సాక్షి,డిస్పూర్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయలేదని, తనంతట తానుగానే అరెస్ట్ అయ్యారంటూ అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆరోపించారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ పంపి తొమ్మిది సమన్లకు ఆయన స్పందిచకపోవడమే కారణమని అన్నారు. కాబట్టే కేజ్రీవాల్ అరెస్ట్‌కు దారి తీసిందని తెలిపారు. ఇదంతా రాజకీయ సానుభూతిని పొందే వ్యూహంలో భాగమేనన్న అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల సన్నాహక సమావేశం తర్వాత విలేకరులతో అసోం సీఎం మాట్లాడుతూ.. ‘ఈడీ ఎవరికైనా తొమ్మిది సమన్లు అందజేసి, సదరు వ్యక్తి హాజరుకాకపోతే, అతను తన అరెస్టును ఆహ్వానించినట్లే కదా. ఢిల్లీ సీఎం విషయంలోనూ ఇదే జరిగింది. ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయలేదు. తనని అదుపులోకి తీసుకోమని ఈడీనే ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సమన్లకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వంటి నేతలే ఈడీ ముందు హాజరయ్యారని ఉదహరించారు. కానీ కేజ్రీవాల్ తీరు అందుకు భిన్నంగా ఉందని అన్నారు. అంతేకాదు, ఈడీ నుండి వచ్చిన తొమ్మిది సమన్లకు స్పందించకుండా ఉంటే అది అరెస్టుకు ఉద్దేశపూర్వక ఆహ్వానించినట్లే అవుతుందని హిమంత బిస్వా శర్మ నొక్కిచెప్పారు. ఒకవేళ కేజ్రీవాల్ సమన్లతో ఈడీ ఎదుట హాజరై ఉంటే, అతని అరెస్ట్ తప్పించుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
సమన్లపై స్పందించకపోవడానికి ప్రజల నుండి సానుభూతిని పొందేలా కేజ్రీవాల్ వ్యూహమన్న హిమంత బిస్వా.. రాజకీయంగా లబ్ధి చేకూరే ప్రయత్నమేనని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
#WATCH | On the arrest of Delhi CM Arvind Kejriwal, Assam CM Himanta Biswa Sarma says, "When someone is summoned 8 to 9 times & the person does not respect the summon, it only means that the person is inviting his arrest. If he had gone (to ED) the first time he was summoned, he… pic.twitter.com/FdcHksvonr
— ANI (@ANI) March 23, 2024
Comments
Please login to add a commentAdd a comment