బహుభార్యత్వాన్ని నిషేధించాలని ప్లాన్ చేస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం ప్రకటించారు. ఆ అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందో లేదో అనే విషయాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ భారత రాజ్యగంలోని ఆర్టికల్ 25 ముస్లిం పర్సనల్ లా చట్టానికి సంబంధించిన 1937 లోని నిబంధనను పరిశీలిస్తోందన్నారు.
ఈ మేరకు బిస్వా శర్మ తన ప్రభుత్వ రెండో వార్షికోత్సవం పురస్కరించుకుని.. ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేగాదు ఈ కమిటీ అన్ని న్యాయ నిపుణులతో విస్తృతమైన చర్చలు జరిపి మంచి ఇన్ఫర్మేషన్‌తో కూడిన ఒక నిర్ణయానికి వస్తుందని చెప్పారు. జాతీయ ఏకాభిప్రాయానికి సంబంధించిన యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) వైపు తాము వెళ్లమని, దానిపై కేంద్రమే చొరవ తీసుకుంటుందని బిస్వా శర్మ చెప్పారు.
యూసీసీలో ఒక భాగంగా అస్సాం రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించాలన్న తమ ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నట్లు బిస్వాశర్మ పేర్కొన్నారు. ఈ సమస్యపై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసకుంటామని, బలవంతంగా లేదా దూకుడుగా వ్యవహరించమని చెప్పారు. కాగా, అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాల అణిచివేత సమయంలో చాలామంది వృద్ధులు అనేకసార్లు వివాహాం చేసుకున్నారని, వారి భార్యల్లో చాలామంది పేద వర్గానికి చెందని యువతులని ముఖ్యమంత్రి చెప్పారు. బహు భార్యత్వం నిషేధం తోపాటు బాల్య వివాహాలకు పాల్పడేవారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం బిస్వా శర్మ అన్నారు.
(చదవండి: ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ ఆకస్మిక పర్యటన! నోటీసులు పంపుతామని వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment