ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తాను పెంచుకునే గడ్డం విషయంలో తన సలహాలు పాటిస్తాడని ఎద్దేవా చేశారు. సీఎం హిమంత ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘2022లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సమయంలో భారీ గడ్డంతో ఉన్నారు. అప్పుడు అచ్చం ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అన్నాను. అనంతరం రాహుల్ తన గడ్డం మొత్తం తీసివేశారు. ఇప్పుడు ‘‘అమూల్ బాయ్’’లా ఉన్నారని అన్నాను. నేను రాహుల్ గాంధీని సద్దాం హుస్సేన్‌తో పోల్చితే గడ్డం మొత్తం తీసివేశారు.
.. మళ్లీ నేను ‘అమూల్ బాయ్’ గా ఉన్నారని అనేసరికి చిన్నగా గడ్డం పెంచారు. రాహుల్ గాంధీ నా సలహాలు పాటిస్తారు. రాహుల్ గాంధీ టీ షర్ట్ ధరించడాన్ని చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు. కానీ ప్రతిపక్షానికి నేృత్వత్వం వహించే వ్యక్తి.. ఒక కుర్రాడిలా టీ షర్ట్ వేసుకోవటం మన దేశ దురదృష్టం’’ అని సీఎం హిమంత సెటైర్లు వేశారు.
ఇక.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం బుక్ చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పట్టుకున్న బుక్ ఎరుపులో రంగులో ఉండటంతో అది భారత్ రాజ్యాంగం కాదని.. చైనా రాజ్యాంగం అంటూ హిమంత విమర్శలు గుప్పించారు. భారత రాజ్యాంగం బుక్ నీలం రంగులో ఉంటుందని తెలిపారు. అయితే హిమంత మాటలకు కాంగ్రెస్ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment