
దిస్పూర్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సీఎం పర్యటనలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అస్సాంలో సీఎం, మంత్రులు ఆధ్వర్యంలో గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. బిశ్వ శర్మ తన కాన్వాయ్ ఉండే వాహనాల శ్రేణిని ఆరుకు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు సీఎం కాన్వాయ్‌లో 22 వాహనాలు ఉండేవి.
రోడ్డుపై సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలకు, పలు అంబులెన్స్ వాహనాలకు ఇబ్బందులు తలెత్తినట్లు సీఎం దృష్టికి వచ్చింది. దీంతో గౌహతిలో ప్రయాణిస్తున్నప్పుడు వాహనాలు శ్రేణిని ఆరుకి కుదిస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా, ఇతర ప్రాంతాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఎస్కార్ట్,పైలేట్ వాహనాల మినహ జిల్లాలలో 12 వాహనాలకు పరిమితం చేస్తు నిర్ణయం తీసుకుంది.
అధికారిక సమావేశాలలో భాగంగా, ఇతర రాష్ట్రమంత్రులను సన్మానించడాన్ని కూడా నిషేధిస్తూ మంత్రి వర్గం నిర్ణయం వెలువరించింది. సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర సమయంలో 2 నిముషాలు ఆపవచ్చని తెలిపింది. అంబులెన్స్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. వీటితో పాటు పలు విధాన పర నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే
Comments
Please login to add a commentAdd a comment