సమాజ సామరస్యానికి భంగం కలిగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయన్నారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరానిదన్నారు.