లండన్: మెనోపాజ్‌ను సాకుగా చూపుతూ సరిగా పని చేయడం లేదని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బాస్ మీద కేసు పెట్టి రూ.37 లక్షల పరిహారం పొందిందో మహిళ. ఈ ఉదంతం స్కాట్లాండ్‌లో జరిగింది. కరెన్ ఫర్కార్సన్ అనే 49 ఏళ్ల మహిళ ఒక స్థానిక ఇంజనీరింగ్ సంస్థలో 1995 నుంచీ పని చేస్తోంది. మెనోపాజ్ దశ కారణంగా ఆందోళన, మెదడు ఉన్నట్టుండి మొద్దుబారడం వంటివాటి లక్షణాలతో బాధ పడుతున్నట్టు బాస్‌కు చెప్పింది.
విపరీతంగా బహిష్టు స్రావం అవుతుండటం, బయట విపరీతంగా మంచు కురుస్తుండటంతో రెండు రోజులు ఇంటి నుంచి పని చేసింది. మర్నాడు ఆఫీస్‌కు వెళ్లగానే, ’పర్లేదే, వచ్చావు’ అంటూ బాస్ వ్యంగ్యంగా అన్నాడు. తన సమస్య గురించి మరోసారి వివరించినా, ’నొప్పులు, బాధలు అందరికీ ఉండేవే’అంటూ కొట్టిపారేశాడు. దాంతో ఆమె రాజీనామా చేసి కంపెనీపై కేసు పెట్టింది. తన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదన్న బాస్ వాదనను ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. అతనిలో ఏ మాత్రమూ పశ్చాత్తాపం కనిపించడం లేదంటూ ఆక్షేపించి పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment