అర్లీ మెనోపాజ్‌ ప్రమాదమా..? | Premature And Early Menopause Causes And Symptoms | Sakshi
Sakshi News home page

అర్లీ మెనోపాజ్‌ ప్రమాదమా..?

Published Sun, Aug 18 2024 1:02 PM | Last Updated on Sun, Aug 18 2024 1:02 PM

Premature And Early Menopause Causes And Symptoms

బాలికకు యుక్తవయసు నాటి నుంచి ప్రతి నెలా వస్తుండే రుతుక్రమం ఒక వయసులో ఆగి΄ోతుంది. అలా ఆగిపోవడాన్ని ‘మెనో΄పాజ్‌’ అంటారు. మామూలుగా వచ్చే నెలసరి కనీసం ఏడాది పాటు ఏ నెలలోనూ కనిపించకుండా పూర్తిగా ఆగిపోతే అప్పుడే దాన్ని ‘మెనో΄పాజ్‌’గా చెప్పవచ్చు. సాధారణంగా ఇది  మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్య జరుగుతుంది. అంటే సగటున 51వ ఏట ఇది సంభవిస్తుంది. కానీ కొందరిలో మామూలుగా 
ఆగిపోయే సమయం కంటే చాలా ముందుగానే ఆగితే దాన్ని ‘అర్లీ మెనో΄పాజ్‌’గా చెబుతారు. ఇలా జరిగినప్పుడు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. 

కొందరు మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్య రుతుక్రమం ఆగిపోవడానికి బదులు 40 ఏళ్ల లోపు కూడా రుతుక్రమం ఆగి΄ోవచ్చు. ఇలా జరగడాన్ని అర్లీ మెనోపాజ్‌ లేదా ప్రి–మెచ్యుర్‌ ఒవేరియన్‌ ఇన్‌సఫిషియెన్సీ అని కూడా అంటారు. దీనికి నిర్దిష్టంగా కారణం ఏమిటో స్పష్టంగా తెలియదు. అయితే... 

కొందరిలో శస్త్రచికిత్స చేసి  అండాశయాలు (ఓవరీలు) తొలగించాల్సి రావడం. 
కొన్ని కుటుంబాల్లో జన్యుపరంగా త్వరగా రుతుస్రావం ఆగిపోతుండవచ్చు 
కొందరిలో క్రోమోజోముల సమస్య కారణంగా... అంటే టర్నర్‌ సిండ్రోమ్‌ వంటివాటితో మానసిక ఒత్తిడి, 
మంచి ఆహారం తీసుకోకపోవడం, ఏదైనా దెబ్బతగలడం 
కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వాల్సి రావడం (ముఖ్యంగా నడుము దగ్గర) 
అండాశయాలను తొలగించడం 
పళ్లు, కూరగాయలపై ఉండే రసాయనాలు 
పొగ, మద్యం అలవాట్లు (విదేశాల్లో ఎక్కువ) 
థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోవడం 
ప్రోలాక్టిన్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా స్రవించడం 
కుటుంబ నియంత్రణ కోసం వాడే మందులు డాక్టర్‌ సలహా లేకుండా విచక్షణరహితంగా వాడటం 
పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) 
స్థూలకాయం.

త్వరగా రుతుక్రమం ఆగడం ప్రమాదమా? 

  • మెనోపాజ్‌ రాబోతున్న సూచనగా కొందరు మహిళల ఒంట్లో నుంచి వేడి సెగలు వస్తున్నట్లు అనిపించడం (హాట్‌ ఫ్లషెస్‌), భావోద్వేగాలు వెంటవెంటనే మారడం  (మూడ్‌ స్వింగ్స్‌) వంటి లక్షణాలు కనిపిస్తాయి 

  • కొందరిలో ఎముకలు పెళుసుబారి  తేలిగ్గా విరిగిపోయేలా చేసే ‘ఆస్టియోరోసిస్‌’ ముప్పు 
    నెలసరి ఆగి΄ోవడంతోనే ఈస్ట్రోజెన్‌ తగ్గడం వల్ల కొందరిలో గుండెపోటు, గుండెజబ్బుల ముప్పు ∙మూత్ర సంబంధమైన వ్యాధులు (యూరిన్‌ ఇన్ఫెక్షన్స్‌) ∙బరువు పెరగడం ∙కొందరిలో డిప్రెషన్, అయోమయం, త్వరగా కోపగించుకోవడం, అలసట వంటి మానసికమైన సమస్యలూ కనిపిస్తాయి.

అర్లీ మెనోపాజ్‌కు తర్వాతి పరిణామాలకు చికిత్స? 

ఒకసారి మెనో΄పాజ్‌ ఆగి΄పోయాక దాన్ని పునరుద్ధరించడానికి ఏ చికిత్సతోనూ అవకాశముండదు. కాక΄ోతే మెనో΄ాజ్‌ తర్వాతి పరిణామంతో మహిళల్లో కొన్ని ఇబ్బందులు కనిపించవచ్చు. వీటికే చికిత్స అవసరం 

ఒంట్లోంచి వేడి సెగలు (హాట్‌ఫ్లషెస్‌) వస్తుండటం వల్ల బాధపడేవారికి హార్మోన్లను భర్తీ చేసేందుకు వచ్చే హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) ఇవ్వాల్సి రావచ్చు. ఈ మందుల వల్ల ఒంట్లోంచి సెగలు రావడం ఆగడంతో పాటు ఎముకలూ బలంగా మారతాయి.

అర్లీ మెనోపాజ్‌ లక్షణాలు కనిపిస్తుండగా మొదలయ్యే ఈ చికిత్సను స్వాభావికంగా మెనోపాజ్‌ వచ్చే వయసు వరకు కొనసాగించాలి. హెచ్‌ఆర్‌టీలో ఇచ్చేవి ప్రత్యేకమైన మందులేమీ కావు. శరీరంలోనే స్రవించాల్సిన హార్మోన్లు కొన్ని కారణాల వల్ల స్రవించక΄ోవడంతో వాటిని డాక్టర్లు మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. కాబట్టి వీటితో ముప్పు ఏదీ ఉండదు.

ప్రిమెచ్యుర్‌ మెనోపాజ్‌తో వచ్చే సమస్యలు, వాటి నివారణ కోసం... 

  • ఆకుకూరలు, పళ్లు సరిగ్గా కడిగి తీసుకోవాలి 

  • క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారం 

  • ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. అంటే... ΄పొట్టుతో ఉండే గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, వేళకు నిద్ర΄ోవడం, శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం.

డాక్టర్‌ క్రాంతి శిల్ప, కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌, అబ్‌స్ట్రెట్రీషియన్‌ 

(చదవండి: ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి)

 

 



ప్రిమెచ్యుర్‌ మెనో΄ాజ్‌తో వచ్చే 
సమస్యలు, వాటి నివారణ కోసం... 
∙ఆకుకూరలు, పళ్లు సరిగ్గా కడిగి తీసుకోవాలి 
∙క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారం 
∙ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. అంటే... ΄÷ట్టుతో ఉండే గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, వేళకు నిద్ర΄ోవడం, శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement