గువహతి: ‘‘ ఆల్ మోస్ట్ నాకు తెలిసి 30 ఏళ్ల క్రితం అనుకుంటా. అప్పుడు నా వయస్సు 17 ఏళ్లు. హిమంత బిశ్వ శర్మ వయస్సు 23 ఏళ్లు. హిమంత గువహతి కాటన్ కాలేజీలో చదువుతున్నాడు. ఓ రోజు హిమంత నాతో ‘మీ అమ్మకు చెప్పు హిమంత బిశ్వ భవిష్యత్‌లో అస్సాం ముఖ్యమంత్రి అవుతాడని’ చెప్పాడు’’ అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 30 ఏళ్ల క్రితం తనతో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు ఆయన భార్య రింకి భూయాన్ శర్మ.
ఇటీవల బీజేపీ సీనియర్ నేత, నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ అస్సాం నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య రింకి భూయాన్ శర్మ తన ఆనంద క్షణాల్ని మీడియాతో పంచుకున్నారు. ‘‘ 30 ఏళ్ల క్రితమే హిమంత తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది. ఎలాంటి పదవి బాధ్యతలు చేపడతారో నాకు చెప్పారు. 23 ఏళ్ల వయస్సులో నాతో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఈ ఆనంద సమయాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment