వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాల్లో 13 స్థానాలను భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు గెలుచుకుంటాయి. ఈ విషయాన్ని గౌహతిలోని లోక్ సేవా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి 'హిమంత బిస్వా శర్మ' ప్రకటించారు.
కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ సారి తప్పకుండా 13 సీట్లు గెలుస్తామనే నమ్మకం వచ్చిందని హిమంత బిస్వా అన్నారు. అంతే కాకుండా డిబ్రూగఢ్ (Dibrugarh)లో సర్బానంద సోనోవాల్ మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అన్నారు. అయితే ధుబ్రి (Dhubri) సీటును గెలవలేమని ప్రస్తావించారు.
అస్సాంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూసి చాలా సంతోషించాను. ఈ ఏట కాంగ్రెస్ పరాభవం తప్పదని.. మొత్తం ఈశాన్య ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలుచుకోలేకపోవచ్చని అస్సాం డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ అన్నారు.
అస్సాంలో బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ (AGP) బార్‌పేట, ధుబ్రీ స్థానాల్లో, యూపీపీఎల్ కోక్రాఝర్ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే జోర్హాట్‌లో గౌరవ్ గొగోయ్, నాగావ్‌లో ప్రద్యుత్ బోరోడోలోయ్, గౌహతిలో మీరా బర్తకూర్ గోస్వామి, ధుబ్రిలో రకీబుల్ హుస్సేన్, దీపూలో జైరామ్ ఇంగ్లెంగ్ సహా అస్సాంలోని 12 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment