
కాస్టింగ్ కౌచ్‌పై పోరాటంతో వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి అన్నంత పని చేసేశారు. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్ నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన తనను బెదిరించారంటూ చెన్నై పోలీసు కమిషనర్‌లో శుక్రవారం ఓ ఫిర్యాదు లేఖను ఆమె అందజేశారు. ‘సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని నేను బయటపెడుతున్నాను. అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ఫిర్యాదులో శ్రీ రెడ్డి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మురగదాస్, లారెన్స్‌లపై ఆమె ఆరోపణలు చేయగా.. వారాహి మీడియా సమావేశం నిర్వహించి మరీ శ్రీ రెడ్డిపై వేశ్య కామెంట్లు చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికపై ఆమె హెచ్చరించారు కూడా. ఇక నటీమణులపై లైంగిక వేధింపుల గురించి నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీలకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా, వాళ్లు తనను పట్టించుకోలేదని శ్రీ రెడ్డి ఆరోపిస్తున్నారు. త్వరలో పూర్తిగా చెన్నైలో స్థిరపడే ఆలోచనలో ఉన్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment