నోట్ల కట్టలపై యుపీపీఎల్ నేత - ఫోటో వైరల్ | UPPL Member Suspended After Photo Of Sleeping With Bundles Of Notes Creates Controversy - Sakshi
Sakshi News home page

నోట్ల కట్టలపై యుపీపీఎల్ నేత - ఫోటో వైరల్

Published Thu, Mar 28 2024 7:52 AM | Last Updated on Thu, Mar 28 2024 10:06 AM

UPPL Member Suspended After Photo Viral - Sakshi

అస్సాం: ఒక వైపు ఎలక్షన్ కోడ్.. మరో వైపు ప్రచార హోరు సాగుతున్న సమయంలో అస్సాం రాష్ట్రానికి చెందిన యూపీపీఎల్‌ నేత కరెన్సీ నోట్ల కట్టల మీద పడుకున్న ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు అస్సాంలో వివాదానికి దారితీసింది.

నోట్ల కట్టల మీద పడుకున్న వ్యక్తి 'బెంజమిన్ బాసుమతరీ'. ఇతడు యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపీపీఎల్) పార్టీకి చెందిన విలేజ్ కౌన్సిల్ డెవలప్‌మెంట్ కమిటీ (VCDC) సభ్యుడని తెలుస్తోంది. క్రమశిక్షణా రహిత చర్యలకు పాల్పడటం వల్ల అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు యుపీపీఎల్ చీఫ్ ప్రమోద్ బోరో పేర్కొన్నారు.

వైరల్‌గా మారిన ఫోటో ఐదేళ్ల నాటిది. రాజకీయ కుట్రతో ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ చేశారు. ఎవరు చేశారనేది తెలియదు, తప్పకుండా తెలుసుకుంటామని బెంజమిన్ బాసుమతరీ సన్నిహితులు పేర్కొన్నారు. బెంజమిన్ పార్టీ నుంచి సస్పెండ్ కావడం మాత్రమే కాకుండా.. విలేజ్ కౌన్సిల్ డెవలప్‌మెంట్ కమిటీ (వీసీడీసీ) చైర్మన్ పదవి నుంచి కూడా కోల్పోయారు.

అసత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ చాలా దిగజారింది. కాంగ్రెస్ పార్టీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా మారాయి. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని యుపీపీఎల్ చీప్ కోరారు. అస్సాంలో కాంగ్రెస్ ఈసారి జీరో అవుతుంది. తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement