ఇండియా కూటమి చెక్కు చెదరలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 'జైరామ్ రమేశ్' ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని, ఇండియా కూటమి 272కి పైగా సీట్లు సాధిస్తాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపైన అస్సాం ముఖ్యమంత్రి 'హిమంత బిస్వా శర్మ' కామెంట్ చేశారు.
బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమికి దూరంగా ఉన్నాయి. అయినా కూటమి చెక్కు చెదరలేదని చెబుతున్నారు. ఇండియా కూటమి కలిసి ఉండటం బహుశా భూమిపైన కాదు. చంద్రుడు, సూర్యుడిలో ఉందని అన్నారు. అవి మన సాధారణ దృష్టికి కనిపించవని ఎద్దేవా చేశారు.
దేశ ప్రజల విశ్వాసం, స్పష్టమైన గుర్తింపుతో పోరాడతామని హిమంత బిస్వా అన్నారు. అస్సామీ ప్రజలు తప్పకుండా విజయం చేకూర్చుతారని పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం 14 లోక్‌సభ నియోజకవర్గాలను కలిగి ఉంది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు మూడు దశల్లో.. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీలలో పోలింగ్ జరుగుతుంది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలోని 14 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 7 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) రెండూ ఒక్కొక్కటి మూడు స్థానాలను సొంతం చేసుకున్నాయి. 2019 ఎన్నికల సమయంలో, BJP తన సీట్ల సంఖ్యను 9కి పెంచుకుంది. కాంగ్రెస్ తన మూడు స్థానాలను కొనసాగించింది మరియు AIUDF ఒక్క సీటును గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment