నాకు 43 ఏళ్లు. ఆరునెలలుగా పీరియడ్స్ రావడం లేదు. డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే మెనోపాజ్ అంటున్నారు. ఇంత త్వరగా నెలసరి ఆగిపోతుందా? మా అక్కకి 50 ఏళ్ల తరువాత ఆగిపోయాయి. 43 ఏళ్లకే ఆగిపోవడం ఏదైనా ప్రమాదమా?
– సీహెచ్. లావణ్య, కర్నూలు
ఎర్లీ మెనోపాజ్ అంటే 45 ఏళ్లు నిండకుండా నెలసరి ఆగిపోవడం. 40 ఏళ్లలోపు ఆగిపోతే అది ప్రీమెనోపాజ్. ఈ రోజుల్లో చాలామందికి 45 ఏళ్లలోపే నెలసరి ఆగిపోతోంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందువల్ల అండాలు విడుదలకాకుండా అండాశయాల్లోనే ఉండిపోయి నెలసరి రాదు. వీరిలో మస్కులోస్కెలిటల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మజిల్ మాస్ తగ్గినందువల్ల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడుతుంటారు. మీరు ఏడాదికోసారి కార్డియో వాస్కులర్ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్‌లను సంప్రదిస్తుండాలి.
వంద మందిలో అయిదుగురికి 45 ఏళ్లలోపు నెలసరి ఆగుతోంది. ఇలా మెనోపాజ్ త్వరగా వచ్చినా.. ఈస్ట్రోజెన్ థెరపీతో రిస్క్‌ని తగ్గించవచ్చు. జన్యుపరంగానైనా.. కాకపోయినా మీకు మెనోపాజ్ త్వరగా వచ్చి ఉండొచ్చు. సాధారణంగా 51 ఏళ్లకు మెనోపాజ్ వస్తుంది. మీరు ఎర్లీ మెనోపాజ్‌లో ఉన్నారు కాబట్టి.. మీకు ఈస్ట్రోజెన్ థెరపీతో గుండె, ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గించవచ్చు.
మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే.. మీకు ఎలాంటి మందులు ఇవ్వాలి.. వాటితో భవిష్యత్‌లో ఇతర రిస్క్స్ అంటే క్యాన్సర్ లాంటిదేమైన పొంచి ఉండే ప్రమాదం ఉందా అని పరిశీలిస్తారు. కాల్షియం, విటమిన్ డి మాత్రలు కూడా తీసుకోవాలి. వెజైనా పొడిబారుతుంటే లూబ్రికెంట్ జెల్ లేదా ఈస్ట్రోజెన్ క్రీమ్‌ని సూచిస్తారు. హెచ్‌ఆర్‌టీ.. హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది ఎంత వరకు పనిచేస్తుందో చూస్తారు. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే నాన్ హార్మోనల్ ట్రీట్‌మెంట్‌ను కూడా సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment