం కంటే నేచురల్ మూవీస్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం'

చెప్పాలని ప్రయత్నించా
'అయితే ఇదే విషయాన్ని చిరంజీవితోనూ చెబుదామని ప్రయత్నించాను. కానీ ఎందుకో కుదరలేదు. ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనిపించేవారు. ఇప్పుడు ఆ చిరంజీవి మళ్లీ కనిపిస్తే చూడాలని ఉంది. అలానే సినిమాలు ఆడుతాయి  అనేది నా నమ్మకం' అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. ఈయనే కాదు చాలామంది అభిమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చిరు రాబోయే సినిమాల విషయంలో ఏం చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement