లండన్: బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ.. తన సొంతపార్టీ ఎంపీ, మాజీ డిప్యూటీ చైర్మన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. లండన్ మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ లీ అండర్సన్‌ను ప్రధానమంత్రి రిషి సునాక్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం కన్జర్వేటివ్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ఇస్లామిస్టుల ప్రభావం ఉందని, వారి నియంత్రణలో ఆయన ఉన్నారని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఎంపీ లీ అండర్సన్ అన్నారు. దీంతో అయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాన మంత్రి రిషి సునాక్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు జాత్యహంకార పూరితమైనవి అని వెంటనే క్షమాపణలు చేప్పాలని పెద్దఎత్తన డిమాండ్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి లీ అండర్సన్ నిరాకరించారు.
‘లండన్ మేయర్‌పై లీ ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపన చెప్పడానికి నిరాకరించారు. దీంతో పార్టీ చీఫ్ విప్.. ఆయన్ను ఎంపీ పదవిపై సప్పెన్షన్ విధించారు’ అని అధికార ప్రతినిధి టోరీ శాసనసభ్యుడు సైమన్ హార్ట్ తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్ దేశం.. గాజాపై దాడులు చేయటం ప్రారంభించినప్పటి నుంచి బ్రిటన్‌లో ఇస్లాంపై ద్వేషం, యూదులపై వ్యతిరేకమైన సంఘటనలు చోటు చేసుకోవటం పెరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment