కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అస్సాం సీఎ హిమంత బిస్వా శర్మ మధ్య మాటల యుద్ధం నడుసతోంది. రాహుల్ చేపట్టిన‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు.
దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కూడా అస్సాం సర్కారే అని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలోనే ప్రజా ధనం ఎక్కువ లూటీ అవుతున్నదని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు.. ఇక్కడి ప్రజల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టుతున్నారని ఆరోపించారు. అస్సాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము పోరాటం చేస్తామన్నారు.
తాజాగా రాహుల్ విమర్శలపై అస్సాం సీఎం స్పందించారు. అవినీతి సీఎం అంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. గాంధీ కుటుంబం కంటే ఎక్కువ అవినీతి పరులు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఏ విమర్శలైనా అవి తనకు ఆశీర్వాదంగా భావిస్తానని తెలిపారు. ఇది తమను తాము అత్యంత శక్తివంతమైన వారిగా భావించే (గాంధీ కుటుంబం) వారితో పోరాడేందుకు శక్తినిస్తుందని తెలిపారు.
అయితే తానే ఒక్కటి మాత్రమే అడగాలనుకుంటున్నాని.. గాంధీల కంటే అవినీతిపరులు ఎవరైనా ఉండగలరా అని ఎద్దేవా చేశారు. బోఫోర్స్ కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ స్కామ్, భోపాల్ గ్యాస్ ఘటన, 2G స్కామ్, బొగ్గు కుంభకోణం మొదలైనవి
కాగా మణిపూర్‌లో ప్రారంభమైన రాహుల్ యాత్ర నాగాలాండ్ ఆ తరువాత అస్సాంలో సాగుతోంది. జనవరి 25 వరకు రాష్ట్రంలోనే పర్యటించనున్నారు. అస్సాంలో 833 కిలోమీటర్లు, 17 జిల్లాల మీదుగా ప్రయాణించనున్నారు. తరువాత మేఘాలయాలో అడుగుపెట్టనున్నారు.
మరోవైపు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్‌లో మార్పులు చేయడంతో పోలీసులు.. తాము ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి యాత్రను మళ్లించినట్లు అస్సాం పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment