అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు కావాలని రాహుల్ అడిగారని.. ఆయన(రాహుల్) రాజీవ్ గాంధీకే పుట్టారనే ఆధారాలను బీజేపీ ఎప్పుడైనా అడిగిందా? అంటూ హిమంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్త రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై తాజాగా రాజీవ్ గాంధీ తనయ, రాహుల్ సోదరి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.
మా అమ్మ గురించి వాళ్ళు అలా అని ఉండకూడదు. దేశం కోసం అమరుడైన ఒక ప్రధాని(రాజీవ్ గాంధీ)కి భార్య ఆమె. తన భర్త చావును, ముక్కలైన భర్త మృతదేహాన్ని ఇంటికి తేవడాన్ని ఆమె తన కళ్లారా చూశారు. అయినా మా అమ్మ తన జీవితాన్ని దేశం కోసమే అంకితమిస్తోంది. అలాంటి ఆవిడ గురించి అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఆమెను ఈ మురికిలోకి లాగుతారు? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ప్రియాంక గాంధీ.
ఎన్నికల్లో విలువలు, సిద్ధాంతాలు, సమస్యలపై పోరాడాలని, ఇతరులను అవమానించడం, ఇలాంటి పనికిమాలిన విషయాలపై కాదని ప్రియాంక గాంధీ, బీజేపీని ఉద్దేశించి హితవు పలికారు. యూపీ మూడో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం రాయ్ బరేలీ ప్రచారంలో పాల్గొన్న ఆమె ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో పైవ్యాఖ్యలు చేశారు.
చదవండి: రాహుల్‌కు మద్దతుగా కేసీఆర్ ఫైర్.. అసోం సీఎం ‘ఎవిడెన్స్’ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment