expert panel
-
నేడు తెలంగాణకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది. బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటి పారుదల శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలతో సమావేశం కానుంది. ఈ నెల 7, 8వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి తనిఖీలు నిర్వహించనుంది. మళ్లీ 9న హైదరాబాద్‌లో అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదేరోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది. మరోవైపు బ్యారేజీల డిజైన్లు మొదలు నిర్మాణం వరకు ఇందులో పాలుపంచుకున్న అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కమిటీ కోరింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన 19 రకాల సమాచారం అందించాలని లేఖ రాసింది. ఇదీ చదవండి: వీడ్కోలు సమయాన విన్నపాలు -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు: అదానీకి భారీ ఊరట
సాక్షి, ముంబై: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూపు వివాదంలో గౌతం అదానీ భారీ ఊరట లభించింది. అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు నియమించిన ఆరుగురు సభ్యులు పానెల్ కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్ ఇప్పటికే ఉన్న సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించినట్లు గుర్తించలేదని తెలిపింది. ప్రస్తుత దశలో అదానీ గ్రూప్ షేర్ల ధరలను తారుమారు ఆరోపణలపై నియంత్రణ వైఫల్యం జరిగినట్లు నిర్ధారించటం సాధ్యం కాదని చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేవు అదానీ గ్రూప్ ప్రస్తుత మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సుప్రీం ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది. తద్వారా స్టాక్ మానిప్లులేషన్స్‌తో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందంటూ చేసిన హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసింది. అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులకు సంబంధించి 2018 నిబంధనలు మారినప్పటికీ వాటినే అనుసరిస్తోందని కమిటీ వ్యాఖ్యానించింది. సెబీకి మూడు నెలల గడువు మరోవైపు సెబీకూడా ఈ వ్యవహారంలో దర్యాప్తునకు మరింత సమయం కావాలని కోరింది. హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తును పూర్తి చేయడానికి సెబీకి సుప్రీంకోర్టు మూడు నెలల పొడిగింపును మంజూరు చేసింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ స్టాక్ ధరల తారుమారు ఆరోపణలపై దర్యాప్తుపై అప్డేట్ చేసిన స్టేటస్ రిపోర్ట్‌ను ఆగస్టు 14లోగా సమర్పించాలని సుప్రీం సెబీకి సూచించింది. దీంతో శుక్రవార నాటి మార్కెట్లో అదానీగ్రూపు షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. కాగా హిండెన్‌బర్గ్ ఆరోపణలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఇది సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ గ్రూప్ ఏదైనా ఉల్లంఘనకు పాల్పడిందా అనే దానిపై దర్యాప్తు చేసే బాధ్యతను జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ మే 8న తన నివేదికను సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు సమర్పించింది. -
Assam: బహుభార్యత్వంపై సీఎం కీలక ప్రకటన!
బహుభార్యత్వాన్ని నిషేధించాలని ప్లాన్ చేస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం ప్రకటించారు. ఆ అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందో లేదో అనే విషయాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ భారత రాజ్యగంలోని ఆర్టికల్ 25 ముస్లిం పర్సనల్ లా చట్టానికి సంబంధించిన 1937 లోని నిబంధనను పరిశీలిస్తోందన్నారు. ఈ మేరకు బిస్వా శర్మ తన ప్రభుత్వ రెండో వార్షికోత్సవం పురస్కరించుకుని.. ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేగాదు ఈ కమిటీ అన్ని న్యాయ నిపుణులతో విస్తృతమైన చర్చలు జరిపి మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన ఒక నిర్ణయానికి వస్తుందని చెప్పారు. జాతీయ ఏకాభిప్రాయానికి సంబంధించిన యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) వైపు తాము వెళ్లమని, దానిపై కేంద్రమే చొరవ తీసుకుంటుందని బిస్వా శర్మ చెప్పారు. యూసీసీలో ఒక భాగంగా అస్సాం రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించాలన్న తమ ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నట్లు బిస్వాశర్మ పేర్కొన్నారు. ఈ సమస్యపై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసకుంటామని, బలవంతంగా లేదా దూకుడుగా వ్యవహరించమని చెప్పారు. కాగా, అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాల అణిచివేత సమయంలో చాలామంది వృద్ధులు అనేకసార్లు వివాహాం చేసుకున్నారని, వారి భార్యల్లో చాలామంది పేద వర్గానికి చెందని యువతులని ముఖ్యమంత్రి చెప్పారు. బహు భార్యత్వం నిషేధం తోపాటు బాల్య వివాహాలకు పాల్పడేవారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం బిస్వా శర్మ అన్నారు. (చదవండి: ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ ఆకస్మిక పర్యటన! నోటీసులు పంపుతామని వార్నింగ్) -
పిల్లలకి వ్యాక్సిన్ ఇది సమయమేనా ?
రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వెయ్యొచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేయడంతో తల్లిదండ్రుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు ఇచి్చన వ్యాక్సినే పిల్లలకీ ఇస్తారా ? సైడ్ ఎఫెక్ట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి పిల్లలకి కోవిడ్ వ్యాక్సిన్‌పై చర్చ తెరపైకి వచ్చింది. పిల్లలకి ప్రత్యేకంగా వ్యాక్సిన్ తయారు చేస్తారా? పిల్లలకి ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమీ ఉండదు. అయితే డోసుని తగ్గించి ఇస్తారు. పెద్దలకు ఇచ్చే వ్యాక్సిన్ డోసులో సగం మాత్రమే పిల్లలకి ఇస్తారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ పెద్దలకి ఒక్క మిల్లీ లీటర్ డోసు రెండు విడతలుగా 28 రోజుల వ్యవధిలో ఇస్తున్నారు. పిల్లలకి అందులో సగం అంటే 0.5 ఎంల్ డోసుని రెండు విడతలుగా ఇస్తారు. ఒక్కో డోసు 0.25 ఎంఎల్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా? చిన్నపిల్లలకి ఏ వ్యాక్సిన్ ఇచ్చినా కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పి మాత్రమే ఉంటాయి. ఏయే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి? మన దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన వారికి జైడస్ క్యాడిల్లా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చారు. డీఎన్ఏ ఆధారిత ఈ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. పిల్లలకు అనుమతులు మంజూరైన తొలి వ్యాక్సిన్ ఇదే. అమెరికాకు చెందిన నొవావాక్స్ (భారత్‌లో దీనిని కొవావాక్స్ అని పిలుస్తున్నారు) వ్యాక్సిన్‌ను 2–17 ఏళ్ల వయసు వారికి ఇవ్వడానికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. పుణెకి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ రెండు, మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఇక హైదరాబాద్‌కు చెందిన బయోలాజిక్ ఈ లిమిటెడ్ కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్ 5 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం ప్రయోగాలు నిర్వహించడానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. ఇది సరైన సమయమేనా? కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించకపోవడం, దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టిన ఈ సమయంలో వారికి వ్యాక్సిన్ వెయ్యడానికి ఇది సరైన సమయమేనా అన్న సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే వైద్య నిపుణులు మాత్రం పిల్లలకి కూడా వ్యాక్సిన్ వెయ్యాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దేశ జనాభాలో పిల్లలు 25–30% వరకు ఉంటారు. వీరికి వ్యాక్సిన్ వెయ్యకపోతే, వ్యక్తిగతంగా వారికి నష్టం జరగకపోయినా వారు సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉంది. అంతే కాదు ఇప్పుడిప్పుడే పలు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభించారు. దసరా తర్వాత కొన్ని రాష్ట్రాలు స్కూళ్లని తెరవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పుడు స్కూలుకు వెళ్లే పిల్లలకి వ్యాక్సిన్ వెయ్యకపోతే రెండో వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్ మూడో వేవ్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇతర దేశాల్లో పిల్లలకి వ్యాక్సిన్ ఎలా? అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాల్లో 12 ఏళ్ల వయసు పైబడిన వారికి ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఇస్తున్నారు. ఇక రెండేళ్ల పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తున్న మొట్టమొదటి దేశం క్యూబా. సెపె్టంబర్ 13 నుంచి ఆ దేశం చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టింది. చైనా, యూఏఈ, వెనెజులా దేశాలు రెండేళ్ల వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి సన్నాహాలు ప్రారంభించాయి. నిపుణుల అభిప్రాయాలు మొదటి వేవ్‌లో మొత్తం కేసుల్లో 4% పిల్లలకే సోకింది. రెండో వేవ్ వచ్చేసరికి 10–15% పిల్లల్లో కేసులు పెరిగాయి. పాఠశాలలు కూడా పునఃప్రారంభం కావస్తూ ఉండడంతో పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇదే సమయం. చిన్నారులకి వ్యాక్సిన్ దేశంలో ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుంది – డాక్టర్ సుజీర్ రంజన్, అసోసియేట్ డైరెక్టర్, టాటా ట్రస్ట్స్ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కి డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించలేదు. చాలా దేశాలు కోవాగ్జిన్‌ను గుర్తించడం లేదు. దీనికి కారణం పూర్తి స్థాయి డేటా లేకపోవడమే. అందుకే మరింత డేటా వచ్చేవరకు వేచి చూసి పిల్లలకు వేస్తే మంచిది. – డాక్టర్ శ్రీకాంత్, పీడియాట్రిషన్, బెంగళూరు – నేషనల్ డెస్క్, సాక్షి -
గుడ్‌న్యూస్: అందుబాటులోకి మరో కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మూడో దశ రానుందన్న అందోళనల నేపథ్యంలో అయిదో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జైడస్ కాడిల్లాకు చెందిన జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వ డ్రగ్ ప్యానెల్ అనుతిమినిచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ఓ) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఇసి) జైడస్ మూడు డోసుల వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. తుది ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసింది. దీనికి డీజీసీఐ కూడా అనుతినివ్వడంతో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండవ దేశీ వ్యాక్సిన్‌గా జైకోవ్-డీ నిలవనుంది. అంతేకాదు దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చిన తొలి టీకా కూడా ఇదే. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా జైకోవ్-డి పేరుతో ఈ వ్యాక్సిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా. (మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్, 45 రోజుల తర్వాత మూడో డోస్) వ్యాక్సిన్. సూది లేకుండా ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్రే టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కేనని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 12 ఏళ్ల వారికి కూడా వినియోగించేలా భారీగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ఏజ్ గ్రూపు వారికి ట్రయల్స్ చేసిన ఏకైక వ్యాక్సిన్ జైకోవ్-డి కావడం విశేషం. కాగా కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్-వీ, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్-డోస్ వ్యాక్సిన్ వంటి ఐదు టీకాలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. కోవాక్సిన్ తరువాత జైకోవి-డీ దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో వ్యాక్సిన్. జైడస్ కాడిల్లా ఏటా 120 మిలియన్ డోస్‌లను తయారు చేయాలని యోచిస్తోంది. -
‘ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు.. డిసెంబర్లో థర్డ్ వేవ్’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ)కి చెందిన కోవిడ్–19 వర్కింగ్ గ్రూపు చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా చెప్పారు. భారత ఔషధ పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో ఊహించిన దాని కంటే కాస్త ఆలస్యంగానే థర్డ్ వేవ్ వస్తుందని తేలిందని వెల్లడించారు. బహుశా ఈ ఏడాది డిసెంబర్లో థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఆదివారం వివిధ వార్తా సంస్థలతో ఆయన మాట్లాడారు. కోవిడ్–19లో కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ వేరియెంట్‌తో కరోనా థర్డ్ వేవ్ చెలరేగిపోవచ్చనే ఆందోళనలకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఈ రెండింటిని లింక్ చేసి చూడలేమని చెప్పారు. అలాగని ఇది పూర్తిగా కొట్టి పారేసే అంశం కూడా కాదని అరోరా స్పష్టం చేశారు. ఎందుకంటే కరోనా వైరస్‌లో జన్యుపరమైన మార్పు లు జరిగినప్పుడల్లా కొత్త వేవ్‌లు ముంచుకొస్తుండడం చూస్తున్నామని అన్నారు. రోజుకి కోటి డోసులు లక్ష్యం కరోనా మూడో వేవ్ కాస్త ఆలస్యంగా వస్తే ప్రజలందరికీ వ్యాక్సిన్ వెయ్యడానికి కేంద్రానికి మరింత సమయం దొరుకుతుందని అన్నారు. వచ్చే 6 నుంచి 8 నెలల్లో రోజుకి కోటి డోసులు ఇవ్వడమే తమ లక్ష్యమని అరోరా చెప్పారు. 12–18 ఏళ్ల మధ్య వయసు వారికి టీకా ఇవ్వడానికి జైడస్ క్యాడిలా కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు దాదాపుగా పూర్తయ్యాయని, త్వరలోనే దీనిని అందుబాటులోకి తెస్తామన్నారు. మూడో వేవ్‌లో ఎక్కువ మందికి వైరస్ సోకినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా ఉండదని అరోరా చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు పాటించడంపై అవగాహన పెరగడం వంటి వాటి వల్ల మొదటి రెండు వేవ్‌లంత తీవ్రంగా థర్డ్ వేవ్ ఉండదని అరోరా అభిప్రాయపడ్డారు. ఊపిరితిత్తులపైనే డెల్టా ప్లస్ ప్రభావం కోవిడ్–19లో మిగిలిన వేరియెంట్లతో పోల్చి చూస్తే డెల్టా ప్లస్ ఊపిరితిత్తుల్లోని కణజాలంపైనే అధిక ప్రభావం చూపిస్తుందని అరోరా తెలిపారు. అలాగని ఇది అధికంగా వ్యాప్తి చెందుతుందని, కరోనా ఎక్కువగా శరీరంపై దాడి చేస్తుందని చెప్పలేమన్నారు. ‘‘డెల్టా ప్లస్ వేరియెంట్ ఊపిరితిత్తుల కణజాలంపైనే ప్రభావాన్ని చూపిస్తోంది. అలాగని ఈ వేరియెంట్ లంగ్స్‌ని డ్యామేజ్ చేస్తుందని చెప్పలేం. ఈ వేరియెంట్ ఎక్కువగా వ్యాపిస్తుందని కూడా నిర్ధారణ కాలేదు’’అని అరోరా వివరించారు. -
పక్షపాతమన్న ప్రశ్నే లేదు : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : మూడు వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదంలో విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బొబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కమిటీ ఏర్పాటులో రైతుసంఘాల ఆరోపణలను తోసిచ్చింది. ఈ కమిటీ ఏర్పాటులో పక్షపాతానికి తావులేదని స్పష్టం చేసింది. అలాగే సుప్రీం నియమించిన నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరు తప్పుకున్నందున పునర్నిర్మాణం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాదు గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలకువ్యతిరేకంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. జనవరి 26న చేపట్టబోయే ట్రాక్టర్ ర్యాలీ, ఇతర నిరసనలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులే అని సృష్టం చేసింది. అఫిడవిట్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించడంతో దీన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. వ్యవసాయ చట్టాల వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పక్షపాతంగా ఉందని రైతుల సంఘాలు ఆరోపించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొబ్డే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం కోసమే కమిటీ ఏర్పాటు చేశామని, దీనికి ఎలాంటి న్యాయాధికారమూ లేదని స్పష్టం చేశారు. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే కమిటీలో నిపుణులను నియమించినట్లు వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులపై ముద్రలు వేయడం సరికాదు. గతంలో అభిపప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన వారిని నిందించడం తగదని సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి అది ఫలితాన్ని ప్రభావితం చేయదని రైతు నేతలకు సూచించారు. ఉత్తమ న్యాయమూర్తులకు కూడా ఒకవైపు నిర్దిష్ట అభిప్రాయాలున్నా... మరొకవైపు తీర్పులు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా సుప్రీం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీపై ఉద్యమకారులు, రైతు సంఘాలతో కాంగ్రెస్, అకాలీదళ్ సహా ఇతర ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కమిటీలోని నలుగురు సభ్యులు గతంలో వివాదాస్పద చట్టాలకు అనుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి, కిసాన్ మహాపాంచాయత్ రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం విచారించింది. -
డీటీసీతో ‘పన్ను’ ఊరట!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ) సమీక్ష కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ప్యానెల్.. పన్నుల భారం తగ్గించే దిశగా కీలక సిఫారసులు చేసింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, డివిడెండ్ పంపిణీపై పన్ను (డీడీటీ)ను ఎత్తివేయాలని ప్యానెల్ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవి. అదే సమయంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను, సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్టీటీ) మాత్రం కొనసాగించాలని సూచించింది. గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించిన నివేదికలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్యానెల్ తన సిఫారసులను పేర్కొంది. ఆదాయపు పన్ను మూడు రకాలే... వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలన్నది డీటీసీ టాస్క్ ఫోర్స్ సిఫారసుల్లో అత్యంత కీలకమైన సంస్కరణ. ప్రస్తుతం 5, 20, 30 శాతం పన్ను శ్లాబులు ఉండగా, వీటిని క్రమబద్ధీకరించి, 5 శాతం, 10 శాతం, 20 శాతం రేట్లను తీసుకురావాలని సూచించింది. అంటే పై స్థాయిలో 30 శాతం, 20 శాతం పన్ను రేట్లను కలిపేసి.. 