వర్ధమాన నటి ఆత్మహత్య | Tamil Actress Riyamikka Suicide In Chennai | Sakshi
Sakshi News home page

వర్ధమాన నటి ఆత్మహత్య

Published Fri, Nov 30 2018 7:30 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

Tamil Actress Riyamikka Suicide In Chennai - Sakshi

పెరంబూరు: వర్ధమాన నటి రియామిక(26) బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. కుండ్రత్తిలే కుమరనుక్కు కొండాట్టం, ఎక్స్‌ మీడియా చిత్రాల్లో నటించిన రియామిక ఆత్మహత్య సంఘటన కోలీవుడ్‌లో విషాదచాయలను నింపింది. రియామిక సొంత ఊరు ఈరోడ్డు. చెన్నైలో ఉన్నత విద్యను అభ్యసించిన ఈమె ఆ తరువాత అక్కడే సెటిల్‌ అయ్యి సినిమాల్లో నటిస్తోంది. స్థానిక వలసరవాక్కం, శ్రీదేవి కుప్పంలోని రాధానగర్‌ 3వ వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివశిస్తోంది. పిన్ని కొడుకు ప్రకాశ్‌ కూడా రియామికతో కలిసి ఉంటున్నాడు. ఇతను సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నాడు. రియామికకు సోదరి, సోదరుడు ఉన్నారు. అయితే వారు స్థానిక పడప్పైలో నివశిస్తున్నారు.

ఇక రియామికకు దినేష్‌ అనే ప్రేమికుడు కూడా ఉన్నాడు. అతను పోరూర్‌లోని కారంబాక్కంలో జిమ్‌ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. రియామిక చిత్ర అవకాశాలు లేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఆమె సంపాదనతోనే తన కుటుంబం ఆధారపడి ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో రియామిక ఒక అశ్లీల చిత్రంలో నటించడంతో స్నేహితులు ఆమెకిక అవకాశాలు రావని హేళన చేస్తున్నట్లు, ఈ కారణాలతోనే రియామిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రియామిక మరుసటి రోజు ఉదయం తిరిగొచ్చినట్లు, ఆ తరువాత కొంత సేపు సోదరుడితో మాట్లాడి తన గదిలోకి వెళ్లినట్లు తెలసింది.

అయితే ఆమె బుధవారం ఇంటికి తిరిగి వచ్చినప్పుడే చాలా నిరాశ, నిష్పృహలకు గురైనట్లు కనిపించినట్లు సమాచారం. బుధవారం ఉదయం రియామిక ప్రేమికుడు దినేశ్‌ ఆమె ఇంటికి వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రకాశ్‌తో మీ అక్క ఎక్కడ అని అడగ్గా, గదిలో ఉందని అతను చెప్పాడు. దీంతో దినేశ్‌ ఆమె గది తలుపు తట్టినా లోపలి నుంచి ఎలాంటి బదులు రాకపోవడం, ఫోన్‌ రింగ్‌ అవుతూనే ఉండడంతో అనుమానం వచ్చి గది కిటికీలోంచి చూడగా రియామిక ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతుండడం కనిపించింది. దీంతో ప్రకాశ్, దినేష్‌ ఏడుపులు విని చుట్టు పక్కల వారు అక్కడకు చేరారు. సమాచారం వలసరవాక్కం పోలీసులకు అందడంతో సంఘటన ప్రాంతానికి వెంటనే వచ్చి రియామిక మృతదేహాన్ని స్థానిక రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించి పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement