Menopause
-
మెనోపాజ్-నిద్రలేమికి లింకప్ ఏమిటి..?
నిద్ర సమస్యలు చాలామందికి సర్వసాధారణమే అయినా, మెనోపాజ్ కాలంలోను, ఆ తర్వాత తరచుగా నిద్ర సమస్యలను ఎదుర్కొనే మహిళలకు గుండెజబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మెనోపాజ్‌కు కొద్దిరోజుల ముందు, మెనోపాజ్ తర్వాత సరిగా నిద్రపట్టక ఇబ్బందిపడే మహిళల గుండె పనితీరుపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు ఇటీవల అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయన సారాంశాన్ని ఒక జర్నల్‌లో ప్రచురించారు. మెనోపాజ్ కాలంలో మహిళలు తమ నిద్ర తీరు తెన్నులపై దృష్టి ఉంచాలని, నిద్రపోయే వేళలు క్రమబద్ధంగా ఉండేలా చూసుకోవాలని వారు సూచించారు. నిద్ర మధ్యలో తరచుగా మెలకువ వస్తూ, తిరిగి నిద్ర పట్టడానికి చాలా సమయం పడుతున్నా, తరచుగా కలతనిద్రతో సతమతం అవుతున్నా, వెంటనే వైద్యులను సంప్రదించాలని కొలంబియా యూనివర్సిటీకి చెందిన కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బ్రూక్ అగర్వాల్ సూచిస్తున్నారు. మెనోపాజ్ కాలంలో ఎదురయ్యే నిద్ర సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, గుండె సమస్యలు జటిలంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.(చదవండి: 'మే'నిగనిగలకు కేర్ తీసుకుందామిలా..!) -
మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ కనిపించిందా? క్యాన్సర్ రిస్క్ ఎంత?
మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం కావడం మామూలే. కానీ రుతుస్రావాలు ఆగిపోయి... ఏడాది కాలం దాటాక మళ్లీ తిరిగి రక్తస్రావం కనిపిస్తుందంటే అదో ప్రమాద సూచన కావచ్చు. అది ఎందుకుజరుగుతోంది, దానికి కారణాలు కనుగొని... తగిన చికిత్స తప్పక చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాతకూడా రక్తస్రావం కనిపిస్తుందంటే దానికి కారణాలేమిటో, అదెంత ప్రమాదకరమో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు/ చికిత్స ఏమిటో అవగాహన కలిగించేందుకే ఈ కథనం.ఓ మహిళకు మెనోపాజ్ తర్వాత కొద్దిపాటి రక్తస్రావం కనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా అయితే యాభై లేదా అరవై ఏళ్లు దాటాక ఇలా రక్తస్రావం కనిపిస్తే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యేందుకు ఆస్కారముంది. అలా రక్తస్రావం జరగడానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడం తప్పనిసరి.చేయించాల్సిన పరీక్షలివి... మహిళల్లో మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కనిపిస్తే... అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజైనల్ వంటి స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలో ఎండోమెట్రియం ΄÷ర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్ తర్వాత ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అప్పుడు మరికొన్ని పరీక్షలూ చేయించాలి. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లూ, గర్భాశయ పరిమాణం, ఆకృతి, ఇతర వివరాలు తెలుస్తాయి. అండాశయాలు చిన్నగా కుంచించుకుపోయినట్లుగా కనిపించడానికి బదులు అండాశయాల్లో సిస్టులు ఉండటం, వాటి పరిమాణం పెరుగుతుండటం, కణుతుల్లాంటివి ఉండటం జరిగితే అసహజమని గుర్తించాలి. అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేయాల్సి రావచ్చు. గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర నమూనా సేకరించి బయాప్సీకి పంపిస్తారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మరో పరీక్ష హిస్టెరోస్కోపీ. సమస్యను గుర్తించేందుకు మరో పరీక్ష సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. అంటే, గర్భాశయంలోకి సెలైన్‌ని ఎక్కించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ కారణాలు తెలుసుకుంటారు.ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించక΄ోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేసేందుకు పాప్‌స్మియర్ చేయాల్సి రావచ్చు.ఇతరత్రా కారణాలుండవచ్చు... మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అనగానే అది తప్పక క్యాన్సరే అని ఆందోళన అక్కర్లేదు. ఈ పరిస్థితికి ఇతర కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు... పెద్దవయసులో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే వైద్యులు ముందు ప్రైవేట్ పార్ట్స్ చుట్టుపక్కల ఉండే అవయవాలను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, రక్తస్రావం అయ్యేందుకూ అవకాశముంది. జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్ ఉన్నా రక్తస్రావం కనిపించవచ్చు. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది. మెనోపాజ్ దశ దాటాక హార్మోన్ చికిత్స (హెచ్ఆర్టీ) తీసుకునేవారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ కోసం వాడే టామోక్సిఫిన్ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్ కనిపించవచ్చు. మరికొందరిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. హైబీపీ, డయాబెటిస్ వంటివి ఉంటే...?సాధారణ ఆరోగ్యవంతులైన మహిళల కంటే అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు ఈ సమస్య బారిన పడే అవకాశాలు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. కాబట్టి వారు తమ బరువును అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి. కుటుంబంలో అనువంశికంగా, తమ ఆరోగ్య చరిత్రలో క్యాన్సర్ ఉన్న కుటుంబాల్లోని మహిళలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌కి మందులు వాడుతున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌తో ఎప్పటికప్పుడు ఎండోమెట్రియం పొర వివరాలు తెలుసుకోవాలి. చికిత్స అవసరమయ్యేదెప్పుడంటే...ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్ ఫలితంలో ఏమీ లేదని తెలిసినప్పుడూ రక్తస్రావం కనిపించినప్పటికీ భయం అక్కర్లేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే చాలు.బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని తేలితే మళ్లీ ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆ క్యాన్సర్ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికీ విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్ గ్రంథులూ, కాలేయం, ఊపిరితిత్తుల వరకు చేరిందా అని వైద్యులు నిశితంగా పరీక్షిస్తారు. దాన్ని బట్టి ఎలాంటి చికిత్స / శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉంటే... దానికి అనుగుణమైన చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరవాత రేడియేషన్, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే చాలామటుకు హిస్టెరోస్కోపీలోనే పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి కనిపిస్తే... వాటిని తొలగిస్తారు. ఎండోమెట్రియం పొరమందం ఎక్కువగా పెరిగి.. రిపోర్టులో హైపర్‌ప్లేసియా అని వస్తే తీవ్రతను బట్టి ప్రొజెస్టరాన్ హార్మోను సూచిస్తారు లేదా హిస్టెరెక్టమీ చేస్తారు. కొన్నిసార్లు హార్మోన్లు లేకపోవడం వల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి ‘ఎట్రోఫిక్ ఎండోమెట్రియం’ పరిస్థితి వస్తుంది. అప్పుడు అందుకు తగినట్లుగా హార్మోన్లు వాడాలని డాక్టర్లు సూచిస్తారు. -
మోకాళ్లు నొప్పులా? ఎముక పుష్టికోసం ఇలా చేయండి!
వయసు నలభై దాటిందో లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితగా మోకాళ్ల నొప్పులు రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇది జీవితాంతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.మెనోపాజ్ఆడవారిలో మెనోపాజ్ తరువాత ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి. బహిష్టులు ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం. నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే. ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు విటమిన్ సి లభించే సిట్రస్‌పండ్లను తీసుకుంటే మంచిది. అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి. -
అర్లీ మెనోపాజ్ ప్రమాదమా..?
బాలికకు యుక్తవయసు నాటి నుంచి ప్రతి నెలా వస్తుండే రుతుక్రమం ఒక వయసులో ఆగి΄ోతుంది. అలా ఆగిపోవడాన్ని ‘మెనో΄పాజ్’ అంటారు. మామూలుగా వచ్చే నెలసరి కనీసం ఏడాది పాటు ఏ నెలలోనూ కనిపించకుండా పూర్తిగా ఆగిపోతే అప్పుడే దాన్ని ‘మెనో΄పాజ్’గా చెప్పవచ్చు. సాధారణంగా ఇది మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్య జరుగుతుంది. అంటే సగటున 51వ ఏట ఇది సంభవిస్తుంది. కానీ కొందరిలో మామూలుగా ఆగిపోయే సమయం కంటే చాలా ముందుగానే ఆగితే దాన్ని ‘అర్లీ మెనో΄పాజ్’గా చెబుతారు. ఇలా జరిగినప్పుడు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. కొందరు మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్య రుతుక్రమం ఆగిపోవడానికి బదులు 40 ఏళ్ల లోపు కూడా రుతుక్రమం ఆగి΄ోవచ్చు. ఇలా జరగడాన్ని అర్లీ మెనోపాజ్ లేదా ప్రి–మెచ్యుర్ ఒవేరియన్ ఇన్సఫిషియెన్సీ అని కూడా అంటారు. దీనికి నిర్దిష్టంగా కారణం ఏమిటో స్పష్టంగా తెలియదు. అయితే... కొందరిలో శస్త్రచికిత్స చేసి అండాశయాలు (ఓవరీలు) తొలగించాల్సి రావడం. కొన్ని కుటుంబాల్లో జన్యుపరంగా త్వరగా రుతుస్రావం ఆగిపోతుండవచ్చు కొందరిలో క్రోమోజోముల సమస్య కారణంగా... అంటే టర్నర్ సిండ్రోమ్ వంటివాటితో మానసిక ఒత్తిడి, మంచి ఆహారం తీసుకోకపోవడం, ఏదైనా దెబ్బతగలడం కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వాల్సి రావడం (ముఖ్యంగా నడుము దగ్గర) అండాశయాలను తొలగించడం పళ్లు, కూరగాయలపై ఉండే రసాయనాలు పొగ, మద్యం అలవాట్లు (విదేశాల్లో ఎక్కువ) థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా స్రవించడం కుటుంబ నియంత్రణ కోసం వాడే మందులు డాక్టర్ సలహా లేకుండా విచక్షణరహితంగా వాడటం పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) స్థూలకాయం.త్వరగా రుతుక్రమం ఆగడం ప్రమాదమా? మెనోపాజ్ రాబోతున్న సూచనగా కొందరు మహిళల ఒంట్లో నుంచి వేడి సెగలు వస్తున్నట్లు అనిపించడం (హాట్ ఫ్లషెస్), భావోద్వేగాలు వెంటవెంటనే మారడం (మూడ్ స్వింగ్స్) వంటి లక్షణాలు కనిపిస్తాయి కొందరిలో ఎముకలు పెళుసుబారి తేలిగ్గా విరిగిపోయేలా చేసే ‘ఆస్టియోరోసిస్’ ముప్పు నెలసరి ఆగి΄ోవడంతోనే ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల కొందరిలో గుండెపోటు, గుండెజబ్బుల ముప్పు ∙మూత్ర సంబంధమైన వ్యాధులు (యూరిన్ ఇన్ఫెక్షన్స్) ∙బరువు పెరగడం ∙కొందరిలో డిప్రెషన్, అయోమయం, త్వరగా కోపగించుకోవడం, అలసట వంటి మానసికమైన సమస్యలూ కనిపిస్తాయి.అర్లీ మెనోపాజ్‌కు తర్వాతి పరిణామాలకు చికిత్స? ఒకసారి మెనో΄పాజ్ ఆగి΄పోయాక దాన్ని పునరుద్ధరించడానికి ఏ చికిత్సతోనూ అవకాశముండదు. కాక΄ోతే మెనో΄ాజ్ తర్వాతి పరిణామంతో మహిళల్లో కొన్ని ఇబ్బందులు కనిపించవచ్చు. వీటికే చికిత్స అవసరం ఒంట్లోంచి వేడి సెగలు (హాట్‌ఫ్లషెస్) వస్తుండటం వల్ల బాధపడేవారికి హార్మోన్లను భర్తీ చేసేందుకు వచ్చే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) ఇవ్వాల్సి రావచ్చు. ఈ మందుల వల్ల ఒంట్లోంచి సెగలు రావడం ఆగడంతో పాటు ఎముకలూ బలంగా మారతాయి.అర్లీ మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తుండగా మొదలయ్యే ఈ చికిత్సను స్వాభావికంగా మెనోపాజ్ వచ్చే వయసు వరకు కొనసాగించాలి. హెచ్ఆర్టీలో ఇచ్చేవి ప్రత్యేకమైన మందులేమీ కావు. శరీరంలోనే స్రవించాల్సిన హార్మోన్లు కొన్ని కారణాల వల్ల స్రవించక΄ోవడంతో వాటిని డాక్టర్లు మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. కాబట్టి వీటితో ముప్పు ఏదీ ఉండదు.ప్రిమెచ్యుర్ మెనోపాజ్‌తో వచ్చే సమస్యలు, వాటి నివారణ కోసం... ఆకుకూరలు, పళ్లు సరిగ్గా కడిగి తీసుకోవాలి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. అంటే... ΄పొట్టుతో ఉండే గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, వేళకు నిద్ర΄ోవడం, శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం.డాక్టర్ క్రాంతి శిల్ప, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అబ్స్ట్రెట్రీషియన్ (చదవండి: ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి) ప్రిమెచ్యుర్ మెనో΄ాజ్తో వచ్చే సమస్యలు, వాటి నివారణ కోసం... ∙ఆకుకూరలు, పళ్లు సరిగ్గా కడిగి తీసుకోవాలి ∙క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారం ∙ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. అంటే... ΄÷ట్టుతో ఉండే గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, వేళకు నిద్ర΄ోవడం, శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం. -
మెనోపాజ్‌పై బాస్ ఛీప్ కామెంట్లు..!
లండన్: మెనోపాజ్‌ను సాకుగా చూపుతూ సరిగా పని చేయడం లేదని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బాస్ మీద కేసు పెట్టి రూ.37 లక్షల పరిహారం పొందిందో మహిళ. ఈ ఉదంతం స్కాట్లాండ్లో జరిగింది. కరెన్ ఫర్కార్సన్ అనే 49 ఏళ్ల మహిళ ఒక స్థానిక ఇంజనీరింగ్ సంస్థలో 1995 నుంచీ పని చేస్తోంది. మెనోపాజ్ దశ కారణంగా ఆందోళన, మెదడు ఉన్నట్టుండి మొద్దుబారడం వంటివాటి లక్షణాలతో బాధ పడుతున్నట్టు బాస్‌కు చెప్పింది. విపరీతంగా బహిష్టు స్రావం అవుతుండటం, బయట విపరీతంగా మంచు కురుస్తుండటంతో రెండు రోజులు ఇంటి నుంచి పని చేసింది. మర్నాడు ఆఫీస్‌కు వెళ్లగానే, ’పర్లేదే, వచ్చావు’ అంటూ బాస్ వ్యంగ్యంగా అన్నాడు. తన సమస్య గురించి మరోసారి వివరించినా, ’నొప్పులు, బాధలు అందరికీ ఉండేవే’అంటూ కొట్టిపారేశాడు. దాంతో ఆమె రాజీనామా చేసి కంపెనీపై కేసు పెట్టింది. తన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదన్న బాస్ వాదనను ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. అతనిలో ఏ మాత్రమూ పశ్చాత్తాపం కనిపించడం లేదంటూ ఆక్షేపించి పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. -
40లోనే మోనోపాజ్.. ఏమైనా ప్రమాదమా?డాక్టర్లు ఏమంటున్నారంటే
నాకు 43 ఏళ్లు. ఆరునెలలుగా పీరియడ్స్ రావడం లేదు. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మెనోపాజ్ అంటున్నారు. ఇంత త్వరగా నెలసరి ఆగిపోతుందా? మా అక్కకి 50 ఏళ్ల తరువాత ఆగిపోయాయి. 43 ఏళ్లకే ఆగిపోవడం ఏదైనా ప్రమాదమా? – సీహెచ్. లావణ్య, కర్నూలు ఎర్లీ మెనోపాజ్ అంటే 45 ఏళ్లు నిండకుండా నెలసరి ఆగిపోవడం. 40 ఏళ్లలోపు ఆగిపోతే అది ప్రీమెనోపాజ్. ఈ రోజుల్లో చాలామందికి 45 ఏళ్లలోపే నెలసరి ఆగిపోతోంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందువల్ల అండాలు విడుదలకాకుండా అండాశయాల్లోనే ఉండిపోయి నెలసరి రాదు. వీరిలో మస్కులోస్కెలిటల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మజిల్ మాస్ తగ్గినందువల్ల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడుతుంటారు. మీరు ఏడాదికోసారి కార్డియో వాస్కులర్ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్‌లను సంప్రదిస్తుండాలి. వంద మందిలో అయిదుగురికి 45 ఏళ్లలోపు నెలసరి ఆగుతోంది. ఇలా మెనోపాజ్ త్వరగా వచ్చినా.. ఈస్ట్రోజెన్ థెరపీతో రిస్క్‌ని తగ్గించవచ్చు. జన్యుపరంగానైనా.. కాకపోయినా మీకు మెనోపాజ్ త్వరగా వచ్చి ఉండొచ్చు. సాధారణంగా 51 ఏళ్లకు మెనోపాజ్ వస్తుంది. మీరు ఎర్లీ మెనోపాజ్‌లో ఉన్నారు కాబట్టి.. మీకు ఈస్ట్రోజెన్ థెరపీతో గుండె, ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గించవచ్చు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే.. మీకు ఎలాంటి మందులు ఇవ్వాలి.. వాటితో భవిష్యత్‌లో ఇతర రిస్క్స్ అంటే క్యాన్సర్ లాంటిదేమైన పొంచి ఉండే ప్రమాదం ఉందా అని పరిశీలిస్తారు. కాల్షియం, విటమిన్ డి మాత్రలు కూడా తీసుకోవాలి. వెజైనా పొడిబారుతుంటే లూబ్రికెంట్ జెల్ లేదా ఈస్ట్రోజెన్ క్రీమ్‌ని సూచిస్తారు. హెచ్ఆర్టీ.. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎంత వరకు పనిచేస్తుందో చూస్తారు. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ను కూడా సూచిస్తున్నారు. -
Health: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు..
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండడానికి మాత్రల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయవచ్చా? – సీహెచ్. వెంకటలక్ష్మి, సామర్లకోట మెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు. మెనోసాజ్ వచ్చిన కొన్ని నెలల తర్వాత ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు. వారికి హెచ్ఆర్టీ సురక్షితం కాదు ఒకవైళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్‌ను సింగిల్ డోస్‌గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్‌గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్‌తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు,బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం? పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి... -
స్మార్ట్ ఫిల్మ్; ఉమెన్ @ 40
మానసిక కల్లోలం, డిప్రెషన్, నిద్రలేమి, జ్ఞాపకశక్తి సమస్యలు.. 40 ఏళ్లు దాటిన చాలా మంది మహిళలు ఈ లక్షణాలన్నీ లేదా వీటిలో ఏదో ఒకదానిని అనుభవిస్తుంటారు. మెనోపాజ్‌కి కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నందువల్లనో, ప్రీ మెనోపాజ్ దశను అధిగమించలేకనో నాలుగుపదులు దాటిన వారి జీవితం కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ సమస్యలనే ఇతివృత్తంగా తీసుకొని గి@40 (ఉమన్ ఎట్ ఫార్టీ) పేరుతో 12 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌ను తీశారు స్మితా సతీష్. స్మితా సతీష్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త, మోటివేషనల్ ట్రైనర్. గతంలో స్మిత జువైనల్ జస్టిస్ బోర్డ్‌లో సభ్యురాలుగా ఉన్నారు. కేరళలోని త్రిసూర్‌లో ఉంటారు ఈమె. 43 ఏళ్ల స్మిత తన వ్యక్తిగత జీవితంలో చూసినవి, తనను కలిసిన కొంత మంది మహిళల సమస్యలను ఉదాహరణగా తీసుకుని 40 ఏళ్లు దాటిన గృహిణి పరిస్థితులతోబాటు, వారికి కుటుంబ మద్దతు ఎంత వరకు అవసరమో గి@40 షార్ట్ ఫిల్మ్‌లో కళ్లకు కడుతుంది. హాట్ ఫ్లాష్ ఈ ఏడాది మొదట్లో ‘హాట్ ఫ్లాష్’ అనే పేరుతో షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు స్మిత. ముందస్తు మెనోపాజ్ లక్షణాలలో ఒకటైన హాట్ ఫ్లాష్‌తో (అకస్మాత్తుగా వేడిగా అనిపించడం, తీవ్రమైన చమట పట్టడం) ఉన్న నలభై ఏళ్ల గృహిణి గురించి వివరించారు. ఉన్నట్టుండి చిరాకుగా మారడం, కోపం తెచ్చుకోవడం లేదా కారణం లేకుండా ఏడవడం, అందరూ తనను నిర్లక్ష్యం చేస్తున్నట్టు భావించడం .. ఇవన్నీ డాక్టర్, సైకాలజిస్ట్ సహాయంతో అధిగమించడం వరకు పాత్ర భావోద్వేగ ఎత్తుపల్లాల గుండా వెళుతుంది. ‘శరీరం మార్పులకు లోనవుతుంటుంది. రుతుక్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో నలభై దాటిన వారి ప్రతి చర్యలను గమనించిన తర్వాత ఏదైనా చేయాలనుకున్నాను. అలా ఈ లఘు చిత్రాన్ని తీశాను’ అంటారామె. ఈ ఫిల్మ్‌కి స్మిత ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ఇతర నటీనటులు వివిధ రంగాలలో ఉన్నవారు మొదటిసారి నటించారు. మహిళలకు అవగాహన తప్పనిసరి నలభై ఏళ్ల దాటిన మహిళల రోజువారీ సాధారణ లక్షణాలను హైలైట్ చేయడానికి ఆమె వివిధ పాత్రల ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు. ‘మీరు బాగున్నారా?’ అనే ప్రశ్న సాధారణంగా మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ, సమస్య ఏంటంటే, ఈ దశలో ఉన్న మహిళలు తాము ఎందుకు కష్టంగా ఉన్నారో వారికై వారే అర్థం చేసుకోలేరు. కుటుంబ సభ్యులకు కూడా ఈ మహిళల మానసిక కల్లోలం, ప్రవర్తనలో మార్పుల గురించి ఏ మాత్రం తెలియదు’ అంటారు స్మిత. అలాంటి మహిళలకు అవగాహన కల్పించేందుకు ఈ ఫిల్మ్ సాయపడుతుంది. ‘చాలామంది ప్రసూతి వైరాగ్యం అంటే ప్రసవానంతరం డిప్రెషన్ గురించి ఇప్పుడిప్పుడే చర్చిస్తున్నారు. అలాగే, ప్రీ మెనోపాజ్ లేదా మెనోపాజ్ గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పనిసరి పరిస్థితులలో అవసరం అనుకుంటే వైద్యులు కొన్నిసార్లు హార్మోన్ల చికిత్సను సూచిస్తారు. (క్లిక్ చేయండి: తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...) ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వారి ప్రపంచం అందంగా మారుతుంది. అభిరుచులను పెంచుకోవడానికి, సృజనాత్మకమైన పనులు చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. కుటుంబం, స్నేహితులు వారికి అండగా ఉండాలి. వారి సమస్యలు అందరి చెవికెక్కాలి’ అనే విషయాన్ని స్మిత తన ఫిల్మ్ ద్వారా వివరించారు. డబ్ల్యూ ఎట్ ఫార్టీ ఫిల్మ్ నలభై ఏళ్ల వయసు దాటిన మహిళలకు చక్కటి సూచికలా ఉపయోగపడుతుంది. (క్లిక్ చేయండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి) -
నా పెళ్లి ఫిక్సైంది, ఆ ఆలోచన తప్పా డాక్టర్!
మెనోపాజ్ వచ్చి నాలుగేళ్లవుతోంది. ఈ మధ్య తరచుగా మూత్రంలో మంట, దురదగా ఉంటోంది. షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. లేదు. థైరాయిడ్ కూడా లేదు. అయినా ఎందుకిలా అవుతోంది. వేడి చేసిందేమో అనుకున్నాను. కానీ ఎక్కడో చదివాను వేడి చేయడమంటూ ఉండదని. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – జి. రాజేశ్వరి, తర్లికొండ ఆడవారిలో గర్భాశయం ఇరువైపులా ఉండే అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. దీని ఉత్పత్తి 45 ఏళ్ల వయసు దాటే కొద్ది క్రమంగా తగ్గుతూ, పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశకు చేరుకోవడం జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల యోని భాగంలో మూత్రం బయటకు వచ్చే యురెత్రా ద్వారంలో మ్యూకస్ పొర ఎండిపోకుండా, అందులో ద్రవాలు ఊరేట్లు చేస్తుంది. అలాగే ఈస్ట్రోజన్ యోనిలో ల్యాక్టోబ్యాసిలై అనే మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది. ఈ బ్యాక్టీరియా నుంచి విడుదలయ్యే యాసిడ్ యోని స్రావాలను ఆమ్లగుణం కలిగేటట్లు చేస్తుంది. ఈ యాసిడ్ వల్ల వేరే ఇన్ఫెక్షన్ క్రిములు పెరగకుండా ఉంటాయి. అలాగే ఈస్ట్రోజన్ యురెత్రా, యోని భాగంలో ఉండే కండరాలు వదులు కాకుండా, దృఢంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. మీకు మెనోపాజ్ వచ్చి నాలుగు సంవత్సరాలు దాటింది కాబట్టి మీ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ చాలావరకు తగ్గిపోయి ఉంటుంది. ఈస్ట్రోజన్ లోపం వల్ల యురెత్రా, వజైనా కణజాలానికి రక్తప్రసరణ తగ్గిపోయి మ్యూకస్ పొర పల్చబడి, మ్యూకస్ స్రావాలు ఆగిపోయి ఎండిపోయినట్లు అయిపోతుంది. దీనివల్ల యోనిభాగంలో పొడిబారేటట్లయి మంటగా అనిపిస్తుంది. అవసరమైతే యూరిన్ కల్చర్ పరీక్షలు చేయించి, యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఎంత ఉన్నదీ, ఎలాంటి బ్యాక్టీరియా పెరుగుతున్నదీ తెలుసుకుని, దానిని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులతో పాటు మెనోపాజ్‌తో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వచ్చే ఈ సమస్యలను నివారించడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ క్రీమ్, జెల్, ఆయింట్మెంట్ లేదా వజైనల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రీమ్‌ను మొదటి రెండు వారాలు రోజూ రాత్రిపూట యోని లోపల మూత్ర భాగంలో పెట్టుకోవాలి. తర్వాతి నుంచి వారానికి రెండుసార్లు వాడుకోవచ్చు. అలాగే రోజుకు మూడు లీటర్ల మంచినీళ్లు తాగడం, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకాలకు మంచినీళ్లతో శుభ్రపరచుకోవాలి. ల్యాక్టోబ్యాసిలై ఇంటిమేట్ వాష్‌తో రోజుకొకసారి జననేంద్రియాలను శుభ్రపరచుకోవచ్చు. అవసరాన్ని బట్టి ల్యాక్టోబ్యాసిలైతో కూడిన ప్రోబయోటిక్ మందులను కొన్ని రోజులు డాక్టర్ సలహాపై తీసుకోవచ్చు. రోజూ కొద్దిగా క్యాన్‌బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కొందరిలో ఈ–కోలి బ్యాక్టీరియా మూత్రాశయానికి అంటుకోకుండా, ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా తరచుగా మూత్రవిసర్జన చేస్తూ ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆడవారిలో మలద్వారం యోనిభాగానికి, మూత్రద్వారానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మలద్వారం నుంచి వచ్చే ఈ–కోలి బ్యాక్టీరియా, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు యోనిలోకి, మూత్రద్వారంలోనికి సులువుగా పైకి పాకి యూరినరీ ఇన్ఫెక్షన్లు, వజైనల్ ఇన్ఫెక్షన్లు అతి త్వరగా, తరచుగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. దీని వల్ల మూత్రం పోసేటప్పుటు మంట, దురద వంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి. కొందరిలో ఈస్ట్రోజన్ లోపం వల్ల మూత్రాశయం కిందకు జారడం, దానివల్ల మూత్రం పూర్తిగా బయటకు రాకుండా ఉండటం, కొంచెం మూత్రాశయంలోనే ఉండిపోవడం, దానివల్ల అక్కడ బ్యాక్టీరియా పెరిగి, యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చి, మూత్రంలో మంట వంటి లక్షణాలు ఏర్పడతాయి. అశ్రద్ధ చేసి, చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ మూత్రాశయం నుంచి యురెటర్స్ ద్వారా కిడ్నీలకు పాకి ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, పరీక్ష చేయించుకుంటే, వారు స్పెక్యులమ్ పరీక్ష చేసి, మూత్రం ద్వారా యోనిభాగంలో బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయా, మూత్రాశయం జారడం వంటి సమస్యలేమైనా ఉన్నాయా అనేది చూసి, సమస్యను బట్టి యాంటీఫంగల్, యాంటీబయోటిక్ మందులు, క్రీములు సూచించడం జరుగుతుంది. మేడమ్... మా పెళ్లి ఖరారైంది. నిశ్చితార్థానికి ముందు మా రెండు కుటుంబాల హెల్త్ హిస్టరీ చూసుకోవాలనుకున్నాం. పుట్టబోయే పిల్లల ఆరోగ్య దృష్ట్యా. అమ్మాయీ ఒప్పుకుంది. కానీ వాళ్ల కుటుంబ సభ్యులకు నా తీరు నచ్చక సంబంధం కేన్సిల్ చేసుకోవాలని చూస్తున్నారు. పైగా నా మీద అభాండాలూ వేస్తున్నారు. నా ఆలోచన తప్పా డాక్టర్ గారూ... – రాఘవకృష్ణ, ప్రొద్దుటూరు నీ ఆలోచనలో తప్పేమీ లేదు. కానీ ప్రాక్టికల్‌గా అది అందరికీ నచ్చకపోవచ్చు. కొందరు దాన్ని వెర్రి ఆలోచనగా పరిగణించవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల జన్యు సమస్యలు, అవయవ లోపాలు, మానసిక ఎదుగుదల లోపాలు, మెటబాలిక్ డిజార్డర్స్, థలసీమియా, హీమోఫీలియా, సికెల్‌సెల్ ఎనీమియా వంటి రక్త సమస్యలు వంటి అనేక సమస్యలతో పిల్లలు పుట్టవచ్చు. ఈ సమస్యలకు మూలాలు తల్లిదండ్రుల్లో గాని, వారి తల్లిదండ్రులు, ఇంకా దగ్గరి రక్తసంబంధీకులలో గానీ కొన్ని జన్యువులలో లోపాలు ఉండవచ్చు. కొన్ని జన్యుపరమైన సమస్యలతో పుట్టిన పిల్లలతో పాటు, వారి తల్లిదండ్రులు జీవితాంతం ఇబ్బంది పడవలసి ఉంటుంది. కొన్ని సమస్యలు ఏ కారణం లేకుండా కూడా పిల్లల్లో ఏర్పడవచ్చు. కొందరిలో కొన్ని జన్యువులు బలహీనంగా ఉండటం జరుగుతుంది. అలాంటి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు రెండు బలహీన జన్యువులు బిడ్డకు సంక్రమించినప్పుడు జన్యలోపాలు ఏర్పడతాయి. కాబట్టి పెళ్లికి ముందు ఇద్దరి తరఫు దగ్గరి బంధువుల ఆరోగ్య చరిత్ర తెలుసుకోవడం వల్ల వారిలో ఏవైనా సమస్యలు ఉంటే, అవి పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో ఒక అంచనాకు రావచ్చు. అవసరం అనుకుంటే జెనెటిక్ కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చు. ఇందులో జెనెటిసిస్ట్ డాక్టర్ కుటుంబ చరిత్రను బట్టి పుట్టబోయే పిల్లల్లో జన్యుసమస్యలు ఎంతశాతం వరకు రావచ్చనేది అంచనా వేసి చెప్పడం జరుగుతుంది. డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ చదవండి: కరోనా కాలంలో పిల్లలకు సీజనల్ జ్వరాలు.. జాగ్రత్తలు -
మోనోపాజ్ తర్వాత రక్తస్రావం?!
మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం కావడం చాలా సహజం. అయితే రుతుక్రమం ఆగిపోయి, వాళ్లకు మెనోపాజ్ దశ వచ్చాక మాత్రం...కొద్దిగానైనా సరే రక్తస్రావం కనిపిస్తే అది ప్రమాద సంకేతం. రుతుస్రావం ఆగిపోయి... ఏడాది కాలం దాటాక రక్తస్రావం కనిపిస్తుందంటే... అది ఎందుకు జరుగుతోంది, దానికి కారణాలు ఏమిటో కనుగొని, తగిన చికిత్స చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం కనిపిస్తుందంటే దానికి కారణాలేమిటో, అదెంత ప్రమాదకరమో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు/ చికిత్స ఏమిటో అవగాహన కలిగించేందుకే ఈ కథనం. ఓ యువతికి యుక్తవయసు వచ్చిన నాటి నుంచి అండాశయాల్లోని అండాలన్నీ నెలకు ఒకటి చొప్పున విడుదల అవుతూ ఉంటాయి. అవి పూర్తిగా సంసిద్ధంగా ఉన్న సమయంలో కలయిక జరగనప్పుడు అవి క్రమంగా క్షీణించి, అండం ఉన్న ఎండోమెట్రియం పొరతో పాటు రాలిపోతాయి. ఇలా రాలిపోయినప్పుడే మహిళల్లో నెలసరి తాలూకు రక్తస్రావం కనిపిస్తుంది. దీన్నే రుతుస్రావం అంటుంటారు. మహిళలు తమ మధ్యవయసుకు చేరేనాటికి వారిలోని అండాలన్నీ పూర్తిగా అయిపోతాయి. దాంతో వారికి అండం విడుదల ఆగిపోవడంతో పాటు నెలసరి అయ్యే రుతుస్రావమూ ఆగిపోతుంది. దీన్నే ఇంగ్లిష్‌లో మెనోపాజ్ అని అంటారు. మెనోపాజ్ దశలో కొన్ని హార్మోన్ల ఉత్పత్తి కూడా మునుపటిలా ఉండదు. దాంతో పన్నెండు, పద్నాలుగేళ్ల వయసులో మొదలైన రుతుక్రమం నిలిచిపోతుందన్నమాట. అది జరిగాక కొద్దిపాటి రక్తస్రావం కనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే నలభైఏళ్లలోపు రుతుక్రమంలో కొద్దిపాటి మార్పులు కనిపించినా అవి చాలావరకు క్యాన్సర్‌కు సంబంధించినవి కాకపోవడంతో... క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ.. ఏళ్లు గడిచేకొద్దీ క్యాన్సర్ ముప్పు (రిస్క్) పెరుగుతుంది. సాధారణంగా అయితే యాభై లేదా అరవై ఏళ్లు దాటాక రక్తస్రావం కనిపిస్తే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యేందుకు పది నుంచి పదిహేను శాతం వరకు ఆస్కారం ఉంది. అలాంటప్పుడు మందులివ్వడం, డీఅండ్‌సీ చేయడం లాంటి చిన్న చికిత్సలు సరిపోవు. మహిళకు అవసరమైన అన్ని పరీక్షలూ నిర్వహించి... అలా రక్తస్రావం జరగడానికి కచ్చితమైన కారణాన్ని తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. చేయించుకోవాల్సిన పరీక్షలివి... మహిళల్లో మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం కనిపించిన పరిస్థితుల్లో అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజైనల్ స్కాన్ చేస్తారు. ఈ పరీక్షలో గర్భాశయ పనితీరూ, ఎండోమెట్రియం పొర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్ దశ దాటిన స్త్రీలలో ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సంకేతం కావచ్చు. కాబట్టి మరికొన్ని ఇతర పరీక్షలూ చేయించుకోవాల్సి ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లూ, గర్భాశయ పరిమాణం, ఆకృతి వంటి వివరాలు తెలుస్తాయి. అండాశయాలు చిన్నగా కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా అండాశయాల్లో సిస్టులు ఉండటం, వాటి పరిమాణం పెరుగుతుండటం, కణుతుల్లాంటివి ఉంటే అది అసహజమని గుర్తించాలి. స్కాన్ మాత్రమే కాకుండా అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేయాల్సి రావచ్చు. గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర నమూనా సేకరించి బయాప్సీకి పంపిస్తారు. ఈ పరీక్ష కోసం ఎలాంటి మత్తూ, ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. చిన్న గొట్టం ద్వారా నమూనాను సేకరిస్తారు. అయితే ఈ పరీక్షకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నమూనా సేకరించే సమయంలో... సమస్య ఉన్న ముక్క మాత్రమే రాకుండా ఆరోగ్యవంతమైనదీ రావచ్చు. దాంతో రిపోర్టు తప్పుగా వచ్చే అవకాశాలూ లేకపోలేదు. కొన్నేళ్ల కిందటివరకూ డీఅండ్ సీ (డైలటేషన్ అండ్ క్యూరటార్జీ) పద్ధతిలో నమూనాలను సేకరించేవారు. అంటే విడివిడిగా గర్భాశయం పైభాగం, కిందిభాగం, గర్భాశయ ముఖద్వారం నుంచి సేకరించేవారు. అప్పటికీ నూటికి నూరు పాళ్లు కచ్చితమైన ఫలితం వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మరో పరీక్ష హిస్టెరోస్కోపీ. గర్భాశయ ముఖద్వారం నుంచి సన్నని టెలిస్కోప్ని లోపలికి పంపి, కెమెరా ద్వారా లోపలి దృశ్యాలను మానిటర్‌పై చూస్తారు. అక్కడి పరిస్థితి అంతా భూతద్దంలో చూసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా సరైన చోటునుంచే నమూనా సేకరించవచ్చు. గర్భాశయం లోపలి పొర మందం, పాలిప్, ఫైబ్రాయిడ్, క్యాన్సర్ కణితి లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా చిన్న చిన్న పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి గుర్తించడంతోపాటూ అదే సమయంలో చికిత్స కూడా చేయవచ్చు. అంటే సమస్యను గుర్తించడం, చికిత్స చేయడం... ఈ రెండూ ఏకకాలంలో పూర్తవుతాయన్నమాట. సమస్యను గుర్తించేందుకు మరో పరీక్ష సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. అంటే, గర్భాశయంలోకి సెలైన్‌ని ఎక్కించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ కారణాలు తెలుసుకుంటారు. ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించకపోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేసేందుకు పాప్‌స్మియర్ లాంటివి చేయాల్సి రావచ్చు. ఈ ఫలితాలను బట్టి, చికిత్స లేదా ఆ తర్వాత ఏం చేయాలనేది వైద్యులు నిర్ణయిస్తారు.. ఇతర కారణాలూ ఉంటాయి... మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అనగానే అది తప్పక క్యాన్సరే అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితికి ఇతర కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు... పెద్దవయసులో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే చాలామందికి అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. అందుకే వైద్యులు ముందు జననేంద్రియభాగం చుట్టుపక్కల ఉండే ఇతర అవయవాలనూ క్షుణ్ణంగా పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా కొన్నిసార్లు రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, అక్కడి నుంచి రక్తస్రావం అయ్యేందుకూ అవకాశముంది. జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్, ఉన్నా ఇలా రక్తస్రావం కనిపించవచ్చు. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది. మెనోపాజ్ దశ దాటాక హార్మోన్ చికిత్స (హెచ్ఆర్టీ) తీసుకునేవారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ కోసం వాడే టామోక్సిఫిన్ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్ కనిపించవచ్చు. మరికొందరిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. కొందరికి వంశపారంపర్యంగా క్యాన్సర్లు వస్తాయి. ఈ పరిస్థితిని ‘లించ్ సిండ్రోమ్’ అంటారు. కారణాలేమైనప్పటికీ మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అయితే తప్పక గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి కొన్ని సూచనలూ... చికిత్సలు ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్ ఫలితం మామూలుగానే ఉన్నప్పుడూ రక్తస్రావం కనిపించినా భయపడాల్సిన అవసరంలేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఎండోమెట్రియం పొర ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని తేలితే మళ్లీ ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆ క్యాన్సర్ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికీ విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్ గ్రంథులూ, కాలేయం, ఊపిరితిత్తుల వరకు చేరిందా అని వైద్యులు నిశితంగా పరీక్షిస్తారు. దాన్ని బట్టి ఎలాంటి చికిత్స / శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉన్నా దానికి అనుగుణమైన చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరవాత రేడియేషన్, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది నిర్లణయిస్తారు. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే చాలామటుకు హిస్టెరోస్కోపీలోనే... పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి కనిపిస్తే... వాటిని తొలగిస్తారు. ఎండోమెట్రియం పొర మందం ఎక్కువగా పెరిగి.. రిపోర్టులో హైపర్‌ప్లేసియా అని వస్తే తీవ్రతను బట్టి ప్రొజెస్టరాన్ హార్మోను సూచిస్తారు. లేదంటే హిస్టెరెక్టమీ చేస్తారు. కొన్నిసార్లు హార్మోన్లు లేకపోవడం వల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి ‘ఎట్రోఫిక్ ఎండోమెట్రియం’ పరిస్థితి వస్తుంది. అప్పుడు అందుకు తగినట్లుగా హార్మోన్లు వాడాలని డాక్టర్లు సూచిస్తారు. ముందు జాగ్రత్తలు ముఖ్యమే.. అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు సాధారణ మహిళల కంటే ఈ సమస్య బారిన పడే అవకాశాలు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. కాబట్టి వారు తమ బరువును అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి. పీసీఓడీ ఉన్న వారు తప్పనిసరిగా మందులు వాడాలి. పిల్లలు కలిగాక వైద్యుల సలహాతో గర్భనిరోధక మాత్రలు లేదా ప్రొజెస్టరాన్ లూప్‌ని వాడటం ద్వారా ఎండోమెట్రియం పొర ఎదుగుదలను అదుపులో ఉంచొచ్చు. హార్మోన్ చికిత్స (హెచ్ఆర్టీ) తీసుకునే వారు ఈస్ట్రోజెన్‌తో పాటూ తప్పనిసరిగా ప్రొజెస్టరాన్‌ని వాడాలి. కుటుంబంలో లింఛ్ సిండ్రోమ్ (వంశపారంపర్యంగా క్యాన్సర్లు వచ్చే కండిషన్) ఉన్న స్త్రీలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌కి మందులు వాడుతున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌తో ఎప్పటికప్పుడు ఎండోమెట్రియం పొర గురించి తెలుసుకోవాలి -
మహిళల్లో మెనోపాజ్ సమస్యలు
మారుతున్న జీవన శైలితో నగర మహిళలు విభిన్న రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే క్రమంలో చిన్న వయసులోనే మెనోపాజ్ బారిన పడేలా చేస్తోంది. కరోనా, లాక్డౌన్ వంటి అనూహ్య పరిస్థితులు మహిళల్ని ముఖ్యంగా ఉద్యోగినులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ అనారోగ్య సమస్యల్ని సృష్టిస్తున్నాయి. అలాగే ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అవకాశాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మెనోపాజ్‌పై తగినంత అవగాహన అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నేడు వరల్డ్ మెనోపాజ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో : పన్నెండు నెలల పాటు పూర్తిగా పీరియడ్స్ రాకుండా ఉండడాన్నే మెనోపాజ్ అంటారు. మన దేశంలో 46 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వరకు ఈ దశ ఉంటుంది. 40 ఏళ్ల కన్నా ముందే పీరియడ్స్ రావడం ఆగిపోతే అది ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అంటారు. ఇది సహజంగా ఉండొచ్చు లేదంటే సర్జరీ ద్వారా అంటే యుట్రస్, ఓవరీస్ తీసేసినవారిలో ఈ సమస్య తలెత్తవచ్చు. ఎందుకిలా..? ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే వరుసగా నాలుగు నెలల పాటు పీరియడ్స్ రాకుండా ఉండటం. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లు అంటే థైరాయిడ్, జన్యుపరమైనవి, క్రోమోజోమ్‌లలో అపసవ్యత ఉన్నా ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ వస్తుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నవారికి పీరియడ్స్ ఆగిపోతే వారికి వైద్యుల కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. కుటుంబ మద్ధతు అవసరం. మెనోపాజ్ లక్షణాలు.. ఒంట్లో నుంచి వేడి సెగలు రావడం, గుండె దడగా అనిపించడం, రాత్రి పూట చమటలు పట్టడం, ఎక్కువసార్లు యూరిన్కెళ్లడం, మూత్రనాళం ఇన్ఫెక్షన్, ఎముకలు పట్టేయడం లేదా బలహీనం కావడం అవుతుంటాయి. మానసిక సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, లైంగిక సమస్యలు, ఆత్మన్యూనతా భావం వంటివి తలెత్తుంటాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే.. జీవనశైలి మార్చుకోవాలి. రోజూ గంటసేపు తప్పనిసరి వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. పొగతాగడం అలవాటు ఉన్నవారు దీన్ని మానేయాలి. క్యాల్షియం, విటమిన్- డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఆహారం ద్వారా తీసుకున్నా మేలు కలుగుతుంది. సరైన ఎండ కూడా మేనుకి తగిలేలా చూసుకోవాలి. వదులు దుస్తులు వేసుకోవాలి. చల్లటి వాతావరణంలో ఉండటం, మసాలా వంటకాలు తగ్గించాలి. మెనోపాజ్ వయసులో ఎముకల పటుత్వం పట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. వీరికి ఎముక భాగంలో, తుంటి భాగంలో ప్రాక్చరర్స్ ఎక్కువ అవుతుంటాయి. రిస్క్ తగ్గించుకోవాలంటే హార్మోన్ థెరపీ అవసరమవుతుంది. మెనోపాజ్‌లో హ్యాపీగా.. డిప్రెషన్ వంటి ఛాయలు ఈ దశలో సాధారణంగా ఎదుర్కోవాల్సిఉంటుంది. అందుకని కుటుంబంతో ఆనందంగా గడపాలి. స్నేహితులతో ఉల్లాసపు క్షణాలను వెతుక్కోవాలి. నచ్చిన హాబీని కొనసాగించాలి. ఒంటరిగా ఉండకుండా ఎవరికి వాళ్లు తీరకలేని వ్యాపకాన్ని ఎంచుకోవాలి. తోటపని చేయడం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవడం వంటివీ చేయొచ్చు. మానసిక ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉందో వాటన్నిటి మీదా దృష్టి పెట్టాలి. మెనోపాజ్ దశలో ఉన్నవాళ్లు ప్రతి ఏడాది వైద్యుల సలహా తీసుకుంటే రాబోయే సమస్యలను ముందే నివారించవచ్చు. -డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, ముషీరాబాద్ -
ఈ సమయంలో బరువు పెరగొచ్చా?
నా వయసు 29 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్. బాగా సన్నగా ఉంటాను. బరువు పెరగాలనుకుంటున్నాను. ఈ సమయంలో బరువు పెరగవచ్చా? ‘యావరేజ్ వెయిట్’ ఎంత ఉండాలి? ‘మార్నింగ్ సిక్నెస్’తో బాధపడుతున్నాను. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? – కె.శ్రీదేవి, రాజంపేట ప్రెగ్నెన్సీ సమయంలో గర్భం దాల్చినప్పుడు ఉండే బరువును బట్టి నెల నెలా ఎంత పెరగాలనేది సూచించడం జరుగుతుంది. సాధారణ బరువు ఉన్నవాళ్లకి నెలకు రెండు కిలోల వరకు బరువు పెరగవచ్చని చెప్పడం జరుగుతుంది. మీరు మరీ సన్నగా ఉన్నారంటున్నారు కాబట్టి నెలకు రెండున్నర నుంచి మూడు కిలోల వరకు బరువు పెరగవచ్చు. మొత్తం మీద తొమ్మిది నెలల వ్యవధిలో ఏవరేజ్‌గా పన్నెండు కిలోల వరకు పెరగవచ్చు. మీరైతే పదిహేను కిలోల వరకు పెరగవచ్చు. మొదటి మూడు నెలలు వాంతులు, వికారం వల్ల కొంతమంది సరిగా తినకపోవడం వల్ల కొందరు బరువు తగ్గిపోతారు కూడా. మార్నింగ్ సిక్నెస్ అంటే గర్భిణిలలో మొదటి మూడు నెలలో ఎక్కువగా విడుదలయ్యే హెచ్‌సీజీ హార్మోన్ వల్ల పొద్దున్నే లేచిన వెంటనే వికారం, నీరసం, వాంతులు, తలతిప్పడం వంటివి ఉండటం. వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, మజ్జిగ, పెరుగు, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో డాక్సినేట్, జన్డాన్సెట్రాన్ వంటి మాత్రలు వాడుకోవచ్చు. అవసరమైతే సెలైన్లు కూడా తీసుకోవలసి ఉంటుంది. మెనోపాజ్ నలభై ఏళ్ల కంటే ముందు కూడా వచ్చే అవకాశం ఉందని విన్నాను. ఇలా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలియజేయగలరు. – బి.సునీత, సంగారెడ్డి సాధారణంగా మెనోపాజ్ 45 నుంచి 55 సంవత్సరాల లోపు ఎప్పుడైనా రావచ్చు. కొందరిలో 40 ఏళ్ల లోపే రావచ్చు. దీనిని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. జన్యుపరమైన కారణాల వల్ల, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, పిల్లల కోసం ఎక్కువగా మందులు వాడటం, అండాశయాలపై ఆపరేషన్లు, కడుపులో కణితులకు, క్యాన్సర్‌కు రేడియో థెరపీ, కీమో థెరపీ వంటి చికిత్సలు తీసుకోవడం, ఇంకా ఎన్నో తెలియని ఇతర కారణాల వల్ల ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రావచ్చు. ఇది రాకుండా ఉండటానికి మనం ఏమీ చెయ్యలేం. కాకపోతే మరీ 40 సంవత్సరాలకే మెనోపాజ్ రావడం అంటే, అండాశయాల పనితీరు తగ్గిపోయి, ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల తొందరగా అలసిపోవడం, క్యాల్షియం తగ్గిపోయి ఒళ్లు, నడుము, మోకాళ్ల నొప్పులు, కలయిక మీద ఆసక్తి లేకపోవడం, మూత్ర సమస్యలు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీనికి ఆహారంలో ఎక్కువగా సోయాబీన్స్, ఆకుకూరలు, పండ్లు, పాలు, వాటి ఉత్పత్తులు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే, గైనకాలజిస్టును సంప్రదించి ఫైటో ఈస్ట్రోజెన్ మాత్రలు, క్యాల్షియం, అవసరమైతే హార్మన్లు కూడా తీసుకోవలసి ఉంటుంది. నా వయసు 27 సంవత్సరాలు. అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి లేజర్ చికిత్స చేయించుకోవాలనుకుంటున్నాను. ఈ టైమ్‌లో మంచిది కాదు అంటున్నారు. వ్యాక్సింగ్ చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. అయితే వ్యాక్సింగ్ కూడా మంచిది కాదని కొందరు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? మెడ, పొట్ట భాగం నల్లగా మారకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు. – విబీ, హైదరాబాద్ అవాంఛిత రోమాలను తొలగించుకునే ముందే అవి హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తున్నాయా, లేక పీసీఓడీ, అడ్రినల్ ట్యూమర్స్, ఒవేరియన్ ట్యూమర్స్ వంటి ఇతరేతర కారణాల వల్ల వస్తున్నాయా అనే విషయాన్ని పరీక్షలు చేయించుకుని కారణం తెలుసుకోవడం మంచిది. కారణం తెలుసుకోకుండా లేజర్ తీసుకున్నా, లోపల ఉన్న సమస్య వల్ల చికిత్సకు ఎక్కువ సిటింగ్స్ పట్టడం, కొంతకాలం తర్వాత మళ్లీ అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. వ్యాక్సింగ్ కేవలం తాత్కాలికమైనది. వ్యాక్సింగ్‌తో పోలిస్తే, లేజర్‌తో ప్రయోజనాలు ఎక్కువ. సమస్యకు తగిన చికిత్స తీసుకుంటూ లేజర్ చేయించుకోవడం మంచిది. మెడ మీద, పొట్ట మీద నలుపు చాలావరకు పీసీఓడీ సమస్యలో ఉంటుంది. దీనికి సంబంధించి డెర్మటాలజిస్టును సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవడం మంచిది. వీటిలో ముఖ్యంగా బరువు తగ్గడం, జీవనశైలి మార్పులు, వ్యాయామం, ఆహార మార్పులు ముఖ్యమైనవి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
వేడి ఆవిర్లు వస్తున్నాయి