20 శాతం పన్నునే తీసుకురావాలని పేర్కొనడం పన్ను భారాన్ని భారీగా తగ్గించే కీలక సిఫారసు. మరో ప్రతిపాదన ప్రకారం... రూ.5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 10 శాతం, రూ.10–20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.30 లక్షలు మించి రూ.2 కోట్ల వరకు ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలన్నదీ ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. రూ.2.5–5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ ఉంది. అంటే రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.10 లక్షలు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. రూ.2.5–5 లక్షల ఆదాయంపై ఎలానూ పన్ను రిబేటు ఉంది కనుక ఇకపై రూ.5 లక్షల వరకు ఆదాయ వర్గాలను పన్ను నుంచి మినహాయించే అవకాశం ఉంది. ‘‘పన్ను శ్లాబులను సమీక్షించడం వల్ల స్వల్ప కాలం పాటు ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వ ఖజానాపై 2–3 ఏళ్ల ప్రభావం చూపిస్తుంది. కానీ పన్నుల సరళీకరణతో పన్ను చెల్లించే వారు పెరుగుతారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 58 ఏళ్ల క్రితం నాటి ఆదాయపన్ను చట్టాన్ని సమీక్షించి, వ్యక్తులు, కంపెనీలపై పన్నుల భారాన్ని తగ్గించడంతోపాటు, పన్ను నిబంధనల అమలును పెంచే దిశగా సిఫారసుల కోసం ప్రభుత్వం అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ సిఫారసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డీడీటీకి మంగళం? ‘‘డీడీటీని తొలగించాలన్న ఆలోచన వెనుక ఉద్దేశం పన్నులపై పన్ను ప్రభావాన్ని తొలగించడమే’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కంపెనీలు వాటాదారులకు పంపిణీ చేసే డివిడెండ్‌పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 12 శాతం సర్‌చార్జ్, 3 శాతం ఎడ్యుకేషన్ సెస్సు కూడా కలుపుకుంటే డివిడెండ్‌పై నికర పన్ను 20.3576 శాతం అవుతోంది. డివిడెండ్‌పై కార్పొరేట్ ట్యాక్స్, డీడీటీ, ఇన్వెస్టర్ ఇలా మూడు సార్లు పన్నుల భారం పడుతున్నట్టు మార్కెట్ పార్టిసిపెంట్లు (బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు) రెండు వారాల క్రితం ఆర్థిక మంత్రితో భేటీ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత క్యాపిటల్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం లేదని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో చెల్లించే పన్నులకు తమ దేశంలో క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే డివిడెండ్‌పై పన్నును కంపెనీలే చెల్లిస్తున్నందున వారు దానిపై క్రెడిట్ పొందడానికి అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో డీడీటీని ఎత్తివేసి, దీనికి బదులు సంప్రదాయ విధానంలోనే పన్ను వేయాలన్నది టాస్క్ ఫోర్స్ సూచన. ప్రతిపాదిత డీడీటీని రద్దు చేస్తే, ఆదాయంపై బహుళ పన్నులు తొలగిపోయి కంపెనీలపై భారం తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని రద్దు చేస్తే డివిడెండ్ అందుకున్న వాటాదారులే దాన్ని ఆదాయంగా చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా చేసే సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను ను కూడా కొనసాగించాలని పేర్కొంది. -
రవిశంకర్ గురూజీకి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ వల్ల యమునా నదీ పరీవాహక ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని నిపుణుల కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదించింది. వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించిన యమునా నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన కమిటీ అక్కడి పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ 47 పేజీల నివేదికను సమర్పించింది. పర్యావరణాన్ని విధ్వంసం చేశారనే ఆరో్పణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కమిటీని వేసింది. నదీ తీరాన జీవవైవిద్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని కమిటీ తన నివేదికలో పేర్కొంది.