హిమాంత బిస్వా శర్మ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ/అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని బీజేపీ నేత హిమాంత బిస్వా శర్మ ధీమా వ్యక్తం చేశారు. త్రిపురలో విజయం సాధిస్తే.. నాగాలాండ్‌లోనూ మా కూటమి మళ్లీ సొంతం చేసుకుంటామని ఆయన అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత పలు అంశాలు ప్రస్తావించారు. మరోవైపు త్రిపురలో బీజేపీ, సీపీఎం మధ్య రసవత్తర పోరు జరుగుతోంది.
'త్రిపురలో సొంత మెజారిటీతో నెగ్గి తీరుతాం. నాగాలాండ్‌లో మిత్రపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మేఘాలయాలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే ఇతర పార్టీలతో చర్చించి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని' హిమాంత బిస్వా శర్మ తెలిపారు. అయితే త్రిపురను విడగొట్టేందుకు సిద్ధంగా లేమని బీజేపీ ఇదివరకే స్పష్టం చేసింది. కానీ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఓ కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సభ్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్రిపురలో నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్‌డీపీపీతో జత కట్టగా.. ఎన్‌డీపీపీ 40 చోట్ల, బీజేపీ 20 చోట్ల పోటీ చేశాయి.
త్రిపుర ఎన్నికల కౌంటింగ్‌లో వామపక్షాలు 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ అభ్యర్థులు 28 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. నాగాలాండ్ లో ఎన్‌డీపీపీ-బీజేపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ 29 స్థానాల్లో దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment