గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ను అస్సాం పోలీసులు అడ్డుకోవడంతో రాష్ట్ర రాజధాని గువాహటి ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
500 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాహుల్ మంగళవారం ఉదయం గువాహటి సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ ర్యాలీ గువాహటి రోడ్లపైకి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని కార్యకర్తలు దూసుకురావడంతో వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు.
రూట్ చేంజ్ చేసుకోండి: సీఎం
అంతకుముందు గువాహటి రోడ్లపై రాహుల్ యాత్రకు సీఎం హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వర్కింగ్ డే రోజు కావడంతో కీలక నగరమైన రహదారులపై యాత్రను అనుమతించడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిపింది. ఈ మార్గానికి బదులుగా ర్యాలీని దిగువ అస్సాం దిశగా జాతీయ రహదారి మార్గంలో చేపట్టాలని సూచించింది. నగరం చుట్టూ రింగ్ రోడ్డుపై ఉన్న 27వ నెంబరు జాతీయ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లాలని కోరింది.
చట్టాన్ని ఉల్లంఘించలేదు:రాహుల్
దీనిపై రాహుల్ ఘాటుగా స్పందించారు. గతంలో భజరంగ్ దళ్ ఇదే మార్గంలో నడిచిందని, అంతేగాక బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడ ఇదే రూట్‌లోర్యాలీ చేపట్టారని గుర్తు చేశారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదా అని ప్రవ్నించారు. అయితే పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్‌లను దాటుకొని వచ్చామన్న రాహుల్.. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు. తామను బలహీనులుగా భావించవద్దని హెచ్చరించారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల శక్తికి నిదర్శనమన్నారు.
రాహుల్‌పై కేసు నమోదుకు సీఎం ఆదేశం
గువాహటి సరిహద్దుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కార్యకర్తల ప్రవర్తనపై అస్సాం సీఎం హిమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు గానూ కేసు ఫైల్ చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలనే సాక్ష్యాలుగా పరిగణించాలని చెప్పినట్లు తెలిపారు.
#BigBreaking
— Sohom Banerjee (@Sohom03) January 23, 2024
Assam Chief Minister Himanta Biswa Sarma is trying hard to cause trouble for Rahul Gandhi and the Bharat Jodo Nyay Yatra in Assam by using brute force.
Himanta Biswa Sarma has crossed all limits by using his administration.
Himanta sent Assam police to detain… pic.twitter.com/cYQmKLzhoA
అస్సాం ప్రజలను ప్రభుత్వం అణచివేస్తోందని రాహుల్ ఆరోపించారు. మేఘాలయాలో విద్యార్ధులతో తన ఇంటరాక్ట్‌ను రద్దు చేశారని ప్రస్తావించారు. విద్యార్ధులు నన్ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదన్న కాంగ్రెస్ నేత.. అయినప్పటికీ వారు తనను కలవడానికి బయటికి వచ్చినట్లు తెలిపారు. ఇకర అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ. మేర జనవరి 25 వరకు రాహుల్ యాత్ర కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment