మెనోపాజ్‌కు ముందు ఇదో ‘తలనొప్పి’!
సాధారణంగా టీనేజ్ దాటి వయసు పెరుగుతుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంటుంది. కానీ మెనోపాజ్‌కు చేరువైన కొద్దీ మైగ్రేన్ తలనొప్పి పెరుగుతుంటుందని ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తేలింది. గత కొన్నేళ్లుగా తమకు మైగ్రేన్ తలనొప్పి పెరుగుతోందని మహిళల నుంచి డాక్టర్లకు ఎక్కువగా కంప్లెయింట్స్ వస్తున్నాయి. అయితే మెనోపాజ్‌కు చేరువవుతున్న కొద్దీ తలనొప్పి పెరగడంతో పాటు నెలలో పది రోజుల వరకూ తలపోటు ఉంటోందట.
గతంలో కంటే ఈ తరహా కేసులు దాదాపు 60 శాతం పెరిగాయని ‘హెడేక్ : ద జర్నల్ ఆఫ్ హెడ్ అండ్ ఫేస్ పెయిన్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. రుతుస్రావం ఆగడానికి ముందుగా ఉండే ‘పెరీమెనోపాజ్’ సమయంలో ఈ తలనొప్పులు మరింత ఎక్కువవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది.