boss attack
-
మెనోపాజ్‌పై బాస్ ఛీప్ కామెంట్లు..!
లండన్: మెనోపాజ్‌ను సాకుగా చూపుతూ సరిగా పని చేయడం లేదని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బాస్ మీద కేసు పెట్టి రూ.37 లక్షల పరిహారం పొందిందో మహిళ. ఈ ఉదంతం స్కాట్లాండ్లో జరిగింది. కరెన్ ఫర్కార్సన్ అనే 49 ఏళ్ల మహిళ ఒక స్థానిక ఇంజనీరింగ్ సంస్థలో 1995 నుంచీ పని చేస్తోంది. మెనోపాజ్ దశ కారణంగా ఆందోళన, మెదడు ఉన్నట్టుండి మొద్దుబారడం వంటివాటి లక్షణాలతో బాధ పడుతున్నట్టు బాస్‌కు చెప్పింది. విపరీతంగా బహిష్టు స్రావం అవుతుండటం, బయట విపరీతంగా మంచు కురుస్తుండటంతో రెండు రోజులు ఇంటి నుంచి పని చేసింది. మర్నాడు ఆఫీస్‌కు వెళ్లగానే, ’పర్లేదే, వచ్చావు’ అంటూ బాస్ వ్యంగ్యంగా అన్నాడు. తన సమస్య గురించి మరోసారి వివరించినా, ’నొప్పులు, బాధలు అందరికీ ఉండేవే’అంటూ కొట్టిపారేశాడు. దాంతో ఆమె రాజీనామా చేసి కంపెనీపై కేసు పెట్టింది. తన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదన్న బాస్ వాదనను ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. అతనిలో ఏ మాత్రమూ పశ్చాత్తాపం కనిపించడం లేదంటూ ఆక్షేపించి పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. -
బాస్‌ను పిచ్చి కొట్టుడు కొట్టి.. మట్టిపోసి
ఫ్లోరిడా: తనను గెట్ అవుట్ అన్నందుకు ఓ బాస్‌ను ఓ ఉద్యోగి దారుణంగా దాడి చేశాడు. రోలర్ తో గుద్దించడమే కాకుండా ఓ ఆరడుగుల అల్యూమినియం రాడ్డు లాంటిదాన్ని తీసుకొచ్చి తలపై కొట్టి స్పృహలేకుండా పడిపోయిన అతడిపై నిల్చుని వెకిలి నవ్వు పెద్దగా నవ్వాడు. అనంతరం అతడి సగం శరీరాన్ని మట్టితో కప్పేశాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి పోలీసులుకు చెప్పడంతో వారు వచ్చి అతడ్ని అరెస్టు చేసి బాస్‌ను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలో ఓ నిర్మాణం వద్ద ఎరిక్ కాక్స్ అనే వ్యక్తి రోలర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ సైట్లో మట్టి తీసే పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో తన సూపర్ వైజర్ వచ్చి ప్రశ్నించడంతోపాటు చేయి కూడా చేసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు ఈ చర్యకు దిగాడు. కాని కాక్స్ చెప్పిన ప్రకారం తన పని తాను చేసుకుంటే అక్కడికి వచ్చిన సూపర్ వైజర్ అనరాని మాటలు అనడమే కాకుండా గెట్ అవుట్ అన్నాడని, అనంతరం చేయి చేసుకొని తల నరికేస్తానని బెదిరించాడని, ఆ సమయంలో తాను రోలర్ నడుపుతుండగా అలా గొడవ పడుతూనే ప్రమాదవశాత్తు దాని కింద పడ్డాడని చెప్పాడు. తాను దాడి చేశానన్న మాటలు అబద్ధాలు అని కొట్టి పారేశాడు. అరెస్టయి జైలుకు వెళ్లిన అతడు ఐదువేల డాలర్ల బాండ్ తో బయటకు రాగా.. బాస్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నాడు.