రవిశంకర్ గురూజీకి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ వల్ల యమునా నదీ పరీవాహక ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని నిపుణుల కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదించింది.
వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించిన యమునా నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన కమిటీ అక్కడి పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ 47 పేజీల నివేదికను సమర్పించింది. పర్యావరణాన్ని విధ్వంసం చేశారనే ఆరో్పణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కమిటీని వేసింది. నదీ తీరాన జీవవైవిద్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని కమిటీ తన నివేదికలో పేర్కొంది.