నాకు నిద్ర సరిగా పట్టడం లేదు. వేడి ఆవిర్లు వస్తున్నాయి. ఇవి మెనోపాజ్ దశలోని లక్షణాలు అని విన్నాను. మెనోపాజ్ వచ్చిన వాళ్లు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈస్ట్రోజెన్ భర్తీ కావాలంటే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో తెలియజేయగలరు. – పీఆర్వి, అవనిగడ్డ మీ వయసు ఎంతో రాయలేదు. పీరియడ్స్ ఆగిపోయి ఎన్నాళ్లయిందో రాయలేదు. నలభై ఏళ్ల తర్వాత ఒక ఏడాది పాటు పీరియడ్స్ రాకపోతే దానిని మెనోపాజ్ అంటారు. ఈ సమయంలో అండాశయం నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్ బాగా తగ్గిపోవడం వల్ల బాగా చెమటలు పట్టడం, ఒంట్లో వేడి ఆవిర్లు రావడం, గుండెదడగా ఉండటం, నిద్రపట్టకపోవడం, చిరాకు, మతిమరుపు వంటి ఎన్నో లక్షణాలు ఉండవచ్చు. వేసవిలో కొన్ని లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా ఫ్యాన్ లేదా ఏసీ ఉండే చోట ఉండాలి. వదులుగా ఉండే లేతరంగు కాటన్ దుస్తులు ధరించాలి. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు, మజ్జిగ, నీరు, పండ్లు, పండ్లరసాలు తీసుకోవాలి. పచ్చళ్లు, వేపుళ్లు, కారాలు, మసాలాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. రోజూ కనీసం పదిహేను నిమిషాల సేపు నడక, యోగా, ధ్యానం వంటివి పాటించడం మంచిది. సహజంగా శరీరంలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ తగ్గిపోవడం వల్ల రక్తం నుంచి క్యాల్షియం ఎముకలకు చేరదు. ఎముకలు తొందరగా అరిగిపోవడం వల్ల నడుం నొప్పులు, ఒంటినొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో తాజా కూరగాయలు, పప్పులు, పండ్లు, అవిసెగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, సోయాబీన్స్, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు వల్ల వీటి ద్వారా క్యాల్షియంతో పాటు ఈస్ట్రోజెన్లా పనిచేసే ఫైటోఈస్ట్రోజెన్స్ లభ్యమవుతాయి. ఈ జాగ్రత్తలు పాటించినా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించి, ఫైటోఈస్ట్రోజెన్స్, ఐసోఫ్లావోన్స్ ఉండే సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవచ్చు. ఈస్ట్రోజెన్ హార్మోన్ మాత్రల రూపంలో లేదా స్ప్రే రూపంలో లేదా జెల్ రూపంలో డాక్టర్ సలహా మేరకు తక్కువ మోతాదుల్లో వాడుకోవచ్చు. నాకు కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉంది. దీనివల్ల పిల్లలు బరువుతో పుడతారని అంటున్నారు. పిల్లలు బొద్దుగా ఉంటే నాకు ఇష్టం. ఇలా బరువుగా పుట్టడం వల్ల నష్టం ఉందా? గర్భిణులలో జెస్టేషనల్ డయాబెటిస్ రావడానికి కారణం ఏమిటో తెలియజేయగలరు. – జి.హేమ, రంగంపేట కూల్‌డ్రింక్స్‌లో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్, ఫాస్ఫారిక్ యాసిడ్, కార్బానిక్ యాసిడ్, కెఫీన్, సుగర్, కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో పోషక పదార్థాలేవీ ఉండవు. వీటిలో సుగర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తాగితే గర్భిణులలో బరువు పెరగడం, సుగర్ లెవల్స్ పెరగడం, కడుపులోని బిడ్డ అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కూల్‌డ్రింక్స్‌లోని మిగిలిన పదార్థాల వల్ల కడుపులో గ్యాస్ తయారవడం, ఎసిడిటీ ఏర్పడటం, కెఫీన్ మోతాదు మించడం వల్ల అబార్షన్లు, పుట్టే బిడ్డల్లో అవయవ లోపాలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ అధిక బరువుతో ఉంటే కాన్పు సమయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. సుగర్ లెవల్స్‌లో తేడాలు, ఇతరత్రా సమస్యలు కూడా ఏర్పడవచ్చు. బిడ్డ మరీ బొద్దుగా ఉండే కంటే, మామూలు బరువుతో ఉండి చలాకీగా ఉండటం ముఖ్యం. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే గర్భిణులలో ఉండాల్సిన మోతాదు కంటే సుగర్ లెవల్స్ పెరిగి మధుమేహం రావడం. ప్రెగ్నెన్సీలో అధిక బరువు పెరగడం, హార్మోన్ల సమతుల్యత లోపించడం వంటి అనేక కారణాల వల్ల జెస్టేషనల్ డయాబెటిస్ రావచ్చు. ఇది నిర్ధారణ అయితే డాక్టర్ పర్యవేక్షణలో ఆహారంలో మార్పులు చేసుకుని, అవసరమైతే మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ సుగర్ లెవల్స్‌ను సక్రమంగా అదుపులో ఉంచుకుంటే పండంటి బిడ్డను క్షేమంగా కనవచ్చు. హోర్మోన్ల లోపానికి, నెలసరిలో తేడా, ఒత్తిడికి దగ్గర సంబంధం ఉంటుందని చదివాను. హార్మోన్ల సమతుల్యం పెంచుకోవడానికి ఏం చేయాలో తెలియజేయగలరు.– బి.సారిక, హైదరాబాద్ పీరియడ్స్ సక్రమంగా రావాలి. హార్మన్స్ సక్రమంగా విడుదల కావాలి. మొదట మెదడులోని హైపోథాలమస్ అనే భాగం నుంచి జీఎన్ఆర్హెచ్ అనే హార్మోన్ విడుదలై అది పిట్యూటరీ గ్రంథిని ఉత్తేజపరచడం వల్ల పిట్యూటరీ నుంచి ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ప్రోలాక్టిన్, టీఎస్‌హెచ్ వంటి అనేక హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయం ఇరువైపులా ఉండే అండాశయాల నుంచి అండాలు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి గర్భాశయంపై ప్రభావం చూపి నెలసరి రావడానికి దోహద పడతాయి. కాబట్టి మొదట మెదడు సక్రమంగా ఉంటే, హార్మోన్స్ సక్రమంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, పీరియడ్స్ క్రమం తప్పి, నెలనెలా సక్రమంగా రాకపోవచ్చు. కాబట్టి క్రమంగా నడక, వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటి జీవనశైలి మార్పులు, ఆహారంలో మార్పులు పాజిటివ్ దృక్పథం, ఆత్మస్థైర్యం వంటివి అలవరచుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, హార్మోన్ల సమతుల్యత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ ,హైదరాబాద్ -
ఎందుకో... ఆందోళన
నా వయసు 27 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్. ఎందుకో తెలియదు, అప్పుడప్పుడు అకారణ ఆందోళనకు గురువుతుంటాను. ‘బిహేవియరల్ యాక్టివేషన్’ అనే టెక్నిక్‌తో ఈ సమస్యకు దూరం కావచ్చు అని ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చింది. వైద్యుల సలహా తీసుకున్న తరువాతే అలాంటి టెక్నిక్లను పాటించాలనే ఉద్దేశంతో మీ సలహా కోరుతున్నాను. – జి.రూప, ఆలేరు ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే హర్మోన్ల మార్పుల వల్ల, శరీరంలో జరిగే మార్పుల వల్ల ఎన్నో తెలియని భయాలు, సందేహాల వల్ల కొందరు గర్భవతులు అప్పుడప్పుడూ ఆందోళనకు గురవుతుంటారు. ఆందోళన, డిప్రెషన్‌కు గురయ్యేవారు బిహేవియరల్ యాక్టివేషన్ అనే టెక్నిక్‌లో శిక్షణ తీసుకున్న థెరపిస్ట్‌లు లేదా స్పెషలిస్ట్‌లను సంప్రదించినప్పుడు వారి సమస్యను తెలుసుకోవడమే కాకుండా, అది ఏ సమయంలో ఉంటుంది? దానిని అధిగమించడానికి ఏమి చేస్తారు, చెయ్యాలనుకుంటున్నారు..వంటి ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాలను వారికి ఇచ్చి, వారు ఇచ్చే జవాబును బట్టి, వారికి అనేక సలహాలను, ఉదాహరణలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోజువారీగా వారు ఏ రోజుకా రోజు సలహాలను పాటించారా లేదా, ఆందోళనను మళ్ళించడానికి వారికి ఇష్టమైన పనులను, వారు చెయ్యాలనుకొని చెయ్యలేని పనులను చెయ్యడానికి ఉత్సాహపరచడం వంటి మాట సహాయం చేస్తూ వారికి ధైర్యాన్ని నింపి, వారి డిప్రెషన్‌ను దూరం చేస్తారు. ఈ బిహేవియరల్ యాక్టివేషన్ టెక్నిక్‌లో మందులు వాడడం జరగదు కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కాబట్టి సందేహం లేకుండా దీనిని పాటించవచ్చు. ఒక సమస్య గురించి డాక్టర్ని సంప్రదించినప్పుడు మెనోపాజ్ సమయంలో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల శాతం తగ్గడం వల్ల సమస్యలు వస్తాయని చెప్పారు. మెనోపాజ్ సమయంలో ఈ హార్మోన్లు ఎందుకు తగ్గుతాయి. ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? నివారణకు ఏంచేయాలి? – కె.మాలతి, హైదరాబాద్ ఆడవారిలో గర్భాశయం ఇరువైపుల ఉన్న అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్, కొద్దిగా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ సక్రమంగా విడుదల అవుతుంటాయి. సాధారణంగా ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి వారి జన్యువుల స్థితిని బట్టి అండాశయాల పనితీరు మెల్లగా అది సంవత్సరాల నుంచి తగ్గడం మొదలయ్యి, 50 దగ్గర పడేకొద్ది వాటి పనితీరు చాలావరకు, పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఈ హార్మోన్స్ విడుదల చాలావరకు తగ్గిపోతుంది. దీనివల్ల పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయి, మెనోపాజ్ దశను చేరుకుంటారు.కొందరిలో 55 సంవత్సరాలకు కూడా మెనోపాజ్ దశకు చేరుకుంటారు. కొందరిలో 40 సంవత్సరాలకే పీరియడ్స్ ఆగిపోయి ప్రిమెచ్యూర్ మెనోపాజ్‌కు చేరుకుంటారు.ఈస్ట్రోజన్ హార్మోన్ ఆడవారి శరీరంలో అనేక రకాల ప్రక్రియలకు అవసరం. ఇది శరీర, ఎముకల, చర్మ, దృఢత్వానికి, పీరియడ్స్ సక్రమంగా రావడానికి, రొమ్ములు, జననేంద్రియాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కొద్ది మోతాదులో విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ (ఇది ఎక్కువగా మగవారిలో ఉంటుంది). ఆడవారి కండరాల, ఎముకల దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, లైంగిక తృప్తికి ఉపయోగపడుతుంది.ప్రకృతిపరంగా, సహజసిద్ధంగానే వయసు పెరిగే కొద్ది అవయవాల పనితీరు ఎలా మందగిస్తుందో, అలాగే అండాశయాల పనితీరు తగ్గి హోర్మోన్స్ తగ్గిపోయి మెనోపాజ్ దశకు చేరుతారు. దీనిని నివారించలేము. కాకపోతే ఇవి తగ్గడం వల్ల వచ్చే సమస్యలకు డాక్టర్ సలహా మేరకు, సరైన పౌష్టికాహారం, వ్యాయామాలు, యోగా, ధ్యానం అవసరమైతే హార్మోన్స్ మందుల ద్వారా తీసుకోవడం వల్ల సమస్యల తీవ్రతను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నేను బాగా సన్నగా ఉంటాను. ‘ఈవిడే సన్నగా ఉంటుంది. ఇక పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో’ అని కొందరు చాటు మాటుగా అనుకుంటున్నారు. తల్లి సన్నగా ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? ఈ సమయంలో బరువు పెరిగే ప్రయత్నాలు చేయవచ్చా? – పి.నీరజ, శ్రీకాకుళం గర్భాశయంలో పెరిగే బిడ్డకు పోషకపదార్థాలు తల్లి తీసుకునే ఆహారం, మాయ ద్వారా తల్లి నుండి బిడ్డకు రక్తనాళాల ద్వారా చేరుతుంది. కొందరిలో మాయ సరిగా లేకపోవడం, రక్తనాళాలు సరిగా వ్యాకోచించకుండా ఉండటం, వాటిలో రక్తం గూడు కట్టడం వంటి అనేక కారణాల వల్ల బిడ్డకు రక్తసరఫరా లేకపోవడం వల్ల బిడ్డ బరువు పెరగక పోవచ్చు.అలాగే గర్బాశయం చిన్నగా ఉండడం, దాని పొరల్లో లోపాలు ఉన్నప్పుడు కూడా అవి సరిగా సాగకుండా బిడ్డ బరువు పెరగకపోవచ్చు.కొందరిలో తల్లిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా బిడ్డ బరువు ఎక్కువగా పెరగకపోవచ్చు. తల్లిలో ఇన్ఫెక్షన్స్, బీపీ పెరగటం వంటి అనేక కారణాల వల్ల బిడ్డ బరువు పెరగకపోవచ్చు. తల్లి ముందు నుంచి సన్నగా ఉన్నా, గర్భం దాల్చిన తర్వాత పైన చెప్పిన కారణాలు ఏమీ లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో పౌష్టికాహారం బాగా తీసుకుంటూ ఐరన్, కాల్షియం, విటమిన్ టాబ్లెట్స్ సరిగ్గా వాడుతుంటే బిడ్డ మంచి బరువుతో పుడతాడు.అలాగే ఆహారంలో అన్నంతో పాటు ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పాలు,పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. అలాగే మాంసహారులయితే, రోజు ఒక గుడ్డు, మాంసం, చేపలు వంటివి తీసుకోవచ్చు.తల్లి సన్నగా ఉండి పైన జాగ్రత్తలు తీసుకోకపోతే, బిడ్డ బరువు తక్కువగా పుట్టడం, తల్లిలో బిడ్డలో కూడా రక్తహీనత, ఎముకలు బలహీనంగా ఉండడం, కాన్పు సమయంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
మహిళల హార్మోన్లు అండర్ అటాక్
-
మెనోపాజ్ ఆందోళన వీడండి... ఆనందంగా జీవించండి
ఉమన్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. కొంతకాలం నుంచి నన్ను ఒక సమస్య తీవ్రంగా కలచివేస్తోంది. అదేమిటంటే మెనోపాజ్ వచ్చిందేమోనని భయంగా ఉంది. ఎందుకంటే గత ఆర్నెల్లుగా నాకు రుతుస్రావం సక్రమంగా అవడం లేదు. ప్రతి చిన్న విషయానికీ అందరిపై చికాకు పడుతున్నాను. అదే పనిగా ఆవేశానికి లోనవుతున్నాను. కలత చెందుతున్నాను. నాలో ఉత్సాహం తగ్గిపోయి నీరసం, నిస్సత్తువ ఆవహించినట్టు ఉంటోంది. ఏ విషయంలోనూ ఏకాగ్రతను పెట్టలేకపోతున్నాను. నాలో వచ్చిన ఈ విపరీతమైన మార్పులతో నా స్నేహితులు ‘నువ్వు మెనోపాజ్‌కు చేరువవుతున్నట్లున్నావు’ అని అంటున్నారు. అసలు నాకు ఏమైంది? - రాజ్యలక్ష్మి, ఒంగోలు మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు మెనోపాజ్‌తో బాధపడుతున్నట్లు అనిపించడం లేదు. సాధారణంగా మెనోపాజ్ నలభై ఏళ్లు పైబడినవారి తర్వాతే ఎక్కువ. మెనోపాజ్ మొదలైన స్టేజ్‌ని వైద్యశాస్త్రంలో ‘గోల్డెన్ ఏజ్’గా అభివర్ణిస్తారు. దీనికి అంతటి ప్రాముఖ్యత ఉంది. మీకు త్వరగా పెళ్లి కావడం వల్ల మీరు మెనోపాజ్ గురించి అనవసరంగా చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారేమోనని అనిపిస్తోంది. ఇలా తీవ్రమైన ఆందోళనకు గురైనా కూడా త్వరగా మెనోపాజ్‌కు లోనయ్యే అవకాశాలున్నాయి. అయినప్పటికీ మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఈ ప్రక్రియ ప్రకృతి సహజమైనది. జీవితంలో అన్నింటినీ పాజిటివ్‌గా తీసుకుని, మిగతా లైఫ్‌ని ఆనందంగా గడపాలి. ఈకాలంలో మహిళలందరూ ఉన్నతమైన స్థానాలను అధిరోహించి తమ తమ వృత్తి ఉద్యోగాల్లో గొప్పగా రాణిస్తున్నారు. కొందరు మెనోపాజ్ దాటిన వారు కూడా వారిలో ఉన్నారు. వారందరినీ మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మీరు మంచి గైనకాలజిస్ట్‌ను కలవండి. మీ సమస్యతో పాటు మీ అనుమానాలూ క్లియర్ అవుతాయి. ఈలోగా మీరు మంచి ఆహారాన్ని తీసుకోండి. మసాలా, వేపుళ్లు, కాఫీల వంటివి ఎక్కువగా తీసుకోకండి. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి. రెస్ట్ తీసుకోండి. వైటమిన్-డి, క్యాల్షియమ్ ఉండే ఆహారాన్ని గానీ లేదా ట్యాబ్లెట్లుగా గానీ తీసుకోండి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ స్ట్రెస్‌ను దూరం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేలా చూసుకోండి. మిత్రులను కలవడం, ఆరోగ్యకరమైన సంభాషణలు వంటివి చేయండి. మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. - డాక్టర్ శాంతకుమారి సీనియర్ గైనకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
మెనోపాజ్ దాటాక గుండె జబ్బులు ఎక్కువా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 43 ఏళ్లు. మెనోపాజ్ దాటిన మహిళలకు గుండెజబ్బులు ఎక్కువని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇది వాస్తవమేనా? - శ్రీలేఖ, కాకినాడ గతంలో పురుషులతో పోలిస్తే... మహిళల్లో గుండెజబ్బులు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు స్త్రీలలోనూ గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారిపోతున్న జీవనశైలి, క్రమపద్ధతిలో లేని నిద్ర, ఆహార నియమాలు, పనుల ఒత్తిళ్లు... లాంటి పరిస్థితులన్నీ మహిళల్లోనూ ఇప్పుడు గుండెజబ్బులను పెంచుతున్నాయి. గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాలు సన్నబారడం లేదా మూసుకుపోవడం వల్ల గుండెజబ్బులు వస్తాయి. కరొనరీ ఆర్టరీ డిసీజ్ అని పిలిచే ఈ జబ్బు గుండెపోటుకు దారితీస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళలపై ఈ ప్రమాదం పదేళ్లు ఆలస్యమవుతుంది. మెనోపాజ్ తర్వాత ఈ ముప్పు మరింత పెరిగే మాట వాస్తవమే. మెనోపాజ్ తర్వాత శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్ తగ్గి, చెడు (బ్యాడ్) కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయి. పెరిగే వయసుతో అధిక రక్తపోటు కూడా మొదలవుతుంది. ఇవన్నీ గుండెజబ్బుల ముప్పును పెంచే అంశాలే. నడక వంటి వ్యాయామంతో పాటు ముందు నుంచీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులను చాలావరకు అదుపులో ఉంచవచ్చు ప్రతిరోజూ కనీసం అరగంట నడక లేదా పరుగు లేదా ఏరోబిక్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వారంలో కనీసం ఐదురోజులైనా ఈ వ్యాయామాలు చేయాలి ఆహారంలో ఉప్పును చాలా పరిమితంగా తీసుకోవాలి. పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయల మోతాదును పెంచాలి. అలాగే శాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి మీ మానసిక ఒత్తిడిని సాధ్యమైనంతగా తగ్గించాలి. రోజూ కనీసం ఓ పది నిమిషాలు ధ్యానం చేయాలి నూనెలను చాలా పరిమితంగా తీసుకోవాలి. వయసును బట్టి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. ఇందుకోసం క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి గుండెజబ్బులకు దారితీసే అంశాలపై (రిస్క్ ఫ్యాక్టర్లపై) దృష్టి సారించాలి. ఉదాహరణకు అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, డయాబెటిస్ లాంటివి ఉంటే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ గుండెజబ్బులను నివారించుకుంటే వాటి వల్ల కలిగే ప్రమాదాన్నీ నివారించుకున్నట్లేనని తెలుసుకోండి. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. గర్భాశయంలో కణుతులు... తగ్గుతాయా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నాకు కొంతకాలంగా రుతుస్రావం ఎక్కువరోజులు కొనసాగటం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడడంతో గైనకాలజిస్టును సంప్రదించాను. వారు స్కాన్ చేయించి నా గర్భాశయంలో కణితులు ఏర్పడ్డాయని, వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. హోమియోతో ఈ వ్యాధి నయం అయ్యే అవకాశం ఉందా? - పి.పి.జె, మచిలీపట్నం చాలామంది స్త్రీలలో ఈ గర్భాశయ కణితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడడంతోపాటు వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం వంటి చర్యలకు దారితీస్తుంది. తద్వారా వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురికావడం జరుగుతుంది కానీ హోమియో చికిత్స ద్వారా ఈ వ్యాధికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా పూర్తిగా నయం అయే అవకాశం ఉంది. సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే కణితులను యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయపు కండర కణజాలంతో ఏర్పడతాయి. 16-50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశ ఉంది. నెలసరి ఆగిపోయిన మహిళలలో వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది. సంతానోత్పత్తి వయస్సు గల వారినే ఇది ఎక్కువగా ప్రభావితం చేయడం వల్ల ఇది సంతానలేమికి కూడా దారితీస్తోంది. ఈ కణితులు ఒకటిగా లేదా చిన్న చిన్న కణితులు మిల్లీమీటరు మొదలుకొని కొన్ని సెంటీమీటర్ల పరిమాణం వరకు పెరుగుతాయి. గర్భాశయంలో ఇవి ఏర్పడే ప్రాంతపు ఉనికి, పరిమాణం రీత్యా వీటిని మూడు రకాలుగా విభజించడం జరిగింది. ఇన్ట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్: గర్భాశయం లోపలి గోడల మధ్యలో ఏర్పడే ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి. సబ్ సీరోజల్: గర్భాశయం వెలుపలి గోడలపై ఏర్పడే ఈ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్ద పరిమాణంలో పెరిగే అవకాశం ఉంది. సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్: ఇవి గర్భాశయంలో ఉండే మ్యూకోజల్ పొరలో ఏర్పడి గర్భాశయపు కుహరంలోకి పెరుగుతాయి. కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల ఇవి ఏర్పడే అవకాశ ఉంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల ఇవి ఏర్పడే అవకాశ ఉంటుంది. నెలసరి ఆగిపోయిన మహిళలలో ఈ హార్మోన్ ఉత్పాదన తక్కువగా ఉండటం వల్ల అవి కుచించుకుపోతాయి. స్థూలకాయం, మద్యపానం, కెఫీన్ వాడకం వంటి అంశాలు ఈ కణితులు ఏర్పడటాన్ని ప్రేరేపిస్తాయి. లక్షణాలు: రుతుస్రావం ఎక్కువ రోజులపాటు కొనసాగడం, అధిక రక్తస్రావం కావడం, రెండు రుతుచక్రాల మధ్యలో రక్తస్రావం అవడం, నడుమునొప్పి, కడుపులోనొప్పి, కాళ్లలో నొప్పి. అధిక రక్తస్రావం మూలంగా రక్తహీనత ఏర్పడటం. తరచు మూత్రానికి వెళ్లాల్సి రావడం, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటివి. చికిత్స: హోమియోలో అందించే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా ఈ గర్భాశయ కణితులను పూర్తిగా కరిగించడమే కాకుండా, హార్మోన్ల అసమతుల్యతను, రుతుచక్రాన్ని సరిచేయడం ద్వారా వ్యాధి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మళ్లీ వ్యాధి తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయం అవుతంది. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
మెనోపాజ్‌కు ముందు ఇదో ‘తలనొప్పి’!
సాధారణంగా టీనేజ్ దాటి వయసు పెరుగుతుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంటుంది. కానీ మెనోపాజ్‌కు చేరువైన కొద్దీ మైగ్రేన్ తలనొప్పి పెరుగుతుంటుందని ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తేలింది. గత కొన్నేళ్లుగా తమకు మైగ్రేన్ తలనొప్పి పెరుగుతోందని మహిళల నుంచి డాక్టర్లకు ఎక్కువగా కంప్లెయింట్స్ వస్తున్నాయి. అయితే మెనోపాజ్‌కు చేరువవుతున్న కొద్దీ తలనొప్పి పెరగడంతో పాటు నెలలో పది రోజుల వరకూ తలపోటు ఉంటోందట. గతంలో కంటే ఈ తరహా కేసులు దాదాపు 60 శాతం పెరిగాయని ‘హెడేక్ : ద జర్నల్ ఆఫ్ హెడ్ అండ్ ఫేస్ పెయిన్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. రుతుస్రావం ఆగడానికి ముందుగా ఉండే ‘పెరీమెనోపాజ్’ సమయంలో ఈ తలనొప్పులు మరింత ఎక్కువవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. -
తొమ్మిదేళ్ల పాపకు పులిపిరులు ఎక్కువైతే?...
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. ఏడాదిగా చిన్న విషయాలకే చిరాకు, కోపం వస్తోంది. మా స్నేహితురాళ్లు... ఇది మెనోపాజ్ వయసు గనక అలాగే ఉంటుంది, ఏం పరవాలేదంటున్నారు. నాలో ఆందోళన ఎక్కువవుతోంది. ఆయుర్వేదంలో పరిష్కారం సూచించ ప్రార్థన. - రత్నకుమారి, నిజామాబాద్ స్త్రీలలో బహిష్టులు పూర్తిగా ఆగిపోవడానికి ముందుగా కొంతకాలంపాటు, బహిష్టులు ఆగిపోయిన అనంతరం కొంతకాలంపాటు శారీరకంగా, మానసికంగా చాలామార్పులు సంభవించడం వల్ల చాలా లక్షణాలతో బాధపడటం సహజం. ఈ సమస్యను ‘మెనోపాజ్’గా చెబుతారు. ఈ ప్రక్రియ 45-55 ఏళ్ల వయసులో సంభవిస్తుంది. ఇక్కడ వాతదోషం ప్రధానంగానూ, పిత్తదోషం అనుబంధంగానూ చోటుచేసుకొని, స్త్రీల హార్మోన్లలో విశిష్టమైన తేడాలు కనిపిస్తాయి. ఆ వయసుకు సంబంధించిన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఆయుర్వేదం ఈ కింది ప్రక్రియలను నిర్దేశించింది. ఆహారం: ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను గణనీయంగా తగ్గిస్తూ, పోషకవిలువలను సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. పీచుపదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజాఫలాలు, ఎండిన ఫలాలు ప్రతినిత్యం తినాలి. ఉదా: కొబ్బరినీళ్లు, చెరకురసం, వెజిటబుల్ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి. మొత్తంమీద రోజూ 4-5 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తాగాలి. నువ్వుల పప్పు ప్రతిరోజూ ఉదయం 2 చెంచాలు, సాయంత్రం రెండు చెంచాలను నమిలి తింటే క్యాల్షియమ్ అధికంగా లభిస్తుంది. మొలకెత్తే దినుసులు కూడా మంచిదే. విహారం: ప్రాతఃకాలంలో నిద్రలేవడం, రాత్రి 10గంటలకల్లా పడుకోవడం చాలా అవసరం. రోజూ ఉదయం లేలేత సూర్యకిరణాలలో ఓ అరగంటపాటు ఉండాలి. శ్రావ్యమైన సంగీతం వినడం చాలా మంచిది. ఔషధం: శతావరెక్స్ (గ్రాన్యూల్స్) ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా పాలతో తాగాలి. సరస్వతీ లేహ్యం: ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా తినాలి. పునర్నవాది మండూర (మాత్రలు) ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, అధికరక్తస్రావం ఉంటే ‘బోలబద్ధరస’ మాత్రలు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఇలా రోజుకి ఆరు వరకు వాడవచ్చు. గమనిక: మధుమేహం, హైబీపీ వంటి ఇతర వ్యాధులు ఉంటే వాటిని అదుపులోకి తేవాలి. గృహవైద్యం: శొంఠి, దనియాలు, జీలకర్ర... ఈ మూడింటిని కషాయంలాగా కాచుకొని ఉదయం ఆరు చెంచాలు, సాయంత్రం ఆరు చెంచాలు తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా అమ్మాయికి తొమ్మిదేళ్లు. ఆమెకు ముఖం మీదా, ఒంటిపైన అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి వస్తున్నాయి. పైగా అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆమె మేనిపై వాటిని చూస్తే మాకు ఆందోళనగా ఉంది. మా పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి. - కల్యాణి, కోదాడ మీరు చెప్పిన వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ఇది ముఖ్యంగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. వ్యాప్తి జరిగే తీరు... చర్మానికి చర్మం తగలడం వల్ల, వ్యాధి ఉన్నవారి తువ్వాళ్లను మరొకరు ఉపయోగించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా చాలా సాధారణం. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స: ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్.... అంటే ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ కలిపి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, చికిత్సను కొనసాగించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయస్సు 32. నేను గత మూడేళ్లుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నాను. నేను దగ్గినప్పుడు దగ్గుతో తేన్పు కూడా వస్తుంది. నాకు సరైన చికిత్స వివరించగలరు. - సుజాత, గుంటూరు మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు బ్రాంకైటిస్‌తో బాధపడుతున్నారు. శ్వాసనాళాలకు వచ్చే ఇన్ఫ్లమేషన్ (వాపు, ఎరుపు)నే బ్రాంకైటిస్ అంటారు. శ్వాసనాళపు గోడ లేదా లోపలి కండరం మందం పెరగడం వల్ల గానీ కండరం కుచించుకు పోవడం వల్ల గానీ ఇలాంటి పరిస్థితులు కలుగుతుంది. కారణాలు: బాక్టీరియా, వైరల ఇన్ఫెక్షన్ల వల్ల బ్రాంకైటిస్ వస్తే గనక ఆ సమస్య స్వల్పకాలికంగా ఉంటుంది. అదే అలర్జీ వల్ల వస్తే దీర్ఘకాలికంగా వేధిస్తుంది. పుప్పొడి, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల వెంట్రుకల లాంటివి అలర్జీ కారక పదార్థాలు. కొందరికి తలస్నానం చేస్తే కూడా తుమ్ములు మొదలై అలర్జీ ప్రారంభమౌతుంది. పొగ తాగడం వల్ల కేవలం శ్వాసవ్యవస్థలోని కింది భాగం ప్రభావితం అవుతుంది. కాని అలర్జీ వల్ల మొత్తం శ్వాసవ్యవస్థ ప్రభావితం అవుతుంది. నివారణ: అలర్జీ కారక పదార్థాలు, ప్రేరకాలకు దూరంగా ఉండడం దీర్ఘకాలిక జలుబు, దగ్గు ఆయాసం వేధిస్తుంటే అశ్రద్ధ చేయకుండా డాక్టరును సంప్రదించాలి సొంత వైద్యం వద్దు. పరిష్కారం: అన్ని రకాల బ్రాంకైటిస్లకు యాంటీ బయోటిక్స్ వాడకూడదు. కేవలం బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు మాత్రమే యాంటీ బయోటిక్స్ వాడాలి. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు ఇవి పనిచేయవు. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు యాంటీ హిస్టామిన్స్, డీ కంజెస్టెంట్స్లాంటి మందులు ఉపశమనం కలిగిస్తాయి. దగ్గుకు సిరప్లు బాగా పని చేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల సమస్య తగ్గకపోగా ఇంకా పెద్దవి కావొచ్చు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి కూడా సొంతంగా యాంటీ బయోటిక్స్ వాడకూడదు. ఇష్టం వచ్చినట్లు మిడి మిడి జ్ఞానంతో వీటిని వాడటం వల్ల బాక్టీరియా నిరోధకతను పెంచుకుంటుంది. అందుకే డాక్టర్‌ను సంప్రదించకుండా ఉపయోగించవచ్చు. అశ్రద్ధ చేస్తే: బ్రాంకైటిస్‌కు సరైన చికిత్స తీసుకోకపోయినా, అశ్రద్ధ చేసినా అది న్యుమోనియాకు దారితీయొచ్చు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా యాంటీబయోటిక్స్ వాడాలి. న్యుమోనియా ఉన్నప్పుడు అసాధారణ శబ్దాలు వినబడతాయి. ఎక్స్‌రేలో మచ్చలుగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిచాల్సి వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నా, షుగర్ అదుపులో లేకున్నా, కిమోథెరపీ మందులు వాడి ఉన్నా... హెచ్ఐవీ ఉన్నా న్యూమోనియా పదేపదే రావొచ్చు. స్టిరాయిడ్స్, రేడియేషన్ తీసుకున్న వాళ్లలో కూడా న్యుమోనియా మళ్లీ రావచ్చు.