రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు | Assam Cm Himanta Sensational Comments On Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు

Published Fri, May 3 2024 6:58 PM | Last Updated on Fri, May 3 2024 7:22 PM

Assam Cm Himanta Sensational Comments On Rahul Gandhi

గువహటి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ పాకిస్తాన్‌లో పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.

‘పాకిస్తాన్‌లో రాహుల్‌గాంధీ చాలా పాపులర్‌. ఒకవేళ పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగితే అక్కడ రాహుల్‌గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్‌ను పాకిస్థాన్‌లో మేం ఓడించలేం. అయితే పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతుంది’అని హిమంత సెటైర్లు వేశారు. 

రాహుల్‌గాంధీ శుక్రవారం(మే3) తన పాత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి నామినేషన్‌ వేసిన వేళ హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement