![Ecovacs Winbot W2 Is Climbing At Ces 2024 - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/02/4/ai.jpg.webp?itok=lI-ImYTT)
ఇంట్లోని నేల, గోడలు శుభ్రం చేయడం ఒక ఎత్తు అయితే, కిటికీలను శుభ్రం చేయడం మరో ఎత్తు. కిటికీలను ఇంటి లోపలి వైపు భాగాన్ని ఎలాగోలా శుభ్రం చేయవచ్చు. వెలుపల ఉన్న భాగాన్ని శుభ్రం చేయడం కష్టమే! అంతస్తుల కొద్ది నిర్మించిన అపార్ట్‌మెంట్లలోనైతే ఇది మరీ పెద్ద సమస్య.
అంత శ్రమ లేకుండా కిటికీలను అన్ని వైపుల నుంచి ఇట్టే శుభ్రపరచగల రోబోను అమెరికన్ కంపెనీ ‘ఇకోవాక్స్’ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ‘విన్‌బో డబ్ల్యూ2’ పేరిట కిటికీలను శుభ్రం చేసే ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ ఇటీవల జరిగిన ‘సీఈఎస్–2024’ షోలో సందర్శకులను ఆకట్టుకుంది.
స్విచాన్ చేసుకుంటే చాలు, మనకు ఎలాంటి శ్రమ కలిగించకుండా ఇది కిటికీలను తళతళలాడేలా శుభ్రపరుస్తుంది. కిటికీ అద్దాలపై పేరుకున్న దుమ్మును మూల మూలల నుంచి తొలగిస్తుంది. వాటిపై ఉన్న మరకలను పూర్తిగా తుడిచేస్తుంది. దీని ధర 339.99 డాలర్లు (రూ.28,267) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment