ప్రతీకాత్మక చిత్రం
గువాహటి: అసోంలో తొలి కరోనా మరణం నమోదైంది. హైలాకంది జిల్లాలో 65 ఏళ్ల వ్యక్తి కోవిడ్-19 సోకి ఎస్‌ఎంసీహెచ్ ఆస్పత్రిలో మరణించినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో నమోదైన మొట్ట మొదటి కరోనా మృతి ఇదే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం అసోంలో ఇప్పటివరకు 28 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారే కావడం గమనార్హం. అసోం నుంచి 617 మంది జమాత్‌కు హాజరైనట్లు ఆరోగ్య శాఖ అంచనా వేసింది.
కాగా, లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా కరోనా వ్యాప్తి నివారణ చర్యలు కొనసాగుతాయని హిమంత బిశ్వాస్ శర్మ ఇంతకుముందు ప్రకటించారు. లాక్‌డౌన్ తర్వాత తమ రాష్ర్టంలోకి అనుమతించే వారి విషయంలో పర్మిట్ వ్యవస్ధను ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు 5,856 కోవిడ్ కేసులు నమోదు కాగా, 169 మరణాలు సంభవించాయి. గురువారం ఒక్కరోజే 591 మంది కోవిడ్ బారిన పడగా, 20 మంది చనిపోయారు.
(చదవండి: ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment