Sri Sri Ravi shanker
-
రవిశంకర్ బయోపిక్: 100 దేశాలు.. 21 భాషలు
బాలీవుడ్లో బయోపిక్‌లకు కొదవలేదు. ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్‌లు తెరపైకి వచ్చాయి. క్రికెటర్ మిథాలీ రాజ్, చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆధ్యాత్మిక వేత్త ఓషో వంటి వారి బయోపిక్‌లు కూడా రానున్నాయి. తాజాగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీవితం వెండితెరపైకి రానుంది. గురువారం (మే 13) రవిశంకర్ బర్త్ డే సందర్భంగా ఈ బయోపిక్‌ను ప్రకటించారు ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్. ఈ చిత్రానికి ‘ఫ్రీ (స్వేచ్ఛ అని అర్థం కావొచ్చు): ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్’ అని టైటిల్ పెట్టారు. ‘‘గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీవితం ఆధారంగా తీయనున్న ఈ సినిమా ద్వారా పాజిటివ్‌నెస్‌ని పెంపొందించాలన్నదే మా ఆలోచన. ఈ చిత్రానికి మాంటో బస్సి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని 21 భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో రిలీజ్ చేస్తాం’’ అని ట్వీట్ చేశారు కరణ్ జోహార్. -
మధ్యవర్తిత్వ ప్యానెల్లో రవిశంకర్ : ఓవైసీ అభ్యంతరం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసు పరిష్కారంలో భాగంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల ప్యానెల్లో ఆథ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ పేరును చేర్చడం పట్ల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రవిశంకర్ స్ధానంలో తటస్థంగా వ్యవహరించే మధ్యవర్తిని సర్వోన్నత న్యాయస్ధానం నియమించాలని కోరారు. అయోధ్యపై ముస్లింలు తమ హక్కును వదిలివేయకుంటే భారత్ సిరియాగా మారుతుందని గతంలో రవిశంకర్ వ్యాఖ్యానించారని గుర్తు చేస్తూ తటస్థ వ్యక్తిని మధ్యవర్తిగా సుప్రీం కోర్టు నియమించాలని ఓవైసీ సూచించారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్ కలీఫుల్లా నేతృత్వంలో సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు, శ్రీశ్రీ రవిశంకర్‌లతో కూడి త్రిసభ్య మధ్యవర్తిత్వ ప్యానెల్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. కాగా, సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొదిస్తూ దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాల పరిష్కారానికి తాము సమిష్టిగా కృషి చేయాల్సి ఉందని శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు కలలు సాకారమయ్యేలా ఐక్యంగా పురోగమించాల్సి ఉందని అయోధ్య వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు మధ్యవర్తుల ప్యానెల్‌ను ప్రకటించిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. -
'శ్రీశ్రీ రవిశంకర్ మమ్మల్ని మోసంచేశారు'
శ్రీనగర్: ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు కశ్మీర్లో ఊహించని పరిస్థితి ఎదురైంది. కశ్మీర్లో ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. యువకులు ఒక్కసారిగా 'ఆజాదీ' నినాదాలు ఇచ్చారు. దీంతో రవిశంకర్ ఉలిక్కిపడ్డారు. అసలు రవిశంకర్ అంటే ఎవరో తమకు తెలియదని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తే.. తాము ఇక్కడికి వచ్చామని స్థానిక యువకులు తెలిపారు. ఇక్కడికి వచ్చాక 'మెసేజ్ ఆఫ్ లవ్' గురించి ప్రసంగాలు చేస్తున్నారని, వాటికి తాము వ్యతిరేకమని సభ మధ్యలోనే వారు వెళ్లిపొయారు. మరికొందరు యువకులు క్రికెట్ కిట్లు, డబ్బులు ఇస్తామంటే చాలా దూరం నుంచి వచ్చామని, రవిశంకర్ మమ్మల్ని మోసం చేశారని బారాముల్లా నుంచి వచ్చిన యువకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య కశ్మీర్ నుంచి వచ్చిన మరికొంతమంది ఇస్లాం మతగురువులు వస్తున్నారని చెప్పి, ఈ ఆధ్యాత్మిక గురువును తీసుకొచ్చారని నిర్వాహకులపై మండిపడ్డారు. దీనిపై స్పందించిన రవిశంకర్ కశ్మీర్ ప్రజల్లో ప్రేమ, శాంతిని నెలకొల్పాలని ఇక్కడ సభను ఏర్పాటు చేశానని తెలిపారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండి కశ్మీర్ ప్రజల్లో ప్రేమ, ఆప్యాయత, సంతోషంతో కూడిన సుహృద్భావ వాతావరణం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. -
రవిశంకర్ గురూజీకి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ వల్ల యమునా నదీ పరీవాహక ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని నిపుణుల కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదించింది. వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించిన యమునా నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన కమిటీ అక్కడి పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ 47 పేజీల నివేదికను సమర్పించింది. పర్యావరణాన్ని విధ్వంసం చేశారనే ఆరో్పణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కమిటీని వేసింది. నదీ తీరాన జీవవైవిద్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని కమిటీ తన నివేదికలో పేర్కొంది.