బాస్ను పిచ్చి కొట్టుడు కొట్టి.. మట్టిపోసి | Florida Man Buried His Boss In Dirt Using A Front-End Loader, Police Say | Sakshi
Sakshi News home page

బాస్ను పిచ్చి కొట్టుడు కొట్టి.. మట్టిపోసి

Published Sun, Jun 5 2016 10:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

బాస్ను పిచ్చి కొట్టుడు కొట్టి.. మట్టిపోసి

బాస్ను పిచ్చి కొట్టుడు కొట్టి.. మట్టిపోసి

ఫ్లోరిడా: తనను గెట్ అవుట్ అన్నందుకు ఓ బాస్ను ఓ ఉద్యోగి దారుణంగా దాడి చేశాడు. రోలర్ తో గుద్దించడమే కాకుండా ఓ ఆరడుగుల అల్యూమినియం రాడ్డు లాంటిదాన్ని తీసుకొచ్చి తలపై కొట్టి స్పృహలేకుండా పడిపోయిన అతడిపై నిల్చుని వెకిలి నవ్వు పెద్దగా నవ్వాడు. అనంతరం అతడి సగం శరీరాన్ని మట్టితో కప్పేశాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి పోలీసులుకు చెప్పడంతో వారు వచ్చి అతడ్ని అరెస్టు చేసి బాస్ను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలో ఓ నిర్మాణం వద్ద ఎరిక్ కాక్స్ అనే వ్యక్తి రోలర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ సైట్లో మట్టి తీసే పనుల్లో నిమగ్నమై ఉన్నాడు.

ఆ సమయంలో తన సూపర్ వైజర్ వచ్చి ప్రశ్నించడంతోపాటు చేయి కూడా చేసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు ఈ చర్యకు దిగాడు. కాని కాక్స్ చెప్పిన ప్రకారం తన పని తాను చేసుకుంటే అక్కడికి వచ్చిన సూపర్ వైజర్ అనరాని మాటలు అనడమే కాకుండా గెట్ అవుట్ అన్నాడని, అనంతరం చేయి చేసుకొని తల నరికేస్తానని బెదిరించాడని, ఆ సమయంలో తాను రోలర్ నడుపుతుండగా అలా గొడవ పడుతూనే ప్రమాదవశాత్తు దాని కింద పడ్డాడని చెప్పాడు. తాను దాడి చేశానన్న మాటలు అబద్ధాలు అని కొట్టి పారేశాడు. అరెస్టయి జైలుకు వెళ్లిన అతడు ఐదువేల డాలర్ల బాండ్ తో బయటకు రాగా.. బాస్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement